goNuguDu.

భావి ప్రధానిని కాదు నేనే ఇప్పటి ప్రధానిని


ఇటీవల విజయవాడలో కాలేజి అమ్మాయిల మధ్య మన రాకుమారుల వారు తనని భావి ప్రధానిగా పిలవొద్దని సెలవిచ్చారు. అసలు ఇప్పుడు పాలి౦చేది తమ కనుసన్నలలోనే అయితే చిరాకుగా భావి ప్రధాని అనడంతో అసహనానికి గురైనట్టున్నారు. మమ్మీ మాట జవదాటేవారే లేనప్పుడు, తమ అధికారానికి పగ్గాలే లేనప్పుడు పిచ్చి జనాలు డిసీజ్ద్ కోటాలకు అలవాటు పడి వున్నప్పుడు తమ అధికారిక ప్రకటన కోసం ఇంతలా వెర్రి వె౦గలప్పలలా ఎదురుచుస్తున్నంత కాలం తన రాజసాన్ని ఇలా ఒలకబోయడ౦లో తప్పేముంది. ఎక్కడో వున్నా అమేథీ ఎం.పీ.గారు ఇలా పిచ్చాపాటి కబుర్లకు ఇక్కడకు ఎ హోదాలో వే౦చేసారో ఎవరైనా అడిగిన పాపాన పోలే.

ఇది సామాన్యుడి వేట.