Uncategorized

అయ్య బాబోయ్..


Heatwave_PTI_0_0

ఈ వేసవికే జనం ఇలా పిట్టల్లా రాలిపోతూ అల్లల్లాడుతుంటే ఇంక రాబోయే రోజులు అసలు మనం ఈ తెలుగు నేలపై మనగలమా? ఉత్తరాంధ్రా అంతా ప్రకృతి సిధ్దమైన బీలభూములను కొల్లగొట్టి బొగ్గు కుంపటిగా మార్చుతూ, తడ నుండి ఇచ్చాపురం వరకు  తీర ప్రాంత ఇసుకతో ప్రమాదకరమైన లోతువరకు తవ్వి సిలికాన్ ఫ్యాక్టరీల నిర్మాణం, ఇటు రాష్ట్ర రాజధాని నిర్మాణం పేరుతో లక్షల ఎకరాల పంట పొలాలలో కాంక్రీట్ నగర నిర్మాణం, గుండెలపై కుంపటి లాంటి  అణువిద్యుత్ కేంద్రం నిర్మాణం ఈ నేలను ఎడారిగా మార్చేందుకు  ఇంకెంత కాలం పట్టదు కదా?  రెడీ టు డై..

అనవసరమైన హైప్ ఎందుకు బాబు?


సీమాంధ్ర ప్రజల పట్ల నిజమైన ప్రేమాభిమానాలు వుంటే చంద్రబాబు హైదరాబాద్ రాజధానిలోనే పాలన సాగించి అక్కడున్న సెట్లర్సుకు భరోసాగా వుండేవాడు. విజయవాడ-గుంటూరు మద్య వున్న తన కులపోళ్ళ భూములకు రియల్ బూం కల్పించేందుకే ఈ రెండిళ్ళ సిద్ధాంతం చెప్తున్నాడు.

ఈయన అటూ ఇటూ టూర్లకు అధికార్లు పడే ఆయాసం పాలన మరింత కుంటుపడుతుంది. ఈయన ఢిల్లీ యాత్రలకు రెండిళ్ళ కాపురానికి ఇప్పటికే అప్పుల ఊబిలో లోటు బడ్జెట్లో వున్న సీమాంధ్ర నెత్తిమీద ఈ తాటికాయ పడి మరింత భారమై కుంగిపోతుంది. ఈయన గారికి ఈయన మంత్రులకయ్యే రక్షణ వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. ఇదంతా అవసరమా?

మీ మీ ప్రచారార్భాటాలను కొద్ది కాలం ఆపండిరా బాబులు.

 

సి.ఏం.ప్రమాణస్వీకారానికి ప్రధాని రావడమేంటి. వచ్చి ఆ గౌరవాన్ని మంటగలుపుతారో లేదో చూడాలి.

అనవసరమైన హైప్ ఎందుకో?

అభివృద్ధి అంటే బుల్ డోజర్ తో ఖాళీ చేయించడమేనా?


tribal

dongria1_screen

అభివృద్ధి అంటే బుల్ డోజర్ తో ఖాళీ చేయించడమేనా?

పక్కింటి వాడి పాదు పాకితేనే ఇల్లు పీకి పందిరేసే నాయాళ్ళంతా వాళ్ళు ఆదివాసులు కాబట్టి నోరు లేని వారని వారి తరపున నిలిచి పోరాడే వారు వుండరన్న ధైర్యంతో ఇలా వారిని ప్రతి చోటా ముంచే పధకాలు వేస్తున్నారు. గుజరాత్లో నర్మదా ప్రాజెక్టు కట్టిన వాడే ఏలికగా వచ్చాడు కాబట్టి వీళ్ళ పాచికలిలా పారుతున్నాయి.

హింస గురించి మాటాడే వారికి ఇందులో హింస కనబడదు. మీరు గుళ్ళోకెల్తే చెప్పులు పోతేనే నెత్తీ నోరు బాదుకుంటారురా? మరి వారికి ఉన్న ఆ కాసింత స్థలాన్ని కూడా ముంచేసి వాళ్ళని వాళ్ళ సంస్కృతిని మీ నీళ్ళలో ముంచేస్తే వాళ్ళెంత బాధ పడతారు. పోలవరం వారికి శాపవరం దుఃఖవరం అవుతున్నది.

పోలవరం వెనక వున్న బహుళ జాతి కంపెనీల అవసరాల కుట్రను గ్రహించండి. ఇది తెలంగాణా సీమాంధ్ర వారి పట్టుదలలకో వైషమ్యాలకో పోయే సమయం కాదు. విలువైన సహజ వనరులు, అటవీ సంపద ఈ నీళ్ళలో మునిగి భవిష్యత్ తరం పర్యావరణ ముప్పు బారిన పడే ప్రమాదం గ్రహించండి. ఇప్పటికె భూకంపాలకు, సముద్రాగ్రహానికి దగ్గరగా జరుగుతున్నం. భారీ ప్రాజెక్టుల బారిన పడి కూచున్న కొమ్మను నరుక్కునే మూర్ఖత్వానికి పోవద్దు.

ఏలికల వ్యాపార కుట్రలను బహిర్గతం చేయండి. వారి వారి కులాల పెట్టుబడిదారులు భూస్వాముల తొత్తులయి యిలాంటి ప్రాజెక్టులను తెస్తున్నారు. నిర్వాసితుల పట్ల ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారో మన కళ్ళముందే అనేక ఉదాహరణలున్నాయి.

ఇది ఒక్క ఆదివాసీల సమస్య మాత్రమే కాదు. మన జీవన్మరణ సమస్యకూడా.

ఓ మానవతా మూర్తులారా మీ కళ్ళకు గట్టిన అభివృద్ధి గంతలూడదీయండి.

సత్తిబావ్ ఏటైపోతాడేటప్పా…


చిత్రం

అప్పోలప్పా ఎంకటప్పా ఈ రోజంతా టీవీ సూసేసినానే. మజ్జాన్నం వన్నం తిన్నేల్లకి అటూ ఇటూ ఎవులేలతారో తేలిపోనాదే అప్పా. నువ్వా బస్ దిగి వచ్చేటేలప్పటికి అంతా సద్దుమణిగిపోయినాది. అప్పా ఏ మాటకా మాట సెప్పుకోవాల.  ఇలపింటి తీరుపు నేనెప్పుడు సూడనేదప్పా. మన సత్తిబావ్ ఏటి పదవినేకపోవడమేటి. ఇంట్లో ఒక్క తమ్ముడూ బామ్మర్ది పెళ్ళామూ గెలవకపోవడమేటి. ఎన్నెన్ని పంచీసినాడప్పా నాలుగోట్లుంటే ఇన్వెర్టర్లంట ఎల్ సీడీలంట, పది దాటి ఓట్లున్నోళ్ళకి పల్సర్ బళ్ళంట. సినిమాల్దీసిన లాబమూ, మందమ్మిన లాబమో కానీ పంచి పెట్టీసినాడనుకో. అబ్బో బావ్ వత్తే జనమే జనం. బావు దళసరి నాలుకతోటి మాటాడుతుంటే ఈలలే ఈలలూ. అయినా కానీ అప్పా  సొమ్ములూ పోయి పదవీ రాకపోతే బావ్ ఏటైపోతాడోనని బెంగొట్టుకున్నాదప్పా. 

అదేట్నేదునేయే రాములప్పా!  మనోడు సిన్నోడా సిటికోడనుకున్నావేటి. అటు మన కాపోడేనట  పవన్ బాబు బాబు పంచనే వున్నాడుకదా. ఆడితోని సినిమాలు తీసి యింత గడించినాడుగందా. మనోడికేటి రాజకీయం యిరామం దీసుకున్నా  మందాపారం సినిమా యాపారాలున్నాయి కదేటి. మరేటి పర్నేదప్పా, పదా నాకీ బస్సులబడి వచ్చేసరికి నడుం పీకుతున్నాదీ. నీకూ టీవీ జూసీ జూసీ కళ్ళు లాగేసినాయి. యింత ముద్ద దిని తొంగుందాం. 

ఏ మొగుడూ దొరకనప్పుడూ…


ఏ మొగుడూ దొరకనప్పుడు అక్క మొగుడే గతిలా ఈ రాష్ట్రానికి రోజుకో మొగుడొస్తుంటాడు, కాళ్ళూ చేతులూ, కళ్ళు కూడా లేని వికలాంగులులా వాడి చుట్టూ చేరి నవ్వులు చిందిస్తారు. మన ఖర్మకి ఇలాంటి స్థితి దాపురించింది. రోజుకో కొత్త పథకం ప్రకటించి మూడు రోజులకొకసారి ఢిల్లీ పరుగెత్తి తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి అధికారాన్ని అధిష్టానం కాళ్ళు మొక్కుతూ కాపాడుకుంటేనే సరిపోతొంది. వీళ్ళ వలన జనానికి ఒరిగిందీలేదు.

సామాన్యుడా నీ ఓపికకు వేన వేల వందనాలు..

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే..


ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకుందుకు నిప్పు తీసుకున్నాడంట ఒకడు. అలా ప్రాణాలు పోతూ ఒకవైపు గంగ ముంచెత్తుతూంటే శవాల దగ్గరున్న డబ్బు కోసం పరుగెత్తే మనుషులు మన మద్య వున్నారు. 5 కోట్ల రూపాయల బాంకు డబ్బు మాయం. అందులో 80 లక్షలు ఒక బాధితుడి మూటలో దొరకడం. కొట్టుకు పోతున్న శవాలను ఒడ్డుకు లాగి ముక్కూ చెవుల బంగారం దోపిడీ.

ఇలా మనిషి అర చేతుల్లో ప్రాణాలు ఉగ్గబట్టుకున్నా పాము నోట్లో వున్న కప్ప కళ్ళెదుట ఈగను నాలుక చాచి మింగిన చందాన మనిషి స్వార్థం బట్ట బయలు కావడం విషాదం.

బాటిల్ మంచినీళ్ళు వంద రూపాయలుకు అమ్మడం, బిస్కట్ పేకెట్ రెండు వందలు, తలదాచుకోవడానికి పూటకు వేల రూపాయలు వసూలు చేయడం మనుషుల వ్యాపార మనస్తత్వానికి పరాకాష్ట,

తెలుగు వాడు మనిషి కానట్టు నెట్టేయడం మన భారతీయ తత్వాన్ని ప్రశ్నించలేదా?

ఆపన్న హస్తాల మద్య రాజకీయ రంగు వేసుకోవడం విషాదం.

మానవత్వమా నీవెక్కడా??kedarnaath

బొగ్గు – సి.బి.ఐ. – జగన్ – ధర్మాన


ప్రపంచంలోనే అతిపెద్ద స్కాంగా అనుమానింపబడుతున్న బొగ్గు స్కాం పై దర్యాప్తు నివేదికను ముందుగా అధికార పార్టీ మంత్రులకు చూపించి ప్రతిపక్షం వారిని ఇరికించే ప్రయత్నాలు చేస్తూ దేశంలో అతిపెద్ద దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టు వారి మొట్టికాయలు తిన్నా తన అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే తీరును సిగ్గు లేకుండా ప్రపంచానికి చాటి చెప్తూ వుంది.

అధికార పార్టీలో వున్న వారిని అరెస్టు చేయాలంటే గడువులిస్తూ వారు తప్పించుకునేందుకు అనుకూలిస్తూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్క చర్య జరిగినా వారి ఇంటిపై సిబిఐ విరుచుకుపడుతోందనడానికి మొన్న తమిళనాడులో స్టాలిన్ ఇంటిపై జరిగిన దాడి తార్కాణం. ఇలా వ్యక్తుల స్వేచ్చను హరించే కుట్రకు అధికార పార్టీకి ఆయుధంగా మారింది ఈ ప్రభుత్వ శాఖ. ధర్మానకో న్యాయం మోపిదేవికో న్యాయం. జగన్ కో న్యాయం రాజాకో న్యాయం. ఈ పక్షపాత ధోరణి ఖండిద్దాం.

సరబ్ జిత్ పై దాడి – పాక్ కుట్ర


సరబ్జిత్ సింగ్ పై పాకిస్తాన్ జైల్లో దాడి జరిగి ఆయన కోమాలోకి వెళ్ళిపోవడం మెరుగైన వైద్యం కోసం భారత్ కు పంపించమని ప్రాధేయపడ్డా తిరస్కరించడం చూస్తుంటే ఈ దాడి కావాలనే చేసి ఉరి తీస్తే వచ్చే పరిణామాలనుండి తెలివిగా తప్పించుకునేందుకు ఆయనపై తీవ్రంగా దాడి చేసి కొన ఊపిరితో వున్న వాడిని ఆసుపత్రిలో చేర్చడం ద్వారా కసబ్ ఉరికి పాక్ ఇలా పగ తీర్చుకుంటోందనిపిస్తోంది.. కాదంటారా?? మన మీన మేషాలు లెక్కించే ప్రభుత్వం దీనిపై సరిగా స్పందించక పోవడం శోచనీయం.

రాంబాబు చెప్తే ఉద్యమాలు ఆగిపోతాయా??


రాంబాబు సినిమాలోని డైలాగులకే ఉద్యమాలు ఆగిపోతాయా?? లేక జనం రోడ్లపైకి వచ్చి రాజకీయ నాయకుల గల్లాలు పట్టుకొని తమ డిమాండ్లౌ సాధించేస్తారా?? సినిమాకు అంత కెపాసిటి వుందా?? కూచున్న రెండు గంటల్లో పల్లీలు తినడానికి పక్క సీట్లో కూచున్న వారిపై లుక్కేస్తూ చొంగ కార్చుకునే జనం సినిమాలు చూసి ఏదో పొడిచేస్తారని వాటిని కత్తెర వేయడం పిరికి తనమే! అంత బలహీనమైన ఉద్యమాలా మీవి?? విమర్శను తట్టుకోలేక ప్రతి దాన్నీ నిషేధించుకుంటూ పోతే యింక ఏం చూస్తారు? ఏం వింటారు??

భద్రం కొడకో…


బొమ్మబొమ్మ
వీళ్ళ అధికార దాహం కోసం పాదయాత్రల సందర్భంగా వీళ్ళ భద్రత కొరకు వందల కోట్ల ప్రజా ధనం,  జనం విలువైన సమయం, లక్షల పనిగంటలు వృధా అవసరమా??
 
అధికారంలో వున్నప్పుడు వీడియో కాన్ఫరెన్సులతో అభివృద్ధి సమీక్షలు జరిపే వారు ప్రజల కష్ట నష్టాలు పట్టకుండా ప్రజా భాగస్వామ్యం లేని తమకు తోచిన మూర్ఖపు అభివృద్ధి నమూనాలు ప్రజల నెత్తిన రుద్ది, వాళ్ళ రక్త మాంసాలతో తమ ధన దాహాన్ని తీర్చుకున్న పాలక వర్గాలు వారి కోసమే తమ నడక అంటూ ఇప్పుడు వారి పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు…
 
భద్రం కొడకో…