హితబోధ

ఓదార్పు ఎవరికి కావాలి?


వై.ఎస్.ఉప్పుతిన్న విశ్వాశానికో, వ్యాపార సంబంధాల వలననో గానీ మొయిలీ యిచ్చిన హామీతో సాయంత్రానికి యింటికె చేరుకునే సరికి అధినేత్రి హుకుంతో తన ఉనికికే ముప్పు వచ్చేదిగా ఉండటంతో మొయిలీ సార్ హామీల మెయిల్ దిగిపోయి అబ్బెబ్బె అలా అనలేదు. నన్నెవరూ అడగలేదనేసారు. దీంతో పాటు పుండుమీద కారంలా తనతో యిన్నాళ్ళు గొంతుకలిపిన మంత్రులలో అర్థ శాతం మంది రోశయ్యను వెనకేసుకొస్తూ తనను బహిరంగంగా విమర్శించడం జరిగింది.

రాజకీయ పరిణతి లేమితో , వంశపారంపర్యంగా వచ్చిన దుడుకుతనం, మొండితనం తనను ఏకాకిని చేయడంతో యిక ఓదార్పు ఎవరికి కావాలంటారు?

పెళ్ళికి ముందే అది తప్పుకాదు..సుప్రీం


పెళ్ళి చేసుకోకుండా సహజీవనం, పెళ్ళికి ముందే శృంగారం అనేవి తప్పుకాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

2005 లో ఖుష్బూ చేసిన వ్యాఖ్యల వలన ఆమెపై తమిళనాడులో  22 కేసులు నమోదయ్యాయి. వాటిపై ఆమె సుప్రీం కోర్టునాశ్రయించగా నిన్నటి విచారణలో న్యాయమూర్తులు వీటిపై పై విధంగా స్పందించారు. ఆమె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, వాటి వలన ఎంతమంది ఆడపిల్లలు ప్రభావితులయ్యారు, ఎంతమంది ఆడపిల్లలు లేచిపోయారని ప్రశ్నించింది. మనం ఆరాధిస్తున్న రాధాక్రిష్ణులది సహజీవనమే కదా అని గుర్తుచేసారు. అనైతికమన్నదానిని నేరమయముద్ర వేయవద్దని సుప్రీం సూచించింది.

యిది వ్యక్తిగత నైతికతకు సంబంధించిన అంశం. ఇది ఎవరికి వారు నిర్ణయించుకొని అనుసరించాల్సిన విషయం. పెళ్ళికి ముందు అనుభవంపై సర్వేలలో మనదేశంలో  ఆ మధ్య ఎక్కువశాతమే ఒప్పుకుంటున్న గుర్తు. మారిన కాల మాన పరిస్థితులలో స్త్రీ పురుష సంబంధాలలో వస్తున్న మార్పులు ఇరువురి మద్య ఈ విషయం ఆమోదం పొందుతున్నట్లుగానే కనిపిస్తోంది.

ఇక్కడ మరో విషయం కూడా దాగివుంది. పురుషులు చేస్తే తప్పుకాదు, అది స్త్రీ వైపునుండే పరిశుద్ధతను కోరుకోవడం. మారిన సామాజిక వాతావరణంలో స్త్రీ నాలుగ్గోడలమద్య బందీగా లేనప్పుడు తానూ వీటి ప్రభావానికి గురౌతోంది. అందుకే చర్చనీయాంశమయ్యింది. నాడు మానసిక వ్యభిచారమె నేరమన్న కాలం నుంచి పబ్ లు, పార్టీలు, డేటింగ్ లు పెరిగిన కాలంలో  ఇది సామాజిక ఆమోదం పొందినట్లుగానే భావించొచ్చా? ఔననే అనుకుంటున్నా.


ABN ఆంధ్రజ్యోతి చానల్ పై దాడి గర్హనీయం


ఈ రోజు ప్రరాపా కార్యకర్తలు(?) ABN చానల్ కార్యాలయంపై దాడి చేయడం గర్హనీయం. నిన్న పెద్ద గొంతుతో హైదరాబాద్ ఫ్రీజోన్ పై తెలంగాణాను ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించి మాటాడిన వాసిరెడ్డి పద్మ తమ పార్టీ పెట్టుబడులు తిరిగిరాక చానా యిబ్బందులలో వున్నామని అన్నారనా విషయాన్ని చానల్ లో ప్రసారం చేసి వార్త రాయడాన్ని జీర్ణించుకోలేక రౌడీ మూకలతో చానల్ ఆఫీసుపై దాడి చేయడం అంతా ఖండించాల్సిన విషయం. ప్రేమే మార్గం, సేవే ద్యేయం అన్న మాటలు వల్లించడానికే తప్ప work out కాకపోయేసరికి యిలా విరుచుకు పడడం వారి భవిష్యత్ రాజకీయాలకు మంచిది కాదు. యిప్పటికే ప్రజలలో అయోమయం పార్టీగా ముద్రపడిపోయిన ప్రరాపా పాపం తమ అసహనాన్ని యిలా పత్రికా, మీడియా రంగాలపై చూపడం మంచి పద్దతికాదు. యింకో నాయకుడు ముందుగా అనుకుంటే 5000 మందితో వెళ్ళే వాళ్ళమని వాళ్ళ విలేకరితో లైవ్ లో అంటాడు. వీళ్ళు రాజకీయం చేసి, పాలనలోకి వద్దామనుకున్న వాళ్ళేనా? లేక గూండా గిరి చేసి నాలుగు రాళ్ళు సంపాదిద్దామనుకుంటున్నారా? ఈ అయోమయం ముందుగా clear చేసుకుంటే ప్రజలు ready గా వున్నారు.

“వాడిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..” గుర్తొస్తోంది..