స్వగతం

భద్రం కొడకో…


బొమ్మబొమ్మ
వీళ్ళ అధికార దాహం కోసం పాదయాత్రల సందర్భంగా వీళ్ళ భద్రత కొరకు వందల కోట్ల ప్రజా ధనం,  జనం విలువైన సమయం, లక్షల పనిగంటలు వృధా అవసరమా??
 
అధికారంలో వున్నప్పుడు వీడియో కాన్ఫరెన్సులతో అభివృద్ధి సమీక్షలు జరిపే వారు ప్రజల కష్ట నష్టాలు పట్టకుండా ప్రజా భాగస్వామ్యం లేని తమకు తోచిన మూర్ఖపు అభివృద్ధి నమూనాలు ప్రజల నెత్తిన రుద్ది, వాళ్ళ రక్త మాంసాలతో తమ ధన దాహాన్ని తీర్చుకున్న పాలక వర్గాలు వారి కోసమే తమ నడక అంటూ ఇప్పుడు వారి పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు…
 
భద్రం కొడకో…

దాహమేస్తోంది..


దాహమేస్తోంది
చల్లని మంచినీళ్ళు తాగాలని వున్నా
ఎక్కడా కాసిన్ని దొరకవే!
పేకట్లలో కొచ్చిన నీళ్ళుతో
ఈ గొంతెండుతోంది..

నీళ్ళను కూడా సరుకుగా చేసిన
బేహారుల మధ్య
అమ్మతనం కోల్పోతూ
దాహమేస్తోంది…

కరచాలనమిచ్చి
గట్టిగా కావలించుకొని
కడుపారా కలబోసుకోవాలనుకుంటే
ఒక్కడు అగుపడడే!
చెవిలో మోగే సెల్తో
ఎన్ని సెకన్లని మాటాడుతావు
ఉన్నావా వుంటే
పర్వాలేదులే మళ్ళీ చేస్తా
అన్న మాటతో
దాహమేస్తోంది…

ఈ చుట్టూ వున్న
ఎడారితనం మధ్య
ఒంటెల బిడారిలా
సాగిపోతూ
దాహమేస్తోంది…