సౌందర్యం

కొండను మేస్తున్న మేఘాలు..


ఈ రోజు ఉదయంనుండి మేఘాలుకమ్ముకున్న వాతావరణం. ఎండలు తగ్గి చల్లగా వున్న వాతావరణంలో మిట్ట మధ్యాహ్నం వేళ మిత్రుని బండి వెనక వస్తూ మా చుట్టూ వున్న కొండలు చూస్తుంటే ఈ ఆహ్లాదకర దృశ్యం కనిపించింది. ఇలా కొండలపై ఆవరించిన మేఘాలను చూస్తే మా ప్రాంతంలో మేఘాలు కొండల్లో మేస్తున్నాయిరా అంటారు. ఆ దృశ్యం మీ కోసం..


ముంగురుల మాటున..ఆలవోకగా అలా తను తల విసరగానే
ఒక్కసారిగా తన మోముపై పడ్డ ముంగురులు
తన వెన్నెలంటి ముఖారవిందాన్ని
ఆబగా చుంబించి దాచివేయగా
మూగబోయింది మనసు..