బాధ్యత

వీధులన్నీ మావే..


విధివెక్కిరింత

 

 

 

 

 

 

 

 

 

 

 

ఎవరో విసిరేసిన ఎంగిలాకులులా
ఇలా ఈ రోడ్డు పక్కన
దొర్లుకుంటూ ఎక్కడినుండో
ఓ సుడిగాలికి చిక్కిన
చెత్త కాగితంలా ఇలా
ఎగురుకుంటూ
ఒకరినొకరం
ఓదార్చుకుంటూ
మట్టిలో మగ్గుతున్న
మా బతుకులిలా
గాలిపటంలా మారినందుకు
ఎవర్నీ నిందించలేము…

ఏటికి ఎదురీదడం
నేర్చుకుంటున్న చేపపిల్లలం…

మీమీ భధ్రమయ జీవితాలలో
మా కంపు సోకనివ్వం
మా పుట్టుక చావులతో
మిమ్మల్నిబ్బంది పెట్టం…

మీ బడ్జెట్ కందని మా
ఖాళీ కడుపు
మీ లోటు లెక్కలనడగదులెండి..

ఇప్పుడెవర్నీ నిందించలేము
కారణాలేవైనా
వత్తిడిగొన్న జీవితాల
గతితప్పిన బతుకు
చిత్రపటాల చిరిగిన
బొమ్మలం…

కానీ
రేపెప్పుడో
మాకూ వెలుగు దొరకదా అని
ఎదురుచూపు…

కనుమరుగవుతున్న కుండలు


పండగలలోనో లేక చావుకో తప్ప మనం వాడకం మరిచిపోయిన కుండలు కనుమరుగవ్వడంతో ఒక చేతి వృత్తుల కులమే తమ జీవనాధారాన్ని కోల్పోయి నేడు వేరే మార్గాల్ని వెతుక్కోవాల్సి వచ్చింది. కుమ్మర్ల జీవితాలు తీవ్రమైన సంక్షోభానికి గురయ్యాయి. కుండల తయారీకి వాడే మట్టి దొరకక, కాల్చేందుకు సరిపడా ఊక, కఱ, అసలు చోటే దొరక్క వారు తమ వృత్తినే వదులుకోవాల్సివచ్చింది. ఈరోజు అలా బజారులో నడుస్తుంటే అంతా ఒక్కసారిగా కుండని కొనేందుకు మూగడం చూసి క్లిక్ మనిపించాలనిపించి మీతో ఇలా పంచుకోవాలనిపించింది. మనం మన సంస్కృతికి దూరమవుతూన్న క్రమంలో కొన్ని వేల కుటుంబాలు తమ వృత్తిని కోల్పోయి తద్వారా తమ జీవనాధారాన్ని కోల్పోవడంతో పాటు వారి ఉనికే కనుమరుగవుతున్న చేదు నిజం మింగుడుపడట్లేదు.

లలిత – మరో యాసిడ్ హత్య


యిటీవల తెనాలిలో యాసిడ్ దాడికి గురైన తొమ్మిదో తరగతి చదువుతున్న లలిత ఈ రోజు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందింది.

ఈ దాడి జరిగిన రోజు TV9 మొ.న చానళ్ళ వారి కథనంలో ఈ అమ్మాయి దాడి చేసిన సుబ్బారావును ప్రేమించి మరల మరో అబ్బయితో సన్నిహితంగా వుండటం మూలంగా ఈ దాడి జరిగినట్లు కథనం ప్రసారం చేసారు.

అసలు ఆ అమ్మాయి వయసు సుమారు 16 సం.లు వుంటాయి. ఆ వయసు అమ్మాయికి ప్రేమ గురించి ఏమాత్రం అవగాహన వుంటుంది. ఈ చానళ్ళ కథనంలో తన అక్కను కూడా చేర్చారు.

ప్రేమ పేరుతో జరుగుతున్న యిటువంటి పాశవిక దాడులను అరికట్టేందుకు సామాజిక బాధ్యత ముఖ్యం. చదువుతున్న పిల్లలకు మానసిక పరిపక్వత రాకముందే వివిధ రకాల ప్రభావాలకు లోనవ్వడంతో యిటువంటి మూర్ఖుల చేతులలో యిలా అమాయకు బాలికలు బలి కాబడుతున్నారు. ముఖ్యంగా టీవీ మాధ్యమం పెరిగిన తరువాత సీరియల్స్, నేర కథనాలు నట్టింట్లో చొరబడి మనసులను పాడుచేస్తున్నాయి. అలాగే హైస్కూల్ వయసు పిల్లల ప్రేమ కథలతో తీస్తున్న బూతు సినిమాలు చాలా వరకు దోహదం చేస్తున్నాయి. మరో అంశమేమంటే అతి చౌకగా దొరుకుతున్న మల్టీ మీడియా సెల్ ఫోన్ ల ద్వారా అరచేతిలో బ్లూ ఫిల్మ్ లు వారి మెదళ్ళను భ్రష్ఠు పట్టిస్తున్నాయి. వీటన్నింటిని అరికట్ట గలిగిన నాడు, ప్రతి ఒక్కరు యిది తమ వంతు బాధ్యతగా ఫీలయ్యిన నాడు మాత్రమే యివి తగ్గుతాయి.

నేరం జరిగాక చట్టాలు చేస్తామన్న పాలకులున్నంతవరకు మన ప్రారబ్ధం యింతే..