కీచకసంతానం

ఎందుకింత పైత్య ప్రకోపం? కీచకసంతానమా?


విశాఖపట్నం జిల్లా కలెక్టరు వారి ఆఫీసు ముందు గత 7 నెలలుగా తాము వండుతున్న మధ్యాహ్న భోజన పథకానికి బిల్లులు చెల్లించమని అరిచిన పాపానికి ఆ పేదమహిళలపై అంత కౄరంగా విరుచుకుపడి, రక్తాలు కారేలా కొట్టి, వివస్త్రలను చేయాల్సిన అవసరమేమొచ్చింది. ఖాకీ పైత్యానికి పరాకాష్ట యిది. ప్రభుత్వ గూండాలుగా మారిన వీరిపై అత్యాచార నిరోధక చట్టంకింద కేసు పెట్టాలి. అదుపులేని వీరి వీర ప్రతాపం అబలలపై చూపడానికి కారణం వారు సి.పి.ఎం. అనుబంధ సంఘానికి ప్రాతినిధ్యం వహించడం కూడా కారణం కావచ్చు. ఆడవారిపై ఇలానే ప్రవర్తించమని వీళ్ళకు కొత్త పోలీసు రాజ్యాంగ శక్తి ఏమైనా ఆదేశాలిచ్చిందా? ప్రజలను, ప్రశ్నించేవారిని తీవ్ర భయాందోళనలకు గురిచేయడం నేటి పరిపాలనా రహస్యమా? అక్కడ ముఖ్యమంత్రిగారు నేను అత్యంత ప్రశాంతంగా వున్నా.. అంటున్నది తమ అనుచరగణం వీరంగం చూసా? ఒక మహిళా హోం మంత్రి కింద పనిచేసే సిబ్బంది ఇలానే ప్రవర్తిస్తారా? కొద్ది రోజులు వీళ్ళకి మానసిక చికిత్స ఇప్పించాల్సిన అవసరముందనిపిస్తోంది. కాదంటారా?

(Photo courtesy: Andhrajyothi e-paper dt.17-02-10)