అసంపూర్ణం

సంకెళ్ళు….


ఏదో ఖాళీతనం వెంటాడుతోంది..

దాపరికం లేనితనం కాలు నిలవనీయడంలేదు..

ఆవరించుకున్న మబ్బులనుండి జారే

తేనె చినుకులకై ఆత్రంగా పైకి చూపు..

హఠాత్తుగా మెరిసిన మెరుపు

గురిచూసి గుండెల్లో దించిన బాణం

వేలిచివర మిగిలిన చివరి బొట్టు

తిరిగి ఒళ్ళంతా పాకి

నిలబెడుతున్న క్షణం..

రవ్వంత వెలుగుతో సృష్టిస్తున్న కాంతివలయం…

పొందికలేని పదాల కవితమల్లే

చిందర వందరైన ఆలోచనల గుబురునుంచి

బయటపడలేనితనం…

పరుగు కోసం వేసిన మొదటి అడుగు….

మడమకు అడ్డంగా పడి చీరుతున్న సంకెళ?