మద్యతరగతి

సామాన్యుడి నెత్తిమీద బడ్జెట్ బాంబు


నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్యుడిని ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అలానే దిగువ మధ్యతరగతి వారిని మరింత కుంగదీసేట్లుగావున్నాయి.

సబ్సిడీలను తగ్గించుకుంటు వస్తున్న బడ్జెట్ ప్రతిపాదనలు దీంతో పూర్తిగా మరింతగా బట్టబయలై సామాన్యుడి నడ్డివిరిచేదిగా తయారయ్యింది. ఆర్థిక మంత్రి ఎవరైనా మన ప్రధాన మంత్రిగారి సంస్కరణల విరాట్ స్వరూపం ఆవిష్కృతమవుతోంది.

దేశ ఋణభారం 39,44,598 కోట్లు కాగా తలా ఒక్కీంటికీ 34,300 రూ.ల అప్పు సర్దారు.

అర్థ రాత్రి నుంచి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో యిప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు మరింత పెరిగి సామాన్యుల జీవన స్థితిగతులు పూర్తిగా అడుగంటే ప్రమాదముంది.

ప్రభుత్వ రంగ సంస్థలనుండి పెట్టుబడుల ఉపసంహరణ వలన ప్రైవేటుస్వామ్యంవైపు పూర్తిగా మొగ్గుచూపుతూ,  జీవన భద్రతనుండి వెనుకంజ వేస్తోంది.

ఎరువుల సబ్సిడీలకు 12 శాతం మేర తగ్గించడంతో పాటు MRP కూడా అవసరం లేదనడం రైతుల మెడవిరిచే పని మరింత షురూ చేసినట్లే. యిప్పటికే పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, మార్కెటుకు తనకు వచ్చే ధరకు హస్తిమసికాంతరం తేడాతో ఏమీ పాలుపోని రైతన్నకు ఆత్మహత్యలే శరణ్యం.

గత బడ్జెట్ లలానే కేటయింపులకు, నిధుల విడుదలకు పొంతనలేక సామాన్యుడి బతుకు మరింత బారం కావడం ఖాయం.

కాకిలెక్కలతో ఆర్థిక సంక్షోభంనుండి బయటపడ్డామని డంబాలు పలకడమే తప్ప ప్రణాలికాబద్ధమైన కృషి జరపడంలో విఫలమవుతూనే వున్నాం…

డయాబిటస్ ప్రబలకుండా ‘పవార్’ చిట్కా


దేశంలో అపరిమితంగా పెరిగిపోతున్న ధరలు చుక్కలనే కాదు ఎక్కడికో పోతున్న క్రమంలో, ప్రభుత్వ పరంగా ఏమీ చేయలేని మన కేంద్ర మంత్రివర్యులు తమ స్వంత పత్రిక ‘రాష్త్ర వాది’ ద్వారా ఒక నిజాన్ని వెల్లడించారు. ప్రజలు చప్పటి పథ్యం పాటించడం ద్వారా మధుమేహంనుండి దూరంగా వుంచబడుతారని, తద్వారా చక్కెర వినియోగం తగ్గి ధరలు తగ్గవచ్చని సెలవిచ్చారు.

చక్కెర, ఉప్పు విషతుల్యాలని కూడా మన డా. మంతెన సూర్యనారాయణ గారిలా ప్రవచించారు. మొత్తమ్మీద ప్రజల ఆరోగ్యం పట్ల యింత శ్రద్ధ వున్న వ్యవసాయ మంత్రిని ముందెన్నాడూ చూడని  దేసప్రజలది ఎంత అదృష్టం.

ఎంతసేపూ తనకు కామధేనువులా సిరులు కురిపించే BCCI వ్యాపారాలతో బిజీగా వుండే మంత్రిగారికి తన పోర్ర్టుపోలియో ఏదో మర్చిపోయి చాలా రోజులయ్యింది. ధరలకు తనకు సంబంధంలేదని విలేకరులు అడిగితే చిరాకుపడుతుంటారు.

ఆర్థికశాఖ వారికి తమ స్వంత రాష్ట్రంలో పనులతో బిజీ. ప్రధానమంత్రిగారికి చాలా పనులు. ఏమైనా అంటే కమిటీ వేసేస్తారు. ధరల నియంత్రణకు కూడా కమిటీ వేసారు. ఆ కమిటీ రిపోర్టు వచ్చేలోపు బతికివున్న వారు తక్కువధరలకు కొనుక్కోవచ్చు.

సర్వేజనా సుఖినోభవంతు…

ఈ ఒక్కరోజు పర్స్ తీయొద్దు


మనలో పెరిగిన వస్తు వ్యామోహం అనవసరపు ఖర్చులతో కష్టఫలాన్ని వృధా చేస్తోందన్న సత్యాన్ని తెలియచెప్పడానికి ఈ రోజును అంతర్జాతీయంగా బైనథింగ్ డే గా పాటిస్తున్నారు. నిత్యమూ ఏదో ఒక వస్తువును అవసరమున్నా లేకపోయినా కొనడం, ఎవరి దగ్గరో వున్నవి నా దగ్గర లేవని వెంపర్లాడడం, అవసరము లేకపోయినా సెల్ ఫోన్ లో మాటాడటం ఇలా చిన్నవిగా కనిపిస్తున్న అంశాలే మన జేబులకు చిల్లు పెట్టి ఆనక అవసరమైన దానికి అప్పుకు పరుగులు తీయిస్తోన్న మన మనసు గుఱానికి కళ్ళెం వేయడానికి తొంభైరెండు,  సెప్టెంబరులో వాంకోవర్ లో మొదలైన ఉద్యమం నేడు ప్రపంచవ్యాప్తమయి అందరిని జాగరూకులను చేస్తోంది. థాక్స్ గివింగ్ డే (థన్యవాదాలు తెలుపుతూ పెద్ద ఎత్తున బహుమతులు ఇచ్చుకునే రోజు) జరుపుకున్న మరుసటి రోజు దీనిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

సామాన్య మధ్యతరగతి ఆదాయ వర్గాలలో నేడున్న వివరీత వినియోగ మనస్తత్వాన్ని అదుపులో వుంచుకునేందుకు ఇది దోహదపడుతుంది కాబట్టి మనమంతా ఈరోజు పర్స్ లవైపు చేయిని పోనీయొద్దు.