పెనుభారం

పతకాలకు మరీ యింత భారీ నజరానాలా?


ఇటీవల తెలంగాణా సి.ఎమ్. గారు సానియా మీర్జాను తమ బ్రాండ్ (ఇదేమిటో కొత్త మార్కు) అంబాసిడర్ గా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ప్రకటిస్తూ కోటి రూపాయలు తన శిక్షణ కోసం ప్రకటించారు. అలాగే ఇటీవల ముగిసిన యూ.ఎస్. ఓపెన్ చాంపియన్షిప్ లో పెద్దగా పేరులేని మిక్స్ డ్ డబుల్ టైటిల్ సాధించిందని మరో కోటి రూపాయలు ప్రకటించారు. ప్రజల సొమ్మును మంచినీళ్ళ ప్రాయంగా (ఇదీ ఇప్పుడు ప్రియమైపోయింది) తమ బాబు జేబులో కన్నమేసి ఇచ్చినట్టుగా ఇచ్చేస్తున్నారు. తాను తెలంగాణాను ఏలిన నైజామ్ వారసుడుగా అనుకుంటున్నారా సార్ వాడు. అసలు వ్యక్తిగత క్రీడాకారులకు అసలు ఈ క్రీడలకు ఇంతింత సొమ్ము దొబ్బ పెట్టడం అవసరమా? దానివలన ఏమైనా ఉత్పత్తి జరిగి నలుగురికి తిండి పెట్టేదుందా? నిజానికి మన గ్రామీణ క్రీడాకారులకు అసలు ఇటువంటి అవకాశాలు వస్తున్నాయా? ఎంతో మంది వాలీబాల్, కబడ్డీ మొ.న ఆటగాళ్ళు తమ వ్యక్తిగత ప్రతిభతో పతకాలు సాధించాక చదువుతో పాటు మెరిట్ సర్టిఫికేట్ చూపి ఉద్యోగాలలో వాటా పొందుతారు. లేని వాళ్ళు ఏ హోటళ్ళలోనో సర్వర్ లుగా బతుకీడ్చే వాళ్ళే ఎక్కువ. అసలు పాఠశాల స్థాయిలో వ్యాయామ అంశాలకు ఏమాత్రం ప్రాధాన్యం యిస్తున్నాం. వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించినంతవరకు వీటిని ప్రోత్సహిస్తే సరిపోతుంది. అంతే కానీ యిలా ఖరీదైన స్థలాలు డబ్బు ప్రజల కష్టార్జితాన్ని అప్పనంగా ధారపోస్తుంటే అంతా నోరెళ్ళబెట్టి చూడడమే తప్ప ఎవరూ వాటిని ఖండించడం లేదు. దానివలన వచ్చే కీర్తి ఎవరి భుజాలకు చేరుతుంది. వీళ్ళకి రక రకాల పేర్లతో బిరుదులు ఈ మద్య భారత రత్నలు ఇస్తున్నారు. ఇదంతా అనవసర ఆర్భాటం. క్రీడలు వ్యక్తిగత దారుఢ్యానికి తప్ప వాటి వలన ఒరిగేదేమీ వుండదు. ప్రజల ఉత్పత్తి సామర్థాన్ని దెబ్బతీసే క్రికెట్ ప్రసారాలు నిషేధించాల్సిన అవసరమెంతైనా వుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా కానీ ఈ సానియా మానియా మన నాయకుడికి ఎందుకో యింతన్నది ఆ పెరుమాళ్ళకే ఎరుక…

పిల్లి గుడ్డిదయితే ఎలకేదో చూపించిందంట?


అసలీ బ్రాండ్ ఎంబాసిడర్ లేంటీ. ఇదేమైనా కంపెనీ వ్యాపారమా? లేక IPL బేరమా? రాష్ట్రాలను ప్రజల ఆస్తిగా చూడరా వీళ్ళు. వ్యాపార కేంద్రాలుగా మార్చేసి అమ్మి పార దొబ్బుతారా? జనంకోసమే మా ఉద్యమం జనం కోసమే ఇదంతా అని ఇప్పుడిలా కోట్లాది రూపాయలు వీళ్ళ బాబు సంపాదించిందాంట్లోంచి ఇచ్చినట్లు నజరానాల రూపంలో ఇస్తూ ఫోజులు కొడుతుంటే వీళ్ళ చుట్టూ చేరి భజనలా? మీ ….మ్మా? బూతులొస్తున్నాయిరా చూస్తుంటే. జనం రోజూ ఏదో ఒక కారణంతో చస్తూ బతుకుతుంటే మీ వేషాలిలా. తన ముడ్డి కాకపోతే కాశీ దాకా డేకమన్నాడంట ఎవడో? అత్త సొమ్ము అల్లుడు ధారపోసినట్లు జనం సొమ్ము మీ ప్రచారార్భాటాలకు ఖర్చు పెడతారా? చేవ చచ్చిన ఆటగాళ్ళకి కోట్ల రూపాయలా? వర్షం పడితే కారి దొబ్బే బడికి పైకప్పు బాగు చేయించండిరా అంటే సవాలక్ష సాకులతో రూపాయి విదిల్చని మీరు ఇలా చేయడం భావ్యమ? పిల్లి గుడ్డిదయితే ఎలకేదో చూపించిందంట? జనం యిలా వున్నంత కాలం మీ గారడీ చెల్లుబాటవుతుందనా? ఛీ..

ఇద్దరు ముసలి దంపతులకు 360 గదులవసరమా??


New_Delhi_1964654c
మన నేతలంతా మనకు సుద్దులు చెప్పేవాళ్ళే.. కరెంటు వాడొద్దంటారు, గాస్ వాడకం తగ్గించేలా చర్యలు తీసుకుంటారు, భోజనం మానేయమంటారు.. పెట్రోలు డీజిల్ వాడకం కూడా .. ఇలా అన్నీ తగ్గించేసుకోమంటారు..

కానీ వీళ్ళ అధికార భవంతులలో జరుగుతున్న దుర్వినియోగమెంతో ఆలోచించరు. ఇద్దరు ముసలి దంపతులుండటానికి 360 గదులున్న రాష్ట్రపతి భవనం అవసరమా? ఇంక ప్రధానమంత్రి, పార్టీల అధ్యక్షులు, మంత్రులు, ఎం.పీలు, ఎం.ఎల్.ఏలు ఇలా వీళ్ళ విలాసవంతమైన జీవన విధానం వలన వృధా అవుతున్న ప్రజా ధనం, మానవ వనరులు ఎంతెంత??

ఇంక IAS, IPS, Group I Officer, న్యాయాధీశులు ఎంతలా అధికార దుర్వినియోగంతోపాటు తమ విలాసవంతమైన జీవితాలను ప్రజల డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారో మన కళ్ళ ముందు జరుగుతున్నవే.

ఇదంతా ఈ ప్రజాస్వామ్య దేశంలో సర్వ సాధారణంగా నడిచిపోతున్న విషయాలు. కూటికి నోచని కోట్లాది కుటుంబాల కంచాలను లాక్కుంటు వీళ్ళనుభవిస్తున్న ఈ రాజసాలను ప్రశ్నించి అడ్డుకోవాల్సిన అవసరముంది…

కాదంటారా??

అంతా కూరుకుపోయారు..అయినా..


పందికొక్కులు

ఇంత పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణాలలో కూరుకుపోయిన కేంద్ర ప్రభుత్వాన్ని మునుపెన్నడూ ఎరగం…ఒక్కొక్కరు తీహార్ కు పయనమవుతున్నా ఇంకా ఒకరి వెనక వొకరు నిలబడుతూ డప్పాలు కొడుతున్నారు. ఇంతగా బీరాలు పోయిన వారు తమ చేతులు శుభ్రంగా వున్నాయని ధైర్యంగా చూపలేని పరిస్థితులలో కూడా ఇంకా జనం సొమ్ముతో విదేశాలలో పర్యటించడం చూస్తుంటే అశ్యమేస్తుంది..ఇప్పటికైనా మించిపోయింది లేదు.. ఆ కాస్తా పరువుపోకుండా  మొత్తం కేబినెట్ రాజీనామా చేసి ప్రజల ముందు నిలబడాల్సిన అవసరం వుంది..ఇన్ని లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలతో దేశం పరువు తీస్తూ అంతర్గత భద్రత ఒక్కటే ప్రధాన ముప్పుగా ప్రకటించడం, ఎక్కడికక్కడ బలగాలతో జనంపైకి విరుచుకుపడడం చూస్తుంటే వీళ్ళని బహిరంగంగా …..వేయాలనిపిస్తోంది.  ప్రజల ధనం లూటీ చేసింది చాలక ప్రజల ప్రాణాలను హరించే కుట్రకు పాల్పడుతున్న వీరికి పాలించే అర్హత లేదు.. పార్లమెంట్ ను పందులదొడ్డి అన్నది నిరూపించారు మరోసారి….

ఈ మంట కొద్ది సేపేలేరా???


మళ్ళీ పెరిగిన పెట్రోలు ధర
ఓ రెండు దినాలు ధర్నాల హడావిడి
మేమైతే ఇలా చేసే వాళ్ళం కాదని అలా ఊడబొడిచేసే వాళ్ళమని బండి లాగేవాడొకడు

రంగు రంగుల జెండాల బాండ్ మేలాం గోలలు
దిష్టిబొమ్మల దగ్ధాలతో తృప్తి పడిపోయి
చల్లగా బంకుకు చేరి మూసుకొని పోసుకుపోతాం….

ఇది తెలిసిన గెడ్డం వెనకాల ఓ పిల్లి మీసపు నవ్వు వెక్కిరిస్తూనే వుంటుంది….

తూ..నా బొడ్డు జీవోలు..


చిన్నప్పుడు ఆటల్లో చేసే చిన్న చిన్న పొరపాట్లకు ఉమ్ము తడితో బొడ్డుపై రాసుకొని తూ నా బొడ్డు అంటే వదిలేసే వారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో వస్తున్న జీవోలు అలానే వెనక్కు మరలుతున్నాయి. ముఖ్యమంత్రికి తెలియకుండానే అధికార గణం జీవోలు జారీ చేయడం, ఆ తదుపరి అబ్బే ఏదో తెలియక జరిగిపోయిందంటూ దానికి మరల సవరణ జీవో విడుదల. పరిపాలనపై పట్టు లేకపోవడం, అధికార గణం తమ ప్రాబల్యాన్ని యిలా చూపే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది.

నిన్న విడుదలైన బి.సి.విద్యార్థుల ఫీజు రియింబర్స్ మెంటు జీవో కూడా యిలానే ఏడ్చింది. చివరికి సి.ఎం.గారు తూ నాబొడ్డు అనడంతో ఆ జీవోకు సవరణ వచ్చింది. కార్పొరేట్ కళాశాలలలో చదివే విద్యార్థులకు యికపై ఆ ఉపకార వేతనాలు యివ్వకుండా ప్రభుత్వ జూ.కళాశాలలకు 100 కోట్లు రిలీజ్ చేద్దామన్న మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల నిర్ణయానికి తలూపినందుకు అది నిజమేననుకొని మరో మాట లేకుండా ఉత్తర్వులిచ్చేసారు. అది రేపిన, రేపబోయే గాలి దుమారంను గ్రహించి మరల దానికి సవరణ తెచ్చారు. అసలు ఆ పథకంతో ప్ర.జూ.కళాశాలలు మూతపడే స్థితికి వచ్చాయి. ఆరోగ్యశ్రే తో ప్రభుత్వ దవాఖానాలలో  మందుల కొరత ఏర్పడి జ్వరాలతో మూలుగుతున్నట్లు యివి కూడా అలా తయారయ్యాయి. కార్పొరేట్ రంగాన్ని పెంచి పోషించేందుకు ఉపకరించేవిగా మారిన ఈ రెండు పథకాలు కొంత లాభమున్నా అధిక మొత్తంలో నష్టాన్నే చేకూర్చి, ప్రభుత్వానికి తెల్ల ఏనుగులా తయారయ్యాయి. వై.ఎస్.పథకాల జోలికి పోతే యువరాజు ముప్పేట దాడి చేస్తుండటంతో ఈ వయసులో నాకెందుకొచ్చిన తంటా అనుకుంటున్న సి.ఎం. చేష్టలుడిగి నీరసపడిపోతున్నారు. చివరకు అవి రాష్ట్రానికి గుదిబండలా మారిపోయాయి. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలనుకోవడంలో తప్పు లేదు కానీ, ప్రభుత్వ కళాశాలలను నిర్వీర్యం చేయడం వలన భవిష్యత్తులో దారులు మూసుకుపోయాక అక్కడకూడా శూన్యమైపోతే విద్యార్థుల భవితవ్యం ఏమిటి?

ఉత్తరప్రదేశ్ ప్రజల గుండెలపై ఏనుగు


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కు.మాయావతి పరిపాలన వారి గుండెలపై ఏనుగు బరువును మోస్తున్నట్లుగా సాగుతోంది. వేల కోట్ల ప్రజాధనంతో రకరకాల పార్కుల పేరుతో తనవి, తన గురువు విగ్రహాలను నిర్మించడం, సుప్రీం ఆదేశాలను కూడా తన ఏనుగు పాదాల కింద అదిమి ఇప్పుడు తన విగ్రహాల రక్షణకు కోట్ల రూపాయల వ్యయంతో స్వంత సేన ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటే వీళ్ళని ప్రజలు ఎందుకు, ఎలా ఎన్నుకుంటున్నారో, వారి పరిపాలనను ఎలా భరిస్తున్నారో అర్థంకావడంలేదు నా మట్టిబుఱకి. తన సామాజిక వర్గాన్ని వెలుగులోకి తెచ్చే కార్యక్రమాలేవి చేపట్టకుండా, తన అనుంగు పోలీసు బాసులను నియమించడం, ఎవరెన్ని తిట్టినా తన ఏనుగు చెవులకు వినబడకపోవడం చూస్తుంటే వీళ్ళు సామాన్య జనం యొక్క భావోద్వేగాలతో ఆడుకుంటూ తమ నియంత పాలన సాగిస్తున్నారని అనిపిస్తోంది. యింక ఈమె భవిష్యత్ లో ప్రధాన మంత్రి అయితే కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు తన విగ్రహాలతో నింపేస్తుందేమో? ప్రజల ఓపికకు వేల దండాలు….

సామాన్యుడి నెత్తిమీద బడ్జెట్ బాంబు


నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్యుడిని ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అలానే దిగువ మధ్యతరగతి వారిని మరింత కుంగదీసేట్లుగావున్నాయి.

సబ్సిడీలను తగ్గించుకుంటు వస్తున్న బడ్జెట్ ప్రతిపాదనలు దీంతో పూర్తిగా మరింతగా బట్టబయలై సామాన్యుడి నడ్డివిరిచేదిగా తయారయ్యింది. ఆర్థిక మంత్రి ఎవరైనా మన ప్రధాన మంత్రిగారి సంస్కరణల విరాట్ స్వరూపం ఆవిష్కృతమవుతోంది.

దేశ ఋణభారం 39,44,598 కోట్లు కాగా తలా ఒక్కీంటికీ 34,300 రూ.ల అప్పు సర్దారు.

అర్థ రాత్రి నుంచి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో యిప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు మరింత పెరిగి సామాన్యుల జీవన స్థితిగతులు పూర్తిగా అడుగంటే ప్రమాదముంది.

ప్రభుత్వ రంగ సంస్థలనుండి పెట్టుబడుల ఉపసంహరణ వలన ప్రైవేటుస్వామ్యంవైపు పూర్తిగా మొగ్గుచూపుతూ,  జీవన భద్రతనుండి వెనుకంజ వేస్తోంది.

ఎరువుల సబ్సిడీలకు 12 శాతం మేర తగ్గించడంతో పాటు MRP కూడా అవసరం లేదనడం రైతుల మెడవిరిచే పని మరింత షురూ చేసినట్లే. యిప్పటికే పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, మార్కెటుకు తనకు వచ్చే ధరకు హస్తిమసికాంతరం తేడాతో ఏమీ పాలుపోని రైతన్నకు ఆత్మహత్యలే శరణ్యం.

గత బడ్జెట్ లలానే కేటయింపులకు, నిధుల విడుదలకు పొంతనలేక సామాన్యుడి బతుకు మరింత బారం కావడం ఖాయం.

కాకిలెక్కలతో ఆర్థిక సంక్షోభంనుండి బయటపడ్డామని డంబాలు పలకడమే తప్ప ప్రణాలికాబద్ధమైన కృషి జరపడంలో విఫలమవుతూనే వున్నాం…