అభివృద్ధి అంటే బుల్ డోజర్ తో ఖాళీ చేయించడమేనా?

tribal

dongria1_screen

అభివృద్ధి అంటే బుల్ డోజర్ తో ఖాళీ చేయించడమేనా?

పక్కింటి వాడి పాదు పాకితేనే ఇల్లు పీకి పందిరేసే నాయాళ్ళంతా వాళ్ళు ఆదివాసులు కాబట్టి నోరు లేని వారని వారి తరపున నిలిచి పోరాడే వారు వుండరన్న ధైర్యంతో ఇలా వారిని ప్రతి చోటా ముంచే పధకాలు వేస్తున్నారు. గుజరాత్లో నర్మదా ప్రాజెక్టు కట్టిన వాడే ఏలికగా వచ్చాడు కాబట్టి వీళ్ళ పాచికలిలా పారుతున్నాయి.

హింస గురించి మాటాడే వారికి ఇందులో హింస కనబడదు. మీరు గుళ్ళోకెల్తే చెప్పులు పోతేనే నెత్తీ నోరు బాదుకుంటారురా? మరి వారికి ఉన్న ఆ కాసింత స్థలాన్ని కూడా ముంచేసి వాళ్ళని వాళ్ళ సంస్కృతిని మీ నీళ్ళలో ముంచేస్తే వాళ్ళెంత బాధ పడతారు. పోలవరం వారికి శాపవరం దుఃఖవరం అవుతున్నది.

పోలవరం వెనక వున్న బహుళ జాతి కంపెనీల అవసరాల కుట్రను గ్రహించండి. ఇది తెలంగాణా సీమాంధ్ర వారి పట్టుదలలకో వైషమ్యాలకో పోయే సమయం కాదు. విలువైన సహజ వనరులు, అటవీ సంపద ఈ నీళ్ళలో మునిగి భవిష్యత్ తరం పర్యావరణ ముప్పు బారిన పడే ప్రమాదం గ్రహించండి. ఇప్పటికె భూకంపాలకు, సముద్రాగ్రహానికి దగ్గరగా జరుగుతున్నం. భారీ ప్రాజెక్టుల బారిన పడి కూచున్న కొమ్మను నరుక్కునే మూర్ఖత్వానికి పోవద్దు.

ఏలికల వ్యాపార కుట్రలను బహిర్గతం చేయండి. వారి వారి కులాల పెట్టుబడిదారులు భూస్వాముల తొత్తులయి యిలాంటి ప్రాజెక్టులను తెస్తున్నారు. నిర్వాసితుల పట్ల ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారో మన కళ్ళముందే అనేక ఉదాహరణలున్నాయి.

ఇది ఒక్క ఆదివాసీల సమస్య మాత్రమే కాదు. మన జీవన్మరణ సమస్యకూడా.

ఓ మానవతా మూర్తులారా మీ కళ్ళకు గట్టిన అభివృద్ధి గంతలూడదీయండి.

One comment

  1. ఏడుపుగొట్టు వెధవలు విడిపొయినందుకు చాలా, చాలా ఆనందంగా వుంది. ఇన్నాళ్ళు అబద్దాలు, విషం, విద్వెషాలా మధ్య మనం సాధించిందంత అప్పనంగా సాని దాని అండ చూసుకొని దోచుకున్నారు తెలబాన్లు. కాని ఆంద్రులకున్న ఏకైక ఆస్తి వాళ్ళ శ్రమ, కష్ట పడే తత్త్వం, సాహసం, ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. విద్యుత్, నీళ్ళు, ఆంధ్రుల శ్రమతొ నిర్మించిన హైదరబాద్ దోచుకున్నా తెలబాన్లలొ ఇంకా అభద్రతా భావం ఎందుకు? వాళ్ళకు భయం, అందుకే వాళ్ళకు అలవాటైయిన ఏడుపు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. అసూయ, ద్వెషాలతొ రగిలిపోతున్నారు. ఒకటి మాత్రం నిజం, తెలబాన్లు పాకిస్తాన్లా తయరవుతారు, వాళ్ళకి ఆంధ్రుల మీద ద్వెషం లేకపోతే మన లేరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s