సత్తిబావ్ ఏటైపోతాడేటప్పా…

చిత్రం

అప్పోలప్పా ఎంకటప్పా ఈ రోజంతా టీవీ సూసేసినానే. మజ్జాన్నం వన్నం తిన్నేల్లకి అటూ ఇటూ ఎవులేలతారో తేలిపోనాదే అప్పా. నువ్వా బస్ దిగి వచ్చేటేలప్పటికి అంతా సద్దుమణిగిపోయినాది. అప్పా ఏ మాటకా మాట సెప్పుకోవాల.  ఇలపింటి తీరుపు నేనెప్పుడు సూడనేదప్పా. మన సత్తిబావ్ ఏటి పదవినేకపోవడమేటి. ఇంట్లో ఒక్క తమ్ముడూ బామ్మర్ది పెళ్ళామూ గెలవకపోవడమేటి. ఎన్నెన్ని పంచీసినాడప్పా నాలుగోట్లుంటే ఇన్వెర్టర్లంట ఎల్ సీడీలంట, పది దాటి ఓట్లున్నోళ్ళకి పల్సర్ బళ్ళంట. సినిమాల్దీసిన లాబమూ, మందమ్మిన లాబమో కానీ పంచి పెట్టీసినాడనుకో. అబ్బో బావ్ వత్తే జనమే జనం. బావు దళసరి నాలుకతోటి మాటాడుతుంటే ఈలలే ఈలలూ. అయినా కానీ అప్పా  సొమ్ములూ పోయి పదవీ రాకపోతే బావ్ ఏటైపోతాడోనని బెంగొట్టుకున్నాదప్పా. 

అదేట్నేదునేయే రాములప్పా!  మనోడు సిన్నోడా సిటికోడనుకున్నావేటి. అటు మన కాపోడేనట  పవన్ బాబు బాబు పంచనే వున్నాడుకదా. ఆడితోని సినిమాలు తీసి యింత గడించినాడుగందా. మనోడికేటి రాజకీయం యిరామం దీసుకున్నా  మందాపారం సినిమా యాపారాలున్నాయి కదేటి. మరేటి పర్నేదప్పా, పదా నాకీ బస్సులబడి వచ్చేసరికి నడుం పీకుతున్నాదీ. నీకూ టీవీ జూసీ జూసీ కళ్ళు లాగేసినాయి. యింత ముద్ద దిని తొంగుందాం. 

ప్రకటనలు

5 comments

  1. ఓసి పిచ్చి నాసెల్లి. సాతిబావ్ కేటవుతాదే! మల్లీ సంపాయిత్తాడు ఇచ్చినోళ్ళకాడినుంచే. మల్లీ సారా అమ్ముకోడా. నీకేటి దిగుల్నేదు.

  2. ఓలప్పా? ఆడికేటవుతాది.సంపాయించినాడు కాదేటి. ఆదంతా కరుసు పెట్టుకోదానికే ఆడికి పత్తరాలు కూడ సాల్దు. కాని మనోల్లు బలే కొట్టినారు సావు దెబ్బ.దిమ్మ తిరిగి బొమ్మ అవుపడినాది సత్తిగోడికి.బొచ్చు పీకి పడేసినారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s