ఆప్కో వస్త్రాలను కొందాం..

apco_logo-------final_0
ఈ రోజు సాయంత్రం విజయనగరంలో గంటస్తంభం దగ్గర్లోని ఆప్కో వారి షాపులో దుప్పటి, తువాలు, లుంగీ కొన్నాను. బిల్ చెల్లించే సమయంలో సేల్స్ మేనేజర్ థాంక్సండీ అంటూ సార్ మీరిలా కొనడం ద్వారా చేనేత కుటుంబాలను ఆదుకొన్న వారవుతారు. మాకైతే ఉద్యోగాలున్నాయి జీతాలు వస్తాయి కానీ ఈ వృత్తినే నమ్ముకున్న కుటుంబాలకు తాము శ్రమపడి నేసిన బట్టలు అమ్మబడడం ద్వారా తిండి దొరుకుతుంది. మీకు మరో మారు నమస్కారమంటూ తను కళ్ళలో నీళ్ళు పెట్టుకోవడం చూసిన మాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తప్పకుండా మళ్ళీ వస్తామని మా ఫ్రెండ్ నేను వచ్చాం భారమైన మనసుతో.

మిత్రులారా..
దయచేసి ఆప్కో వారి వస్త్రాలను వీలున్నంత మేర వాడడానికి ముందుకు వచ్చి చేనేత కార్మికులను ఆదుకొనే ఉడతా సాయం చేయగలరని మనవి. ఈ వస్త్రాలు చాలా మన్నికైనవి కూడా.

చేనేత వస్త్రాలను కొందాం. చేనేత కార్మిక కుటుంబాలను ఆదుకుందాం.

ప్రకటనలు

One comment

  1. అసలు ఆ నాణ్యత వేరే బట్టల్లో ఉండదండి. పోచంపల్లి చీర అందం, ధర్మవరం పట్టు చీరల నునుపు, మంగళగిరి చూడీదార్ల మెరుపు కట్టుకునే వాళ్ళకే తెలుస్తుంది. ఖరీదు ఎక్కువైనా మోసం లేని సరుకు ఆప్కోలోనే ఉంటుంది.అయితే తమిళనాడు వాళ్ళ కో ఆప్ టెక్స్ కంటే మనవాళ్ళు అమ్మకాల్లో, వస్తువులు చూపించటంలో చాలా పూర్. కొద్ది మంది మాత్రమే శ్రద్దగా చూపిస్తారు. చాలా శాతం జీతాలు వస్తున్నయ్ కదా అని వినియోగ దారుల్ని పట్టించుకోరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s