తొడ చరిచిన విజయనగరం..

clock tower-viziznagaram 1
గత ఆరు రోజులుగా విజయనగరం కడుపులో దాచుకున్న బిడ్డనుకున్న వాడే కాలితో తంతే తొడ చరిచి నిలబడింది ఈ రోజు. కళ్ళ ముందు నీవు ఆక్రమించుకుంటూ పోతున్న తన భాగాలన్నీ పోయినా బాధపడని విజయనగరం నువ్వు పాలు తాగే రొమ్మునే గుద్దుతా వుంటే చూస్తూ వూరుకోలేక మంటలతో సమాధానం చెప్పింది. కావిడితో సారా అమ్ముకొని పెరిగిన బాబు వారసుడు ఈ రోజు ఇంతింతై అంతై రక్కసిలా మీదపడి పీక నులుముతుంటే చూస్తూ ఊరుకోలేకపోయింది. పసివాడని పిల్లలపై కంట్లో కారం చల్లి చావు దెబ్బలు కొట్టిన వాడి పునాదులు పెకిలించే గునపంగా మారింది.

ఇదంతా ఇక్కడ పోలీసు బాసుగా పని చేసి ప్రమోషనిచ్చి పంపి అదుపు చేయమని అంటే వారికి మేమంతా దొంగలుగా, సంఘ విద్రోహ శక్తులుగా కనబడటంలో ఆశ్చర్యం లేదు. గాలిని బంధించి ఊపిరాడకుండా శక్తిని హరించేద్దామని విఱవీగే వాడికి తొడ చరిచి ఎదురొడ్డి సవాల్ విసురుతోంది మా గున్నమ్మ వారసురాలు.

పాలపేకెట్టు 50 రూపాయలు గుడ్డు 10 రూపాయలుకు కొనుక్కునే స్థితికి నెట్టి ఆకలితో మండించి అదుపు చేద్దామని చూస్తున్నాడు.

బావ్ నువ్విప్పుడు మా తూరుపు కాపోడివి కాదురా బావ్. మాకెప్పుడో తెలిసిపోనాది. నీ మూతివీడని ఇసపు నవ్వులో డబ్బు దర్పంతో కాలెగరేసే దొరతనంతో నువ్వో ఇసప్పురుగువని. నువ్వింక నీ నోట్ల కట్టలలో కాలి పోవాలి తప్ప నీకు మా కంట తడి దూరమైపోనాది.

One comment

  1. నలుగురు నవ్వితె నాకెటి సిగ్గు ఎగ్గు. నా పదవి నా కుటుంబం నా డబ్బు గాక నాకెటి వద్దు. ఉమ్మితె తుడుచుకంటాను. తిట్టితె గాలికొదిలెస్తాను. సోనియమ్మ కాళ్ళె గాక నాకెటి దిక్కు.మరెటి నాను అరిచంద్రుడి బామర్దిని సోనెమ్మ దెవత కాదెటి. ఏటూరికె ఎగిరిపడతన్నరు. నానెందుకని పల్లకుండి పొనాను ఆ యమ్మ నన్ను చీప్ మినిస్టుర్ చెస్తనన్నది కాదెటి. మీరు ఎలగ సంక నాకిపొతె నాకెటి. నెను, మాయావిడ , నా తమ్ముడు చుకంగుండాలి రాహుల్ బాబు పదాని అవ్వాలి. అద్గది అంతే మరి. మీరు మద్దెలొ దూరి కంగాలి చెయ్యకండ్ర బావు మీకు పున్నెముంటాది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s