వీళ్ళంతా ప్రజలే మరి??

నిన్న జగన్ విడుదల అయిన తరువాత ముప్పావు గంటలోపు చేరుకోవాల్సిన వాడు ఆరు గంటలు రాజు వెడలె అన్నట్టు తన కాన్వాయ్ సాఫీగా తాపీగా పోనిచ్చి సాయంత్రం ఇంటికి చేరుకోవాల్సిన జనాల్ని నానా ఇబ్బందుల పాల్జేసి అదనంగా మరో లీటరు పెట్రోలు ఖర్చుకు గురిచేసిన వైనం ఆయన వెంట పడ్డ ఈ మీడియా హంగామా లైవ్ షోలు చూస్తుంటే జైలు కెళ్ళి రావడంలో ఇంత గొప్పదనముందా అనిపిస్తోంది.

కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అటు ఐ.ఏ.ఎస్. అధికారులను అనారోగ్యాలకు గురి చేసి వారి పరువు ప్రతిష్ట మంటగలిపి వారేదో దొంగలులా ఇన్నాళ్ళు చూపి తప్పని సరి పరిస్థితులలో బలవంతపు సంతకాలు చేయించుకున్న రాజకీయ అధికార రాకాసులను వదిలి పెట్టి వారిని జైళ్ళలో ముగ్గబెడుతు ఏ-1 గా వున్నవాడ్ని బెయిలిచ్చి ఇంత హంగామాగా ఇంటికి సాగనంపిన ప్రభుత్వాధికారులు పోలీసు అధికారులు మీ గులాంగిరికి జోహార్లు. ఇదంతా అధికార దుర్వినియోగం కాదా?

కాబోయే ముఖ్యమంత్రి అంటూ అరుపులు పెడబొబ్బల లైవ్ చూస్తుంటే వీళ్ళంతా ప్రజలే మరి?? వీళ్ళకోసం ఆలోచిస్తూ ఏదో మంచి జరుగుద్ది భవిష్యత్ తరానికి అని
ఆశించడం మన వెఱితనమే కదా?? రాష్ట్రాన్ని ఆర్థికంగా అథఃపాతాళానికి తొక్కిన ఒక రాచకురుపు వెంట ఇంత మందీ మార్బలం వెళ్ళడం ఎంత దౌర్భాగ్యం. ఒక్కో టీవీ ఒక్కో వ్యాఖ్యానంతో బేక్ గ్రౌండ్ మ్యూజిక్ తో జనాల మెదళ్ళను పాలిష్ చేసే పనిలో పడ్డాయి. ఇదా వీటి సామాజిక బాద్యత? వీళ్ళంతా రాజకీయ సామాజిక కుళ్ళును కడిగేయమని మళ్ళీ స్లోగన్స్.

దీనమ్మా బతుకు చీ.. థూ అని రిక్షా రాం బీడీ ముక్క కొరుకుతూ ఊస్తుంటే ఆశ్చర్యమేసింది…

ప్రకటనలు

One comment

  1. తండ్రి అధికారం అడ్డం బెట్టుకొని దోచుకుని,దాచుకొనే వాడు అధికారం కోసం అర్రులు చాస్తుంటే ఈ బానిస మనస్తత్వ,వెన్నెముక లేని గాలివాటం అంతా జైకోడుతున్నారు.ఈ దోచుకోవడమ్ ,పంచుకోవడమనే సోమ్స్క్రుతి ప్రజల మనుసుల నాటుకుంది.ఎందుకు జగన్ జైల్ కెళ్ళాడు?ఎలా బయటకొచ్చాడు?ఒక్కసారి మననం తేచ్సుకోండి.ఈ మద్య కొండ సురేక అయన గురించి చెప్పింది.జిట్టా బాలక్రిష్ణారెడ్డి అనుబవం చెప్పాడు. ఇదొక చంబల్ లోయ సంస్కృతి.ప్రజలలో ప్రశ్నించే తత్త్వం కొరవడుతుంది.విచక్షణ,విజ్ఞత గల పౌరులు ఈ దుష్ట సంప్రదాయాన్నిదూరం చేయాలి.గో ష్టులు,సదస్సులు,సేమినార్స్,కవితలు,వ్యసాల ద్వారా ప్రచార మొనరించాలి..ఈ ప్రయత్నం మన నుండే ప్రారంభం కావాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s