విద్వ్హంసకర అభివృద్ధికి ప్రతిఫలం – హిమవిలయం

Uttarakhand-rescue-AFP

Kedarnath shrine floods _0

Siva_Statue_RAin_PTI

మనిషి ప్రకృతితో పాటు జీవిస్తే అది తనను కాపాడుతుంది. ప్రకృతికి విరుద్ధంగా ఏదో సాధించేసామన్న గర్వంతో వినాశకరమని అంతా చెప్తున్నా వినకుండా విధ్వంసకర అభివృద్ధికి బాటలు వేసుకుంటూ పోతే ఇలా తానున్న కొమ్మనే నరుక్కున్నట్టు తన వినాశనానికే దారితీస్తుంది. కేదారినాథ్, బదరీనాథ్, చార్ దామ్ లలో జరిగిన ప్రళయ గంగా విస్ఫోటనానికి మన గుడ్డి ప్రభుత్వాల అభివృద్ధి నమూనాలే కారణం. లెక్కకు మిక్కిలి జలవిద్యుత్ ప్రాజెక్టులు కట్టి, నదుల గమనాన్ని మార్చడానికి పర్వత సానువులను తొలచి రక రకాలుగా వాటి గమనాన్ని మార్చడంతోపాటు టూరిజమొక్కటే తమ ఆదాయ వనరుగా అక్కడికి అడ్డూ అదుపూ లేకుండా యాత్రికులను తోలడం కూడా ఈ మానవ వినాశనానికి సజీవ సాక్ష్యం. ఇలాంటి అభివృద్ధి మన వినాశనానికి నాందిగా పర్యావరణ శాస్త్రవేత్తలు, మేధావులు ఎన్ని మార్లు ఎన్ని రకాలుగా చెప్పినా రాబడి ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలే వీటికి బాధ్యత వహించాలి. అంత ఇరుకు రహదారుల మధ్య వేలాది వాహనాలను పోనివ్వడం ముందు చూపులేని ఘోర తప్పిదం. హిమాలయ ప్రాంతంలో ముందుగా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు చేయలేదని వింటున్నాం. ఈ శాఖ ఇచ్చే నివేదికలు మామూలు రోజులలోనే సాధారణ ప్రదేశాలలోనే తారుమారు అవుతుంటాయి. అలాంటిది ఇంత ఎత్తైన ప్రదేశాలకు అన్ని వేలమంది యాత్రికులను అనుమతించడం తప్పిదం. ఇలా ఈ ప్రళయానికి మన అత్యాశే కారణం.

ఇలా ప్రకృతి వినాశనానికి కారణభూతమయ్యే అణువిద్యుత్ ప్రాజెక్టులు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డగోలు అనుమతిలిస్తున్న ఈ గుడ్డి ప్రభుత్వాల దాష్టీకాన్ని ఇకనైనా ప్రజలంతా కలిసి ఎదుర్కోక పోతే ఇలాంటి ప్రళయాలు సాధారణమై భారతదేశ చిత్రపటంలో మనిషి లేకుండా పోతాడు. వుంటే గింటే రోగిష్టి మానవులుంటారన్నది సత్యం.

ఈ ఆపదలో చిక్కుకుని మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజెద్దాం.

ఈ ఆపత్సమయంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న త్రివిధ దళాల సైనికులకు వందనం.

ఇక్కడ కూడా రాజకీయ యాత్రలు చేసే నాయకులకు శతకోటి వందనాలు.

ప్రకటనలు

2 comments

  1. తమ ఆదాయ వనరుగా …..మనుష్యులు పూర్తిగా పతనమయిపోయారని చెప్పడానికి మీరు చెప్పిందే సాక్ష్యం…ప్రభుత్వాలు,కార్పరేట్ కంపెనీలే కాదు…ప్రతి ఒక్కళ్ళు…ఇదే ద్యాస తో… మనుష్యులంటే నే అసహ్యం వేసి..భయపడేట్టు చేస్తుంది ప్రస్తుత సమాజ తీరు….దేన్నీ వదలకుండా అన్నింటి నుండీ డబ్బు పిండేద్దాం అన్న ధ్యాసే…దానికి పర్యాటక రంగం అని ముద్దు పేరు పెట్టుకుని..షోకులు చేసి..ఇలా నాశనం చేస్తున్నారు…..పిక్నిక్ వెళ్ళి నట్టు దేముడి సన్నిది లో ప్రవర్తిస్తున్నారు…అసలు భక్తీ …అనే..భావనే లేదు…ధనమే దైవం…!!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s