బొగ్గు – సి.బి.ఐ. – జగన్ – ధర్మాన

ప్రపంచంలోనే అతిపెద్ద స్కాంగా అనుమానింపబడుతున్న బొగ్గు స్కాం పై దర్యాప్తు నివేదికను ముందుగా అధికార పార్టీ మంత్రులకు చూపించి ప్రతిపక్షం వారిని ఇరికించే ప్రయత్నాలు చేస్తూ దేశంలో అతిపెద్ద దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టు వారి మొట్టికాయలు తిన్నా తన అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే తీరును సిగ్గు లేకుండా ప్రపంచానికి చాటి చెప్తూ వుంది.

అధికార పార్టీలో వున్న వారిని అరెస్టు చేయాలంటే గడువులిస్తూ వారు తప్పించుకునేందుకు అనుకూలిస్తూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్క చర్య జరిగినా వారి ఇంటిపై సిబిఐ విరుచుకుపడుతోందనడానికి మొన్న తమిళనాడులో స్టాలిన్ ఇంటిపై జరిగిన దాడి తార్కాణం. ఇలా వ్యక్తుల స్వేచ్చను హరించే కుట్రకు అధికార పార్టీకి ఆయుధంగా మారింది ఈ ప్రభుత్వ శాఖ. ధర్మానకో న్యాయం మోపిదేవికో న్యాయం. జగన్ కో న్యాయం రాజాకో న్యాయం. ఈ పక్షపాత ధోరణి ఖండిద్దాం.

4 comments

 1. మన దేశంలో అన్ని పార్టీలూ ఇంతే…స్వతంత్ర ప్రతిపత్తి అంటూ ఇస్తే గానీ…సేబీఐ కి ఈ చీవాట్లు తప్పవు…ఈ దేశానికీ రాజకీయ పార్టీలే శాపం గా మారేయి….కాంగ్రెస్ కానీండి..బీజేపీ కానీండి..రధయాత్ర చేసి అద్వాని సృష్టించిన బీభత్సం మరువగలమా??ఓట్ల కోసం రిజర్వేషన్ల తుట్టెను కదిలించిన వీపీ.సింగ్ ను మరవగలమా??…మన దేశ రాజకీయ నాయకులంతా వెధవల్ని మరెక్కడా చూడలేమేమో??

 2. I disagree, we are getting what we deserve. Did we reject these political party with vote? NO, we re-elected them, so they keep doing same things as they getting back to power. Until people wake up and vote right, we are not going to see change.

  1. డెవిడ్ గారు,
   మీరు చెప్పింది అక్షర సత్యం. మన జనాలు (నాతో కలిపి) ఎప్పుడైతే కులం, మతం, ప్రాంతం కాకుండా వ్యక్తి నిజాయితీ చూసి వోటు వెస్తారో అప్పుడు కాని మనకి చెప్పుకొదగ్గ నయకులు రారు
   Gopi

 3. యెడ్యురప్ప చెప్పాడుగా, అస్మదీయులని కాపాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదని.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s