భర్తల కోసం భార్యల ఆక్రోశం..


ఏ కారడవిలో వున్నాడో, ఎప్పుడొస్తాడో, ఎలా వస్తాడో, బతికి వస్తే సంతోషం లేకపోతే నుదుట కుంకుమ చెరిగిపోయి తను పిల్లలు అనాథలయి బతకాలని, ప్రతి క్షణం తన కోసం కల కంటూ బతక లేక, చేస్తున్న ఉద్యోగం ఎవరికోసమో అర్థం కాక, తను ఏం తిన్నాడో ఎలా వున్నాడో తెలీని అగమ్యగోచరంలో ఓ భయానక వాతావరణంలో ఒంటరితనం భరించలేక గత మూడు రోజులుగా రోడ్లపై కొచ్చి తామూ మనుషులమేనని గుర్తించాలని పిల్లా పాపలతో ఓ ఆడ మంత్రి వున్న శాఖలోని మహిళలంతా ఆక్రోశిస్తే అదే శాఖలోని మరో సుఖం మరిగిన దున్నలు వెటకారం చేస్తే చెప్పే ఆయుధంగా తిరగబడి పిల్లినైనా గదిలో బంధిస్తే ఏం చేస్తుందో చేసి చూపారు స్పెషల్ పోలీసు బెటాలియన్ సాయుధ పోలీసుల భార్యలు…

వారి ఆవేదన వెనక దాగి వున్న ఎన్నో కఠోర సత్యాలు నేటికి మీడియా ముందుకొచ్చి అందరికీ తెలిసాయి. నిజానికి యిలా తమ దోపిడీ పాలనకు వత్తాసుగా తమకు రక్షణగా పనిచేస్తున్న వారి పట్ల యింత నిర్దయగా వ్యవహరించే ప్రభుత్వం వారి పై అధికారులకు యివన్నీ తెలియనివా? బ్రిటిష్ కాలం నాటి ఆర్డర్లీ వ్యవస్థను ఈనాటి ప్రజాస్వామ్యమని చెప్పుకొనే పాలనలో కూడా అమలు చేస్తూ కింది స్థాయి పోలీసును బానిసగా చూస్తూ దొర పెత్తనం చెలాయించే వీళ్ళకు నడి బజారులో కాలర్ పట్టుకోవద్దా. వారికి లేని హక్కును వారి భార్యలు చేసి చూపారు. ఇదే విధంగా ఆ పోలీసులే స్వయంగా చేసి వుంటే వారిపై క్రమశిక్షణా చర్యలంటూ భయపెట్టే వారు. అలాగే ఇక్కడ మరో విషయం ఇన్ని లక్షల మంది పోలీసులలో చాలా వరకు ఎస్.ఐ.కంటే దిగివ స్థాయి సిబ్బందంతా దిగువ మధ్య తరగతి, బీద కుటుంబాలనుంచి వచ్చినవారే. ఈ ఉద్యోగమూ లేకపోతే బతకలేమని చేస్తున్న వారే. ఈ విషయమెరిగిన పాలకులు వీరిపట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తున్నారు.

కావున వీరి డిమాండ్లన్నీ సహేతుకమైనవి కాబట్టి వీరిని మనుషులుగా సంసారులుగా గుర్తిస్తూ అంగీకరించేందుకు పాలక వర్గంపై అన్ని వర్గాల ప్రజలు వత్తిడి తేవాల్సిన అవసరముంది.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s