తారలు ఈ సమాజపు నిలువెత్తు ప్రశ్నలు కారా??


ఇటీవల ఆంధ్రజ్యోతి వారి టీవి చానల్ ద్వారా పత్రిక ద్వారా ఏదో ఓ పెద్ద నేరస్తురాలిని పట్టుకున్నట్టు, తన ఒక్క దాని వల్లనే ఈ తెలుగునేలంతా కుళ్ళిపోతున్నట్టు రోజంతా ఊదరగొట్టి రోజూ కథనాలు ప్రచురిస్తూంది. ఈరోజుకు రాజకీయ నాయకులు, వారి తాబేదార్లు, పోలీసులకు తనతో లింకులు వున్నాయని వాటిని బయటపెట్టుతూ తనను తాను రక్షించుకోజూస్తున్నట్టు కథనం రాసింది. అలాగే కొంతమంది రా.నా.ల వలన తనకు బెదిరింపులొస్తున్నట్టుగా కూడా.. ఒంటరిగా వున్న ఆడదానిని చంపేయడం అదీ ఇలా ముద్ర పడ్డ వాళ్ళని ఏం చేసినా ఈ సమాజం హర్షిస్తుందిలే ఆన్న ధీమా వున్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు..

అసలు మీడియా అంత పవిత్రంగా ఏడిసిందా ఈ దేశంలో???

అసలు ఇది తారా చౌదరితోనే మొదలయ్యిందా? లేక అమ్మె ఒక్క దానితోనే అంతమయిపోతుందా.. ఇలాంటి వారు ఈ సమాజంలోంచి వస్తున్న వారే కాదా?? ఎంతమంది జీవితాలను ఈ సమాజం నాశనం చేస్తూ వాళ్ళని ఇలా పెడదోవ పట్టడానికి దోహదం చేయడంలేదు. రాజకీయనాయకులు, అధికార గణం వీరిని ఇలా తయారు కావడంలో పాత్ర వహించడం లేదా.. వ్యభిచార వృత్తి మన సమాజంలో అంతర్లీనంగా అంగీకరింప బడుతూ శతాబ్ధాలుగా వస్తున్నదే కదా… మరి తారా చౌదరి వలన నష్టమెవరికి జరిగింది. ఏదో పెద్ద స్టింగ్ ఆపరేషన్ తో పట్టుకున్నటు బిల్డప్ ఇచ్చి అదో దేశ ద్రోహ నేరంలా మీడియా చూపుతోంది.. వారిని సంస్కరించాల్సింది పోయి వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళను మరింత కుంగిపోయేట్టు చేయడం ద్వారా ఉపయోగముంటుందా…లేదంటే వాళ్ళు మరింత మొరటుగా తయారవ్వడానికి ఈ ప్రచారం ద్వారా మరింత పెరగడానికైనా ఉపయోగపడుతుంది ఇలాంటి కథనాలు.

కుళ్ళిన సమాజంలో వుంటూ ముక్కు మూసుకున్నామనడం హాస్యాస్పదం కాదా.. ఈ వ్యవస్థలో తారాచౌదరిలు వస్తూనే వుంటారు… వారిని వెంటాడి వేటాడకండి.. వారి తప్పు తెలుసుకొని మారే అవకాశమిద్దాం…

6 comments

 1. నా ప్రశ్నను మీరు మరల క్లియర్ గా అడిగారు..ఆమె తప్పు చేసిందనుకోవడం తప్పే..సమాజమే తప్పుడు దోవలో నడుస్తూన్నంత సేపు మనలను ఈ ప్రశ్నలు వెంటాడుతూనే వుంటాయి పద్మగారూ…

 2. మారే అవకాశం ఇవ్వడానికి ఆమె ఏమైనా ఆకలి కేకలతో ఇదంతా చేస్తుందా? వ్యవస్థ లో డబ్బు,అధికారం,ఆమెని..ఇలా మూడింటిని అడ్డం పెట్టుకుని..మూడింటి కోసం .. అర్రులు చాసే వారికి వల విసురుతుంది.

  నిజాలు బయటపడక ముందే.. తెర వెనుక కథలు నడిపించే.. రాజకీయనాయకులు,అధికారులు.. ఇలాటి తారా లని ఎంతమందిని చూసి ఉంటారు? జరుగుతున్నవి చూస్తూనే ఉంటాం. సంస్కరించడం ఎవరి తరం చెప్పండి.? వారికి వారు మారాలి తప్ప? మీ ప్రశ్నల తీరు బాగుంది.ఆలోచనతో..నే ఈ సమాధానం.

  ఎవరిని సపోర్ట్ చేస్తూ మాత్రం కాదని మనవి.

 3. మీడియాకి ఏ మాత్రం సామజిక భాద్యత … మానవ విలువల పట్ల మర్యాద అసలు లేవు… మరి ఇలాంటి కేసులంటే వాటికి అమితమైన ఆసక్తి… తార చౌదరిని తయారుచేసింది ఎవరు అందులో ఎవరి పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా నైనా లేదా?

 4. It is futile to make someone responsible for Tara’s corruption and pity her. That will be a pity misplaced. She herself is squarely responsible for the ugly mess she is currently finding herself in. She must be treated as any other criminal. When her attempts to get movie chances failed, she could have been back to where she originated from. But she did not do so. There are several women with frustration and shattered hopes. But not all of them treading the path of Tara. Her aim is to strike it rich at any cost and at anybody’s cost. To this end, she did all she could. So she chose this way of life voluntarily and ambitiously. She married some poor kon kiska to give her dirty life a touch of sanctity and use the managala sutram as a license billa.

 5. ఈ దేశం లో ఎవరు దోషి అనేది నిర్ణయించాల్సిన భాద్యత కోర్తులదే. పరిశోధన చేయాల్సిన భాద్యత పోలీసులది. ఈ మద్య లో ఈ న్యూస్ మీడియా అతి దురద తో, వాళ్ళంతట వాళ్ళే పరిశోధనలు, తీర్పులు ఇచ్చేస్తున్నారు. సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా వాళ్ళు వున్నారు , వీళ్ళు వున్నారు అని అంటూ వుహాజనిత వార్తలు చాలా అనవసరము. అది ప్రసారము చేసినది తరువాత తప్పు అని తెలిసినప్పుడు సదరు మీడియా వారు మరి వివరణలు ఎందుకు వేయరు?

  గుజరాత్ అల్లర్ల గురించి, మోడి మీద డైరెక్ట్ ఎటాక్ చేశారు మీడియా; హరేన్ పాండ్య, సంజీవ్ భట్ మీటింగ్ కు అటండ్ అయ్యారు, ఆ మీటింగ్ లో మోడి డైరెక్ట్ గా అల్లర్లు చేయమన్నారు అని మోడి మీద డైరెక్ట్ గా కేసు పెట్టారు . SIT రిపోర్ట్ ప్రకారము సాక్ష్యాల ప్రకారము హరేన్ పాండ్య అసలు మీటింగ్ జరిగినరోజున అహ్మదాబాద్ లోనే లేడు, మరి ఆయన మీటింగ్కు ఎలా అటండ్ అయ్యాడు? అది కూడా కేంద్ర ప్రబుత్వ ఏజెన్సీ బి‌ఎస్‌ఎన్‌ఎల్ లెక్కల ప్రకారము ఆయన సెల్ ఫోన్ ఆ రోజు అహ్మదాబాద్ ట్రేస్ కాలేదు, వేరే చోట ట్రేస్ అయ్యింది. కానీ పాండ్య పేరు మీద మోడి మీద ఎంత దండయాత్ర చేశారో మీడియా వారు? అలాగే ఆదేదే కాంగ్రెస్ ఎం‌పి భార్య మోడి ఆఫీసుకు ఫోనులు చేసి హెల్ప్ అడిగింది, ఆయన రెస్పోండ్ కాలేదు అని తెగ వూదర కొట్టారు; మోడి ని డైరెక్ట్ గా ఎటాక్ చేశారు. కానీ బి‌ఎస్‌ఎన్‌ఎల్ ఫోను లేక్కల ప్రకారము వల్ల ఆ ఇంటి నుండి కాదు కదా ఆ ఏరియా నుండి ఆ రోజున సి‌ఎం ఆఫీసు కు ఒక్క కాల్ కూడా వెళ్లలేదు. మరి మీడియా ఆ ఎం‌పి గారి భార్య మాట ప్రకారము ఎలా గోల చేసిందో, చేస్తోందో మనకు తెలుసు.

  ప్రతుతము తారా చౌదరి అయిన, మోడి అయిన, అరుషి హత్య కేసు అయినా, ఇంకా చాలా కేసులలో అయినా ఇంత గోల చేసిన, చేస్తున్న మీడియా వాళ్ళు చెప్పింది తప్పు అని తేలినప్పుడు మేము చెప్పింది తప్పు అని కూడా వివరణలు కూడా చెప్పాలిగా? మరి ఎందుకు చెప్పటము లేదు? ఒకడి మీద బురద చల్లి, నువ్వే ఆ బురద కడుక్కో అని మీడియా పారిపోవతము ఎంత వరకు సమంజసము?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s