ఠాగూర్ తరహా వైద్యంలో బాబా???

సాయిబాబా పరిస్థితి చూస్తుంటే బాధగా వుంది..

8౦ సం.ల వృద్ధాప్యంలో ఇంత నరకానికి గురిచేయడం దారుణం..

లక్షల కోట్ల ఆస్తులను ఎలా దొంగిలించుకు పోవాలోనన్న కుతంత్రాలకు ప్రస్తుతం అక్కడ జరుగుతున్న తంతు సాక్ష్యం కావచ్చు. ఇంత మంది భక్తుల వీరావేశం నీరుగారిపోయి ఇన్నాళ్ళు భజన చేసిన వాళ్ళు కిమ్మనకుండా ఊరకుండిపోయారంటే ఆయనింక లేకపోయుండొచ్చు అన్నది అందరికీ అర్థమైపోయుండాల. డా.సఫా మొత్తం వ్యవహారాన్ని ఓ గూడుపుఠానీలా నడుపుతూ దానికి సర్కారు వారి తానా తందానా తోడు కావడం వెనక ఎవరి లాభాలు వాళ్ళకుండొచ్చు. ధనం మూలం ఇదం జగత్ అన్న సూక్తి అక్షరాలా నిజమౌతున్నదిక్కడ.  భక్తి ముసుగులో అక్కడ పోగుపడ్డ ధనం ఇప్పుడు ఎవరెవరి ఖాతాల్లోకి మార్చుకోవాలోనన్న ప్రయత్నంలో అంతా భాగస్వాములై ఠాగూర్ సినిమాలోని కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్లు అనుమానంగా వుంది. ఇదంతా పూర్తయ్యాక బాబా ఈ క్షణమే వైకుంఠానికి చేరుకున్నారు తొందర్లో మళ్ళీ దర్శనమిస్తారని సెలవిస్తారు డా.సఫా గారు. అంత దాకా ఈ మూగ భక్తులు పక్కన పెట్టిన తాళాలు అలా పడి వుంటాయి. నిజంగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇన్నాళ్ళు వేచి చూడాలా…ఐ.సి.యు.లో వున్నవారి విజువల్స్ చూపకూదదా? ఇదంతా మన చెవిలో పెద్ద కాబేజీ పెట్టే ప్రయత్నం కాదా? అయినా మనకెందుకులే… శాంతి..శాంతి..శాంతిః

3 comments

  1. సాయిబాబాగారి imageతో ఇలాగ ఆడుకోవడం మన నవీనసంస్కృతిలో ఉన్న దౌర్భాగ్యాన్ని, స్వార్థాన్ని, కుట్రని చూపిస్తోంది. ఇది నిజంగా మన దేశం సిగ్గుపడాల్సిన విషయం.

    Ayn Rand గారు మీకు పని లేదు అనుకుంటున్నారు సామాన్యుడు గారు! మరి పనిలేనివాడి బ్లాగు చదివి, అక్కడ వ్యాఖ్య వ్రాసినవాళ్ళింకెంత పనిలేని objectivistsఓ అర్థమవుతోంది 🙂 అమ్మా అయిన ర్యాండు, నీకు సామాన్యుడు చేసిన కాని పనేముంది :p

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s