తెలంగాణా యాగం?

తెలంగాణా కోసం శత చండీ యాగం చేస్తున్నానని కె.సి.ఆర్. ప్రకటన్ ప్రజలను తప్పుదోవపట్టించడానికేనన్నది సుస్పష్టం. తనకున్న నమ్మకాలని ఏదో విధంగా కాష్ చేసుకోవాలనుకునే ఇలాంటి వారిని ప్రజలు ఇంకెంతో కాలం భరించలేరు. కాకపోతే తన కుటుంబ సభ్యులతో కలిసి చేస్తున్న దానిని తెలంగాణాకు ముడిపెట్టి చేయడం ఖండించాలి..

ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుందన్న విషయాన్ని పక్కన పెట్టి మిలియన్ మార్చ్ నుండి పక్కకు తప్పుకొని, సోనియాకు భజన చేయడం మొదలుపెట్టి, మౌనం దాల్చిన ఈయన ఈ విధమైన ప్రచారార్భాటాలకు పాల్పడడం దారుణం..

రాజకీయ పార్టీలు సెక్యులర్ గా కనీసం అగుపించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించలేనితనాన్ని అంతా ఖండించాలి. ఈ యాగపు ఖర్చును తన సొంత అకౌంట్ లో జమ చేయాలి..

ప్రజా ఉద్యమాలను తప్పుదోవ పట్టించే ఇలాంటి నాయకులను ఖచ్చితంగా నిలదీయాలి…

3 comments

  1. తాను ఉద్యమాలు చేయని విషయాన్ని కపిపుచ్చుకోవడానికీ, ఏదో ఓకటి చేస్తున్నాడు అనిపించుకోవడానికే ఈ నాటకాలు. చాలామంది అంటున్నట్లు తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన అడ్డంకి కాకపోయినా ముఖ్యమైన అడ్డంకుల్లొ కే.సి.ఆర్ ఒకరు.

  2. చండీయాగం
    ……………………
    అవులగాడు మన శ్రీకాంత్ చారి
    యాగం చేస్తే తెలంగాణ వస్తదని సమజ్గాక
    కాలబెట్టుకుండు ఎడ్డొడె
    వొకారా ఇద్దరా వందలమంది బిడ్డలు
    తెలంగాణ కోసం చచ్చిండ్రు యెడ్డొల్లే
    నిజాంగాన్ని దొరగాన్ని ఎదిరించనీకి
    మన పెద్దోల్లు తుపాకీ పట్టీండ్రు
    వాల్లూ ఎడ్డొల్లే
    అరే యాగాలు యగ్నాలు చేస్తే
    గ్రహాలు మంచిగైతయని తెలీక
    శ్రీ క్రిష్ణ యాగం చెయ్యలే ఎంత ఎడ్డొల్లం బై !
    గిప్పుడైనా అందరం కళ్ళుతెరిచి ఆ
    సోనియా చంద్రబాబుల యాగం చేద్దాం రా బై
    తెలంగాణ దొర్లుకుంట రాకపోతే గప్పుడు
    కే సీ ఆర్ ను అడుగుండ్రీ !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s