తండ్రీ… రాక్షసుడా….

తనెవరో,

ఆడో, మగో,

ఏ కులమో,

ఏ మతమో,

ధనికురాలో,

పేదరాలో

తెలీని

ఆ పిచ్చితల్లి…


నవమాసాలు

అమ్మకడుపులో

భద్రంగా ఈదులాడి

బయటపడిన క్షణం…


తను ఆడబిడ్డనని

తన ఇంట తిరుగాడే

అదృష్ట దేవతనని

గారాభంగా చేతుల్లోకి

తీసుకుంటావనుకుంటే

ఒక్కసారిగా నేలకేసి మోది

చంపుతావనుకోలేదు నాన్నా…


ఇందులో నా తప్పేంటో

కాస్తా చెప్పగలవా?

మరో మారు జన్మెత్తకుండా

వుంటా….

(ఉదయాన్నే పేపరులో ముందు పేజీలోనే ఆడబిడ్డని నేలకేసి బాది ఆసుపత్రిలోనే చంపిన తండ్రి వార్త చదివి)

3 comments

      1. నిజమే… కానీ ఈ రోజు నా ఆలోచనలో స్వల్ప మార్పు…ఆ తండ్రి తనకు మూడో బిడ్డగా తిరిగి ఆడపిల్ల పుట్టడం.. ఆమెను ఎలా పెంచగలను అన్న నిస్సహాయతకు లోనైన ఈ సామాజిక సందర్భం కూడా ఈ రాక్షసత్వానికి తోడైందేమో ననిపిస్తుంది.. మగపిల్లలపట్ల వున్న మన అభిమానం, అక్కర మన బుఱలనుండి అంత తొందరగా తొలగకపోవడానికి కారణం వాడేదో స్వర్గానికి నిచ్చెనవేసేస్తాడన్న మూఢనమ్మకం కూడా ఈ బుద్ధిలేనితనానికి తోడు కావచ్చు. మొత్తానికి మూర్ఖత్వానికి పరాకాష్ఠ ఈ సంఘటన… మీ స్పందనకు ధన్యవాదాలు ఆనంద్ గారు, @Gayathri గారు…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s