వీధులన్నీ మావే..

విధివెక్కిరింత

 

 

 

 

 

 

 

 

 

 

 

ఎవరో విసిరేసిన ఎంగిలాకులులా
ఇలా ఈ రోడ్డు పక్కన
దొర్లుకుంటూ ఎక్కడినుండో
ఓ సుడిగాలికి చిక్కిన
చెత్త కాగితంలా ఇలా
ఎగురుకుంటూ
ఒకరినొకరం
ఓదార్చుకుంటూ
మట్టిలో మగ్గుతున్న
మా బతుకులిలా
గాలిపటంలా మారినందుకు
ఎవర్నీ నిందించలేము…

ఏటికి ఎదురీదడం
నేర్చుకుంటున్న చేపపిల్లలం…

మీమీ భధ్రమయ జీవితాలలో
మా కంపు సోకనివ్వం
మా పుట్టుక చావులతో
మిమ్మల్నిబ్బంది పెట్టం…

మీ బడ్జెట్ కందని మా
ఖాళీ కడుపు
మీ లోటు లెక్కలనడగదులెండి..

ఇప్పుడెవర్నీ నిందించలేము
కారణాలేవైనా
వత్తిడిగొన్న జీవితాల
గతితప్పిన బతుకు
చిత్రపటాల చిరిగిన
బొమ్మలం…

కానీ
రేపెప్పుడో
మాకూ వెలుగు దొరకదా అని
ఎదురుచూపు…

ప్రకటనలు

8 comments

  1. సామాన్యుడు గారికి, నమస్కారములు.

    మీ కవితలోని భావాలు చాలా గొప్పగా, నిజమైనవిగా వున్నాయి. అయితే, వీరిలాంటి జీవితాలు capitalistic countries లో కంటే, వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు: ఆఫ్రికా, భారత్.
    మీ స్నేహశీలి,
    మాధవరావు.

  2. నిశిరాత్రిలో బాలభానుడు
    ……………………………
    చీకటికే రంగులద్ది కారుచీకట్లను
    సౄష్టించే చిత్రకారుడు వాడు
    భయపెట్టె చీకటిని జయించి తన
    బందీగా చేసుకున్న
    బాల భేతాలుడు వాడు
    ప్రపంచము వొదిలేసిన చెత్తను
    భుజమ్మీది బరువుగా మోస్తూ
    హెర్కులసుకు సరి జోడైన వాడు
    తన దుస్తుల చాటున ప్రపంచ
    కల్మషాన్ని దాస్తూ విరాగిలా
    తిరిగే భైరాగి వాడు
    సమాజములోని కుళ్ళును
    స్వార్దాన్ని ఎరుపెక్కిన కళ్ళతొ
    ప్రశ్నించే నోరున్న మూగవాడు
    వొకరొజు రాత్రి కనిపించి మాయమైన
    తొకచుక్క వాడు
    ………………………
    వొకరోజు రాత్రి కనబడి,మాట్లాడి ఇంటికొస్తానని మాటిచ్చి ….తిరిగిరాని బిడ్డ …ఎక్కడ వున్నా మంచిగా వుండాలని కోరుకుంటూ ….వీది బాలలు లేని సమాజాన్ని కోరుకుంటూ …

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s