కరెంటు కామెంటు7-హస్తమించిన సూరీడు..


సూరీడు గుర్తు పెట్టుకొని ఏదో సమాజంలో మార్పు తీసుకు వచ్చేస్తాను, సామాజిక న్యాయం నినాదంగా ఊదరగొట్టిన చిరంజీవి తన లోతు గుండెలో ఇన్నాళ్ళు దాచుకున్న యవ్వారాన్ని ఈరోజుకు బయటపెట్టుకొని ఊపిరి పీల్చుకున్నాడు. అధికార లాలసతతో మొదలుపెట్టిన తన రాజకీయ ప్రస్థానాన్ని ఇలా మరో మెట్టు పైకెక్కడానికి ఇలా బోర్డు తిప్పేయడం చూస్తుంటే ఇంత సిగ్గుమాలిన రాజకీయాలను చూస్తూ ఊరుకున్న మన నిస్సహాయత పట్ల అసహ్యమేస్తోంది. మొత్తమ్మీద తన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి తప్ప దీనివలన రాజకీయాలలో ఏమీ పెను మార్పులు రాకపోవచ్చు. అసలే అసమ్మతి కుంపట్లతో ఉడుకుతున్న కాంగ్రెస్ నెత్తిన మరో కుంపటి పెట్టుకుండే తప్ప ఇది మరోటి కాదు. ఈ విలీనం వలన మరింత గందరగోళంకు గురవుతూ ఇంక ఇంతవరకు బయటపడని వారు అటు జగన్ వైపో, టి.డి,పి. వైపో గెంతడం తథ్యం.

మరో పెద్ద జోక్ ఈ రోజు చిరంజీవి నోటి వెంట వచ్చిందిః అవినీతిపై కాంగ్రెస్ తీసుకున్న చర్యలు తనను ఆకర్షించిందంట. ఇంత కంటే హాస్యాస్పదమైనదేమైనా వున్నదా? అంటే ఇంక రెండు చెతులా సంపాదించ వచ్చునని చిరు ఆశ పడుతున్నట్లున్నాడు.. హతోస్మి..

ప్రకటనలు

5 comments

 1. నిజం నిజం! మీరన్నది నిజం!
  అవినీతిని అంతమొందించేది కాంగ్రెస్స్ ఐతే
  చిరంజీవి అవినీతికి వ్యతిరేక “స్టాలిన్” ఐతే
  లక్షల కోట్ల కుంభకోణాలకు కారణం
  అభం శుభం తెలియని సామాన్య ప్రజలేనేమో.

 2. భలేవాళ్ళండి మీరు మాష్టారు… కొంపతిసి ఎన్నికల సమయంలో నాయకులు చేసే వాగ్దానాలు వగైరా నమ్ముతుంటారా ఎంటి? ఒకవేళ ప్రజారాజ్యానికి ప్రజలు పట్టం కట్టుంటే, మన రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోయి ఉండేవాళ్ళా ఏంటి? రాష్ట్రం గంగ అయితే, అధికారం గట్టులాంటిది. ఎన్ని పాపాలయినా కడుకోవచ్చు, ఎంత కావాలంటే అంత పుణ్యం కూడబెట్టుకోవచ్చు.

  ఒక రకంగా, ఇలా చిన్నా చితక పార్టీలు వోటు బ్యాంకులను చీలుస్తూ పోతే మన రాష్ట్రానికే చేటు. నాకయితే ఇది మనందరి మంచికే అనిపిస్తోంది. అంటే నేనేదో వీరాభిమనినని అనుకోకండి. రాజకీయాలంటేనే రొచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s