పందులపెంపకంతో కంపుకొడుతున్న మీడియా..

గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మీడియాలో వార్తలు రాకుండా కట్టడి చేస్తున్నారంటే ఏదో జరుగుతున్నట్లే కదా? అన్ని చానళ్ళు డిడి శాంతి స్వరూప్ లా మారిపోయాయి. పోలీసు బాసులు చెప్పిందే చూపుతున్నారు తప్ప కనీసం జర్నలిజం ధీరోదాత్తత చూపడంలేదు. అంటే వీళ్ళదంతా వ్యాపార జర్నలిజమే నన్నమాట. ఇరాక్ యుద్ధంలోను, పాలస్తీనాలో జరుగుతున్న దాడులను, ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల చిత్రాలను, వార్తా విశేషాలను సేకరించే ధైర్యం గల జర్నలిస్టులు, ప్రసారం చేసే చానళ్ళున్నాయి. కానీ రియలెస్టేట్ వ్యాపారాలు, చిట్టా వ్యాపారాలు, పచ్చళ్ళ వ్యాపారాలతొ కడుపునిండిపోయిన నేటి మన మీడియాకు పోలీసు జ్వరం పట్టుకున్నట్లుంది. ఎంతసేపూ పట్టుచీరఎలా నేస్తారో నేర్పే NTV వాడు, జీవపరిణామంతో TV 9 వాడు, ఇలా తలా ఒక పందుల పెంపకం కార్యక్రమాలతో ఎంజాయ్ చేస్తున్నారు. లేకపోతే మేమింత వీరులం, మగధీరులం, ఇలా ఎక్కపొడిచినందుకు ఈ అవార్డ్ అని చూపించుకున్న వారు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు. మీడియా ప్రజల పక్షం వహించాలి. అంతేకానీ ప్రభుత్వం వద్దంటే మానేస్తే అది జర్నలిజం ఎలా అవుతుంది? వీళ్ళని చూడాల్సిన అవసరమేముంది. మూసేయండ్రా మీ చానళ్ళ వ్యాపారం.

ప్రకటనలు

13 comments

 1. Emi cheppinnvanna.. super…. gooba gui mannadi…
  Okadu sachhi andharu aathmahatyalu chesukuntunte.. adi policluki and govt ki kanpinchale… roju chavandi chavandi ani mothhukunna e prasaraalu aapaledhu…

  ippudu students nayamo, anyamo edo okati telchukundhmani udhyamamu chesthunte emi prasaram cheyakundaa aaputhunnaru…

  avunu… maa channel ki ilantivi nachhavu….

  MMS clips, barya barthala panchayithulu, crime reports… manchi masala scenes add chesi chupinchadame…

  chi mee brathuku… endhukuraa tag lines pettukuntaaaru…

  1. అందుకే జర్నలిజం విలువలను మంటకలపొద్దని వార్ని వేడుకున్నది సార్. జర్నలిస్టులమని చాలా సదుపాయాలు పొందుతున్న ఈ దొంగలని ఆ పేరు మార్చుకోమని చెప్పెది..

 2. dear sir idi kudaa mana manchike, manam ante saamanyulam. konnisarlu media kacchithangaa mounam gaa undaali. adi chaalaa avasaram ani neevu thelusukunte manchidi. media unnadi chupithe bhuthaddam lo chupisthunnaru antaaru, adi pedda problems create chesthundi., ofcourse media unnadi unnattu chupinchali,. kaani konnisarlu law and order control cheyadaniki, santhi badrathalu nelakolpadaniki media monam gaa undatam entho manchidi ani naa uddesam,,,,. eee mana media nu chusukune rajakeeyanaayakulu recchipothunnaru.
  kaani oppukovalasina visayam…. prasthutham unna media “money media”

  1. నిజాన్ని నిర్భీతిగా వ్యక్తీకరించలేనప్పుడు తమ వృత్తిధర్మానికి న్యాయం చేసినట్లుగా ఎలా అవుతుంది? మౌనంగా వుండాల్సిన చోట వుండాలి. మాటాడాల్సిన చోట మాటాడాలి. ఇది వ్యతిరేక దిశలో జరుపుతున్నారు. వైఎస్ మరణమప్పుడు అంతలా మనుషుల బుఱలు పాడయ్యేట్లు, గుండెలు పిండే సంగీతంతో ప్రసారం చేయాల్సిన అవసరమేమొచ్చింది. దానివలన ఎన్ని ప్రాణాలు పోయాయి. అలాగే విజయవాడలో ఓ పాప వైష్ణవి చనిపోయినప్పుడు ఎంతలా గోస పెట్టారు? జరిగిన దానికి బ్యాక్ గ్రౌండ్ వాయిద్యాలతో కలరింగ్ ఇచ్చి చూపడం జర్నలిజమా? ఒక్కో చానల్ లో ఒక్కోలా కథనాలు రావడం వార్త పట్ల ఆయా చానళ్ళ వెనక దాగిన ప్రభావాలు కారణం కాదా? తెలంగాణా యూనివర్శిటీలలో ఏం జరుగుతున్నదో ఉన్నది ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేయడానికి ఏమడ్డు వచ్చింది. అంటే ఆయా వార్తల వలన అలజడి వస్తుందంటే అక్కడ వాళ్ళకు ఏదో అన్యాయం జరుగుతున్నట్లే కదా భావించాలి. వాళ్ళతో మాటాడి సంయమనం పాటించేలా ఒప్పించగలిగేది మీడియా ద్వారానే కదా? కాల్చుకు చచ్చిపోయే వాడిని ఫోకస్ చేసి చూపించడంలోని శ్రద్ధ కెమెరా దించి కాపాడడంలో చూపరెందుకు? ఇలా మాకు చాలా అనుమానాలున్నాయి. మరల మరోసారి. ధనబలం, కులబలం, అధికారబలం అండగానే సాగుతున్నంత కాలం జర్నలిజం గురించి మాటాడుకోలేం.. విమర్శనాత్మక వార్తల పట్ల ఆశగా ఎదురుచూడడమె…

 3. అమ్మ నాబూతులు తిట్టుకుంటూ రెచ్చగొట్టె చర్చలు…పొలీసులమీద రాళ్ళు రువ్వడాలు బస్సులు తగలెట్టడాలు బందులూ ఉండా లంటారు అంతేనా??

 4. నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను.
  పాయిన సారి ఈ మీడియా వల్లనే అంత జరిగింది, ముఖ్యంగా ou లో జరిగిన laati చార్జీని పదే పదే చూపించడం వల్ల కూడా విద్యార్ధులు రేచ్చిపోయినట్లు నాకు అనిపిస్తుంది, ఎందుకంటే,
  ఒకే దెబ్బను పది సార్లు ‘జూమ్ ఇన్’ అండ్ ‘జూమ్ అవుట్’ చేసి చూపించారు.
  అందుకనేనేమో ఈ సారి మీడియా సంయమనం పాటించాలని ప్రభుత్వం చెప్పడం జరిగింది,
  ఇటువంటి సున్నితమైన విషయాల మీద, చర్చలు జరిపేటప్పుడు, మీడియా కూడా ఒకటికి రెండు సార్లు అలోచిస్తే బాగుంటుంది,

  ఈసారి నుంచైనా మీడియా అతి చేయడం మానేస్తుంది అనుకుంటున్నాను,
  మీడియా ఓవర్ చేయకపోతే తెలంగాణా ప్రాబ్లం ని solve చేయడం సులువు అవుతుంది,
  ప్రజలందరి సహకారంతో, ఇప్పుడున్నటువంటి state problems అన్ని త్వరలోనే పరిష్కరమవుతాయని ఆశిస్తున్నాను,

  జై తెలంగాణా, జై సమైఖ్యంద్రా, జై రాయలతెలంగాణ , జై సీమాంధ్ర.

 5. ఔనన్నా కాదన్నా మీడియా చానళ్ళు ,
  స్వచ్చంద సంస్థలో , సేవా ట్రస్ట్ లో కావు కదా…
  హిట్ల తో హిట్టయ్యే ప్రైవేటు వ్యాపారమది…
  వ్యాపారమంటేనే సగం అబద్దం…
  నిజాలని నిజాలుగా చూపమనడం వారికి అసంబద్దం…
  వాటిని చూస్తూ అపోహలో బ్రతకడం మన ప్రారబ్ధం…

  “మూడవ ప్రపంచ యుద్దం రాబోతుందా?
  మనిషికి మళ్ళీ తోక రాబొతుందా?
  సోనియా మళ్ళి ఇటలీ వెళ్ళి పోతారా
  వైఎస్ ఉత్‌ప్రేరకాలని వాడి పాదయాత్ర చేపట్టారా?
  అవుననే చేబుతున్నాయీ తాజా-పరొశోదనలు! ఇలాంటి ఆసక్తికర అంశాల కై చూస్తూ ఉండండి .. నిరంరంతర …బ్లా బ్లా బ్లా !”…

  ఇల్లాంటి నిత్యజీవితానికి సంబంధం లేని ఊహావాదాలు, బాధావాదాలు(sadism)…

  ముసుగొలో, లొసుగులని బాగా ఉపయోగించుకుంటున్నాయ్ ఆన్నీ చానళ్ళు…

  వీటికన్నా ఆ “సప్తగిరిలో”, అంతరాయం లో వచ్చే ఆ రెయింబొ కలర్స్ చూస్తూ కూర్చొవడం బెట్టర్……

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s