మనకై మనం నిలబడేదెన్నడు?

“Wanting to be someone else is a waste of the person you are.”
Kurt Cobain

ఎప్పుడూ ఎవ్వరి వెంటో నడవడానికి
చూపే ఉత్సాహంకంటే..
నీ కాళ్ళ బలిమి తెలిసి నిన్ను నీవు
గట్టిగా నేలను తన్నిపెట్టి
నిటారుగా వెన్నుపూస
నిలిపి మాట్లాడే మనిషిగా
రూపొందలేవా?

ఎవడో ఒక మాయల మరాఠీ వెనక
వాడి మంత్ర దండపు మాయా శక్తి
లో ఏదో దాగుందన్న ఆతురతతో
పరుగుపెట్టడమే తప్ప
నీ పిడికిట బిగించి గట్టిగా
చేయెత్తి ఎప్పుడైనా విసిరికొట్టావా?

ఎక్కడిదో ఓ చద్దన్నం మూట
రాలిపడదా..
ఈ పూటకు గడిపేయలేనా
అన్న నిస్సత్తువ మూలుగు తప్ప
నీ పొలికేకతో దిగంతాలు పెక్కటిల్లి
భూమి పొరల దాగిన
నీదైన మెతుకు ఉబికి వస్తుందన్న
స్పృహ లేనితనమింకెన్నాళ్ళు?

ఈ బేలతనం వల్లనే
నిన్ను నీవు కబేళా పశువులా
తోలబడుతున్నావన్న గ్రహింపు
ఇంకెన్నాళ్ళకి?

(ఈ నాయకుల వెంట పరుగులెత్తుతున్న గొఱెలమందను జూసి)

5 comments

  1. idi chal aavedanala samayam meeru chala disturb ayyaru ilaanti ennitini ee bhumi chudaledu. evadi vento padithene jeevika ani nammevallani nitaruga nilchomanagalama? manam mathram aa janamlo okaramga ishtamunna lekunna kalipiveyabadaleda? avedana aksharuluga ….

  2. అద్భుతం, మహాద్భుతం, ఈ కవిత అంతయు చాల చక్కగా వ్రాసారు ,

    ఇది మీ ఒక్కరి అభిప్రాయము కాదు, ఇది మనలాంటి వారందరికీ వర్తించే ఒక చక్కటి కవిత.

    ఈ కవితలోని ఒక్కో పదం నన్ను ఉత్తేజ పరచింది ,

    ఈ కవిత మరింత మందికి చేరువ కావాలని కోరుకుంటున్న ,

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s