రక్తచరిత్ర2 – సాఫీగా చప్పగా ఓ సందేశంతో…

ఎంతో ఉద్వేగానికి లోనవుతూ ఏం చెప్పాడోనని ఆశగా ఈ రోజునుండి మా ఊళ్ళో రిలీజైన మోర్నింగ్ షోకు వెళ్ళాను. కానీ సినిమాలో కాంట్రవర్సీగా చెప్పుకోదగ్గ సీను లేకపోవడం, సమకాలీన రాజకీయ నాయకులెవరినీ ప్రొజెక్ట్ చేయకపోవడంతో సాదాసీదాగా, చప్పగా, సాఫీగా సాగిపోయింది.

చెప్పుకోదగ్గ విషయమేమంటే వివేక్ ఒబెరాయ్ కు పోటీగా సూర్య నటించాడు. మొదటి సీనులోనే మందుపాతరతో ఎంటరై అక్కడ చూపిన భావాలు ఓ యువకుడి పగ, ప్రతీకారాలకు దర్పణం పట్టాయి. ఎక్కడా తగ్గకుండా మొఖంలో భావోద్వేగాలను పలికించారిద్దరూ.. సునీత పాత్రధారికి కొంత అవకాశమిచ్చాడిందులో, ప్రియమణి నటనకూడా బాగుంది. సమకాలీన రాజకీయ నాయకుల పాత్రలను చూపకపోవడం, డైలాగులు సైలెంటయిపోవడంతో వర్మకూడా సినిమా ఆడనివ్వరని భయపడ్డాడని తెలుస్తోంది. దాంతో రెండో భాగంలో తెలిసిన కథనే తెరమీద మరో మారు చూడడంతో అంత ఫీల్ కలగలేదు. నటీ నటులు పాత్రోచితంగా నటించి మెప్పించారనొచ్చు. అంతవరకు అనుకొని చూడొచ్చు. టేకింగ్ కెమెరా తలకిందులుగా తిప్పడం, అడ్డదిడ్డంగా తిప్పుతుండడం తిక్కశంకరయ్యలా అనిపిస్తాడు. నాగేంద్ర హరాయా అన్న బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఆ సీనుకు అవసరమా అనిపిస్తుంది. ఈ తిక్క లేకపోతే చాన్నాళ్ళకి మొఖంపై కెమెరా ప్రతిఫలించి, కళ్ళలో నటన చూపే నటులను చూస్తున్నామన్న ఫీలింగ్ మిగులుతుంది..

చివర్లో శుభలేఖ సుధాకర్ అవకాశ వాద రాజకీయనాయకుల ఫీలింగ్ బయటపెట్టాడు. అలాగే ఆఖర్లో ప్రతాప్ రవి కొడుకు మొఖం చూపించి ముగించడంతో మరో పదేళ్ళకో, పదిహేనోళ్ళకో ముసలి వర్మ రక్తచరిత్ర-3 భాగంకోసం వేచిచూడమన్నట్లుంది..

కత్తులతో సావాసం పాట మంచి సందేశాత్మకంగా వుండి వర్మ గొంతులో వినసొంపుగా వుండి Heart touching వుంది…

మొత్తమ్మీద తీసినదాంట్లో మనకు సగమే చూపించగలిగిన వర్మను అభినందిద్దాం..

ప్రకటనలు

8 comments

  1. Sir,
    ‘మాతృభాషలో విద్యాబోధన’ చేస్తున్న ‘చైనా’ లోని 50 విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోని అత్యున్నత 500 విశ్వవిద్యాలయాల జాబితాలో స్థానం సంపాదించగలిగాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేస్తున్న భారతీయ విశ్వవిద్యాలయాలు కేవలం ’02′ మాత్రమే ఈ జాబితాలో స్థానం సంపాదించగలిగాయి. మా మాతృభాషలో విద్యాబోధన ద్వారానే సృజనాత్మకత వికసిస్తుంది..అని నా అభిప్రాయం.

    1. రాం గారు ఈ నిజం మనకు మింగుడుపడదు. ఇంగ్లీషును కేవలం కమ్యూనికేషన్ లింక్ గానే వాడుతారు మిగిలిన దేశాలలో. చైనా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాధ్యక్షులు కూడా వారి వారి మాతృభాషలలోనే UNO లో, విదేశీ పర్యటనలలో కూడా మాటాడుతారు. వారి మధ్యన దుబాసీలుంటారు. ఈ జాఢ్యం మన వలసదేశాలలోనే వుంది. మాతృభాషలో విద్యాబోధన వలన పిల్లలకు మనోవికాసం కలిగి, వారు తొందరగా అవగాహన చేసుకునే వీలుంటుంది. తద్వారా వారిలో చదువుపట్ల ఆసక్తి పెరుగుతుంది. అసలు మన దేశంలో నిజమైన చదువు చెప్పే విద్యాలయాలే లేవు. శాస్త్రీయ విద్యా బోధన జరగడంలేదు. అందుకే విద్యార్థుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వారిలో నైరాశ్యం అధికమవుతోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s