రజినీ అమితాభ్ కు భయపడి..

నిన్న మా వూళ్ళో రోబో ఆఖరు అంటే రాత్రి ఫస్ట్ షో చూసాను. ఇప్పటి వరకు చూద్దాం అనుకుంటూ వాయిదా వేసి సి.డీ.లో చూస్తే అంత ఎఫెక్టివ్ గా వుండదని చివరి రోజు చూసాను. రజిని ఇంటర్వ్యూలో అన్నది నిజమైంది. ఐష్ తో చేసిన మొదటి సాంగ్ లో గ్రూప్ డాన్సర్స్ లేకుండా చేసేటప్పుడు ఆమెకు దగ్గరగా వెళ్ళేటప్పుడు అమితాభ్ గుర్తొచ్చేవారని చెప్పాడు. సినిమా అంతా ఆమెకు ఆమడ దూరంలోనే పాపం యాక్ట్ చేసాడు. ప్రేమ సన్నివేశాలు కూడా డైలాగ్ కు పరిమితమై పోయాడు. దగ్గరగా హత్తుకొని చేసిన సన్నివేశమే లేదు. పాపం రజినీ.

సినిమా మధ్యలో కొంత బోర్ కొట్టినా ఫస్ట్ హాఫ్, క్లైమాక్స్ సూపర్. నిజమే భారతీయ వెండితెరపై ఇంత గ్రాఫిక్స్ తో చేసిన సినిమా లేదు. రజినీ స్టైల్, మేకప్, రోబో నటనలో చేసిన విలనీ చాలా బాగున్నాయి. ఐష్ నలభయ్యో పడిలో కూడా అందంగా కనువిందు చేసింది..నిజమే ఓ పాటలో అన్నట్లు ఇంత అందం పచ్చిక అయితే పులి కూడా గడ్డే తినేది..
థాంక్స్ టు శంకర్..

11 comments

 1. “ఇంత అందం పచ్చిక అయితే పులి కూడా గడ్డే తినేది..”

  Aha…!!

 2. మీరు మొదటిపాట అయ్యాక వెళ్ళారా?
  దగ్గరకి వెళ్ళకపోవడమేమిటండి అన్ని ముద్దులు పెట్టించుకుంటేను.

  “ఇంత అందం పచ్చిక అయితే పులి కూడా గడ్డే తినేది..” బాగుంది.

  1. పేర్లు వేసినప్పటి నుండే చూసాను. కానీ ఎందుకో అంత ఫీలింగ్ కనిపించలేదు. అంతే..

  1. రోబోనే ప్రేమలో పడేసి మొత్తం స్క్రిప్ట్ మారిపోయేట్టు చేసిన ఐష్ని రజినీ అలా అలా టచ్ చేయడం నాకెందుకో అంత ఫీల్ వున్నట్టు అనిపించలేదు. దగ్గరగా కౌగిలించుకుని తన్మయత్వం చెందే సీనే కనబడలే.. ఎండింగ్ కూడా చివరికైనా అది మిలటరీకి వుపయోగపడేట్టు మార్చి వుంటే బాగుండేది. శంకర్ ఐష్ ప్రేమలో పడిపోయినట్టున్నాడు.. హహహ..

 3. PULI GADDI THINTe MARI MANAMU ?.MANA JEBULO VUNNA NAALUGU ROOPAAYALANU VAADI JeBULO VESUKOVADAANIKI VAADU ENNENNO MAAYALU ,ROBOLU ,MUDDULU,HUGGULU ILAA ENNO CHESTAADU …MARI MANAMU VAADI MAAYALO PADAKOODADHU.

వ్యాఖ్యలను మూసివేసారు.