‘సత్యం’ వధ..

ఓ అభాగ్యురాలు


సత్యంవధ


అయోధ్య తీర్పు నేపథ్యంలో పేద దళిత వర్గానికి చెందిన సత్యంను దోషిగా నిర్థారించి ఆయేషా మీరా హత్యాచారం కేసును ముగించేసారు మన పెద్దలు. మొదటినుంచి ఆయేషా తల్లిదండ్రులు ఈ నేరంలో స్థానిక కాంగ్రెస్ నాయకుని బంధువునిపై అనుమానం వ్యక్తం చేస్తున్నా కనీసం ప్రశ్నించనైనా ప్రశ్నించకుండా లడ్డూ గాడెవడో ఈ పనిచేసాడని కొన్నాళ్ళు, ఆ తరువాత వాళ్ళ బంధువులలో బకరాలను వెతికే పని కొన్నాళ్ళు సాగించి చివరకు సత్యంబాబును ఇందులో ఇరికించారు. పోలీసు ట్రీట్మెంటుకు ఆయన మొదట నేరాన్ని అంగీకరించినట్లు వార్తలొచ్చినా ఆ తరువాత న్యాయస్థానంలోనూ, బయటా తనను ఇరికించారని గోలపెట్టడంతో కాళ్ళూ చేతుల నరాలు తీసేసినట్టున్నారు. దాంతో నడవలేని స్థితికి చేరుకున్నాడు. దీనిపై ఎందుకిలా తన ఆరోగ్యం క్షీణించిందో, ఎవరు కారకులో అని ఒక్కనాడైనా తన ముందుకు మోసుకురాబడుతున్న వాడిపట్ల గంతలు కట్టబడ్డ న్యాయదేవత కరుణ చూపలేకపోయింది. ఆ మధ్య కాళ్ళు రానివాడు పారిపోయాడని పుకారు పుట్టించారు. ఇదేదో మరో ఎన్ కౌంటర్ కథగా అనుమానించిన మీడియా హుషారువలన ఆరోజుకు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇప్పుడు ఈ తీర్పుతో సత్యం సమాధి కాబడిందని ఆ తల్లిదండ్రుల గోడు వినేదెవ్వరు? వారి కడుపుకోతతో కూడిన శాపనార్థాలు ఫలిస్తాయా? ఎందరో ప్రత్యూషలలో మరో ఆయేషాగా మిగిలిపోనుందా?

ప్రకటనలు

2 comments

  1. ఈ కేసు కనుక బయట పడింది అదీ ఈ విధంగా కనీసం వెలుగు చూసింది
    మరెన్నో ఇలాంటివి అసలు వేలుగులోకే రాలేదు

  2. ఆయేషాను ముంచిన ‘కోనేరు ‘పాపము పోవాలంటే సత్యాన్ని బలిఇవ్వాలా ,వద్దా?.మేము చదువు కునే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు j.r .s (జనరక్షణ సమితి )వాళ్ళైతే దోషులకు సరిఅయిన శిక్ష వేస్తారు అని అనుకునే వాళ్లము .జనరక్షణ సమితిని జనాలే కాపాడుకోలేక పోయారు. ఇంకా ఇటువంటి వాటిని ఎన్ని చూడాలో ,ఇలాంటి అసహాయ ఆయేషాలకు దిక్కు ఎవరు ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s