సల్మాన్ ఖాన్ అన్నదాంట్లో తప్పేముంది..


ముంబయి దాడులపై సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ప్రముఖులున్న కేంద్రాలపై దాడులు జరగడం మూలంగానే దానికి అంత ప్రాముఖ్యమిచ్చారని అన్నదాంట్లో తప్పేముంది. సామాన్యులుపై జరిగిన దాడులపై గానీ, ప్రమాదాలను గానీ, అత్యాచారాలను గానీ, హత్యలను గానీ పాలక వర్గం సరిగా స్పందించి చర్యలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అదికూడా రాజకీయపరమైన లబ్ధి చేకూర్చేది, ఓట్లను కూడబెట్టేదైతే తప్ప స్పందించేది అతి తక్కువ సార్లు మాత్రమే. ఈ విషయంలో ఆయనను తప్పుపట్టడం తప్పు. ఇంక పాకిస్తాన్ హస్తంపై వ్యాఖ్య దానిపై పాలక వర్గమే గట్టిగా నిలదీయలేకపోతోంది. చక్రవర్తి అమెరికా వారు అక్కడో మాట ఇక్కడికొచ్చాక ఇక్కడో మాట అన్నా ఖండించలేని దౌర్భాగ్యం మనది.

7 comments

  1. మరి సల్మాన్ఖాన్ గారు స్పందించిన ‘దాడి ‘సామాన్యుల మీద జరిగిన దాని మీదనా? సల్మాన్ఖాన్ గారు ఇంతకుముందు ఎప్పుడు సామాన్యుల మీద జరిగిన దాడిని ఖండించిన సందర్బాలు కూడా లేవు .పాలకవర్గమే కాదు ,మామూలు జనం కూడా స్పందిచే విషయాలు కొన్ని చెప్పుకుంటే చాలా భాదాకరంగా వుంటాయి. ఇదే బ్లాగ్లో వున్నా కొన్ని విషయాల మీద జనాలు స్పందించే తీరే దీనికి ఉదాహరణ. ఏది ఏమైనా ఎవరి మీద ,ఎవరు దాడి చేసినా -ఎవరు అన్యాయము చేసినా దాన్ని అందరమూ ఖండించాలి,భాదితులకు భాసటగా నిలవాలి .

  2. మరి సదరు సల్మాన్ గారికి ఫుట్పాత్ మీద పడుకున్న సామాన్యుల మీదికి కార్ ఎక్కించినప్పుడు ఈ నీతులు గుర్తు రాలేదా??
    ఏమైనా, ఆ జీవి చెప్పినదాన్లో నిజముంది.. ఎందుకంటే దశాబ్దాలుగా నక్సలైట్ ముఠాలు ప్రజలను ఊచకోత కోస్తున్నా ప్రభుత్వం తరఫున పెద్దగా ప్రతిఘటనలు లేవు.. వ్యాస్,ఉమేష్ చంద్ర లాంటి జాతి వజ్రాలను కోల్పోయినా చలనం లేదు.. ఈ కోణం లో సల్మాన్ చెప్పింది కరెక్టే!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s