రాజుగోరి వై’భోగం’

సింహాచలం మేడ

మా విజయనగరం పూసపాటివారి పాలనలో అలరారిందని మీకందరికీ ఎరుకేకదా? రాజుల వైభోగం ఎంతలా విరాజిల్లేదో ఈ ఫోటోలోని మేడ చూస్తే తెలుస్తుంది. సింహాచలం అన్న భోగం స్త్రీకి ఈ మేడను అప్పట్లో రాజుగారు కట్టించి ఇచ్చారంటారు. ఇప్పటికీ ఈ మేడను సింహాచలం మేడ అంటారు. ప్రస్తుతం ఇందులో ఓ ప్రభుత్వ వసతి గృహం నడుస్తోంది. కానీ ఈ మేడను చూడగానే రాజుగారి వై ‘భోగం’ గుర్తుకువస్తుందిక్కడి వారికి..

13 comments

 1. విజయనగరంలో మా బంధువుల ఇల్లు కంటోన్మెంట్ వెనుకాల ఉండేది. వాళ్ల ఇంటి ఎదురుగానే ఆనంద గజపతి రాజు బిల్డింగ్ ఉండేది. అది కూడా ఖరీదైన బిల్డింగే.

 2. అబ్బ మా విజయనగరం గుర్తుకు తెచ్చారు సింహాచలం మేడ చూపించి. దీని పక్కనుండి ఎన్నిసార్లి తిరిగామో…… of course ఇప్పటికీ తిరుగుతున్నామనుకోండి.

 3. నా భాషా ప్రవీణ చదువు విజయ నగరంలోనే జరిగింది. తెలుగు పండితునిగా ఉద్యోగ విరమణ అక్కడికి దగ్గరలో ఉన్న డెంకాడ గ్రామంలో. మళ్ళీ మన సింహాచలం మేడని చూపించేరు. చాలా సరదా
  వేసింది.ధన్యవాదాలు. విజయ నగరం నేపథ్యంలో నేను రాసిన గెలుపు కథని నా బ్లాగులో ఉంది
  నాబ్లాగు లింక్: http://kathamanjari.blogspot.com

 4. ఎంతో మంచి రాజులు కనుకనే భోగం వారికి కూడా వారి కి స్థాయికి తగినట్లు ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇప్పటి వారిలా వాడుకొని వదిలేయ లేదు.

 5. అయితే ఏమిటట? మీ పూర్వికులు విజయనగరం రాజుల దగ్గర పని చేస్తే మా పూర్వికులు పరలాకిమిడి రాజుల దగ్గర పని చేశారు. బ్రిటిష్ వాళ్ల కింద పాలెగాళ్లగా పని చేసి వాళ్ల దోపిడీలో భాగం పంచుకోబట్టే భోగం స్త్రీలకి కూడా ఖరీదైన భవనాలు కట్టించగలిగారు. లేకపోతే భార్యలకి బంగారు నగలు చెయ్యించడం వరకే డబ్బులు సరిపోయేవి.

  1. మరో బొబ్బిలి యుద్ధం వచ్చేట్టుంది. విజయనగరం వారు ఫ్రెంచి వారి అండదండలతో దొంగదెబ్బ తీసి బొబ్బిలి రాజులను ఓడించారు.బొబ్బిలి వారు ఓటమికి ముందే సైన్యం తప్ప వారి కుటుంబాలన్నీ ఆత్మహత్య చేసుకున్నాయి. తలవంచని వెలమదొరలుగా బొబ్బిలి వారు అందుకే ప్రాచుర్యాన్ని పొందారు. వారు చేసిన మోసానికి ప్రతీకారంగా తాండ్రపాపారాయుడు వారి సైన్యాన్ని, విజయనగరం రాజును తర్వాత చంపేసి ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు. వాళ్ళు బ్రిటిష్ వారితో ఫ్రెంచి వాళ్ళూ నిష్క్రమించాక చేతులు కలిపి వుండవచ్చు. బొబ్బిలి యుద్ధం తెలుగుదేశాంలో పల్నాటి చరిత్రంత ప్రాచుర్యం పొందింది.
   ఈ లీంక్ లో నాటి పరిస్థితులు చదవొచ్చు.http://mkatten.tripod.com/bobbili.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s