ఇదెప్పుడో చేసుండాల్సింది బాబయ్యా..

గత మూడురోజులుగా బాబ్లీ యాత్ర చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు బృందాన్ని బంధించి మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నిబద్ధతను చాటుకోవడంలొ ముందున్నారు. ఒక ప్రక్క రాష్ట్రం మాజీ నేతనే నిర్బంధించడం ద్వారా వాళ్ళు తమ పనిని సమర్థించుకోజూస్తున్నారు. అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ విషయంపై అసలు పట్టించుకున్న దాఖలా లేదు. మన సి.ఎం.గారికెంత సేపు తన ముడ్డి కింద కుర్చీ ధ్యాస తప్ప కనీసం వార్తలు కూడా ఎరగనట్లు మాటాడుతుంటారు. ఈ ఎవడి గోల వాడిదిగా వున్న సీజన్లో తెలంగాణాలో ఉప ఎన్నికల నేపథ్యంలోనే మన నాయుడు బాబుకు ఈ విషయం గుర్తొచ్చింది.

ఏ మాటకామాట చెప్పుకోవాల. మన రాజకీయ ఏలికలకు పదవిలో లేనప్పుడే దేశభక్తి, ప్రజల అవసరాలు గుర్తొస్తాయి. సందట్లో సడేమియాలా మన చిరు ప్రధానమంత్రి గారిని 23 న కలిసాక నా ఏడుపేదైనా వుంటే ఏడుస్తానంటారాయె. ఆయన గురించి అప్రస్థుతం లెండి.

అసలు మనది ఫెడరల్ రాజ్యాంగ నిర్మాణంగా ప్రకటించుకున్న పాలనలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వీసా అక్కర్లేకుండానే వెళ్ళనొచ్చునని మనం ఇంతకాలం అనుకుంటున్నది తప్పుగా రుజువయ్యిందనుకోవాలా?
అసలు వాళ్ళే తప్పు చేయనప్పుడు ప్రాజెక్టు చూపిస్తే తప్పేంటి?
లేక ఈ క్రెడిట్ తో తెలంగాణా ఉప ఎన్నికలలో బాబు లబ్ధిపొందుతాడేమోనన్న భయంతో సోనియమ్మ ఆదేశంతో ఉభయ రాష్ట్రాల కాంగ్రెస్ పాలకులు కలసికట్టుగా ఈ నాటకం ఆడుతున్నారా?
ఏదేమైనా ఈ పని ఓ పదేళ్ళక్రితమే చేసివుంటే ఫలితం వుండేదేమో? ఆల్మట్టిడాం గురించి ఎప్పుడు గుర్తొస్తుందో? Let us wait and see..

ప్రకటనలు

7 comments

  1. బాబు ని అరెష్ట్ చేస్తే క్రెడిట్ కొట్టేస్తాడు …గెలిచే అవకాసం ఉంది… సోనియా హస్తం ఇందులో లేదేమో..

  2. అన్నా..! 2004 ఆగష్ట్‌లో అక్కడ బాబ్లి పునాది వేస్తున్నప్పుడే..టి.డి.పి. వాళ్ళు గొడవ చేసారు..తర్వాత టి.ఆర్.ఎస్ వాళ్ళు సుప్రీం కోర్ట్ లోకేసు వేసారు..తర్వాత పచ్చతమ్ముళ్ళు ఒక సారి కాదు మూడు సార్లు అక్కడ దర్నాలు చేసారు..2007 లో పాపం పచ్చతమ్ముళ్ళకు వీపులు.పగిలేలా..కాళ్ళు విరిగేలా..కుమ్మి పడేసారు..అందులో ఎర్రబల్లి దయాకర్ ని ఒకటే కుమ్ముడు…పాపం ఎర్రబల్లి..వీపు విమానమోత..ప్చ్ అప్పుడూ మన దేవుడు గారు కదా ఇక్కడి పాలన ఎటువంటి..స్పందనలేదు..చాలా సార్లు పోరాడారులే..కాని ఇప్పుడొచ్చినంత మైలేజి అప్పడు మీడియాలో రాలేదు అదీ సంగతి.

  3. డిల్లీ కి గొర్రెల మందలా ఎంపి ల ను పంపడానికి తప్ప ఈ తొక్కలో తెలుగోళ్లం ఎవడి ఈ.. పీకలేమ్. .ఇక జరుగుతున్నదంతా రాజకీయమే.. నో డవుట్…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s