ఇంకా కొనసాగుతూ..న్న పెళ్ళి సాంప్రదాయాలు…

ఈ మద్య  జరిగిన పెళ్ళిళ్ళలో పల్లెల్లో ఇంకా ఈ పల్లకీ ఎక్కి ఊరేగే సాంప్రదాయం కొనసాగుతూనే వుంది. పట్టణంలో జరిగే వాటిలో ఎక్కడా కనబడకపోయినా పల్లెటూళ్ళలో ఇలా పల్లకీపై పెళ్ళికూతురు పెళ్ళికొడుకులను వివాహానంతరం మోస్తూ ఊరేగించడం అక్కడక్కడా కనబడుతోంది. ఇప్పుడంతా కార్లలో ఊరేగింపే కనబడుతూ ఇలా ఒక్కసారిగా చూసే సరికి ఇంకా వదల్లేదా అనిపించింది. ఈ పల్లకీలను ఈ ప్రాంతంలో చాకలి కులస్తులే మోస్తుంటారు. దీనికి గాను వాళ్ళకూ అధికంగానే ఇవ్వాలి. దీనిని ఇక్కడ సవ్వారి అంటారు. ఇంకా ఒక ఊరి నుండి వేరే వూరికి తీసుకు పోయేటప్పుడయితే పాటకూడా పాడుతూ తీసుకుపోతారు. ఆ పాటలో కాస్తా బూతు కలిపి ఉషారుగా నడుస్తూంటారు. కొద్ది సం.ల క్రితమైతే చాలా డెకరేట్ చేసే వారు. ఇప్పుడు అది తగ్గింది.  ఏమైనా ఇంకా సాంప్రదాయం వదలకపోవడం, ఇలా మనుషులు మోయడం వాళ్ళకు ఉపాధిగా అనుకుంటే ఒకలా వుంది, సామాజికంగా ఆలోచిస్తే ఈ భూస్వామ్య మనఃస్తత్వం వదలదా అనిపిస్తుంది.


5 comments

 1. సామాన్యుడు గారికి, నమస్కారములు.

  మీ వ్యాసం చదివాను; మీ మనసుని చదవటానికి ప్రయత్నించాను.

  “ఏమైనా ఇంకా సాంప్రదాయం వదలకపోవడం, ఇలా మనుషులు మోయడం వాళ్ళకు ఉపాధిగా అనుకుంటే ఒకలా వుంది, సామాజికంగా ఆలోచిస్తే ఈ భూస్వామ్య మనఃస్తత్వం వదలదా అనిపిస్తుంది. ”

  మీ ఫొటోలో చూస్తే, అక్కడ వున్నవాళ్ళు “భూస్వాములు”గా కనపడటలేదు. పల్లకీని మోసేవాళ్ళకంటే, పల్లకీని ఎక్కిన్వవాళ్ళు కొంచెం ధనవంతులు అయివుండవచ్చునేమో.(ఫొటోలోని వాళ్ళు). కాల,మాన,పరిస్థితులనుబట్టి, మానవ ధర్మాలు మారుతుంటాయి. మొన్న,మొన్నటివరకూ మనుషులు లాగే రిక్షాలు; జట్కాలు వుండేవి. అప్పుడు మనం, మనుషులు, మనుషులను మోయటం అమానుషం అని అనగలిగేవారమా? చెప్పండి? అయితే, ఆ మనిషి చేస్తున్న పనిలో మెరుగైన ప్రమాణాలు వుంటే బాగుంటుంది. ఈ రోజుకీ, ఒక మనిషి పనిని మరొక మనిషి చేస్తూనే వున్నాడు. ఉదా:- మనం పడేసిన చెత్తను ఊడ్చేవాళ్ళు/తీసుకెళ్ళేవాళ్ళు; షాపుల్లో , మన కాళ్ళు పట్టుకొని చెప్పులు తొడిగేవాళ్ళు; మొదలైనవి. “మనిషి, మనిషి బ్రతికివున్నప్పుడే కాకుండా, చనిపోయినతరువాతకూడా తన బుజాలపై మ్రోస్తున్నే వున్నాడు. “ధనవంతులే ఎప్పటికీ ధనవంతులు అవుతుంటారు – బీదవాళ్ళు ఎప్పటికీ బీదవాళ్ళగానే వుంటున్నారు” అని సమాజం వ్యాఖ్యానిస్తూ వుంటుంది. అయితే, ధనవంతుడు – బీదవాడు అనే తేడా ఎప్పుడూ వుంటుంది. కారణం, పనిచేయటానికి బీదవాడు కావాలి; పని ఇవ్వటానికి ధనవంతుడు కావాలి. సమసమాజంలో అందరూ ధనవంతులు కావాలి అంటే, పనిచేసేవాడు ఒక్కరూ వుండరుకదా!!

  భవదీయుడు,
  మాధవరావు.

  1. మాధవరావుగారూ మీ సవివరమైన స్పందనకు ధన్యవాదాలు. పనిచేసే వారుండరాదని ఎవరూ కోరుకోరు. కానీ ధనవంతుడు – బీదవాడు అన్న ఈ తారతమ్యం పోవాలని కోరుకోని మనుషుల శాతం తక్కువ. కాదంటారా. పని చేసే వారికి హక్కులుండాలనడమే నేరంగా చూస్తున్న రోజులివి. సమ సమాజంలో అందరూ ధనవంతులు కాదు లేనివారుండరు. ఈ భావానికి మీరు రాసిన దానికి కొంచెం తేడా గమనించారా? సమాన న్యాయం, సమాన ధర్మం, సమాన జీవన విధానం కోరుకోవడం మనిషిగా, ఓ సంఘజీవిగా అత్యాశ కాదుకదా? అంతా సమానంగా వుండాలంటే పనిచేయకుండా వుండాలని ఎలా అనుకున్నారు. ఒకరి భుజంపై ఎక్కే అవకాశం ఇంకోకడికి లేని వ్యవస్థ. దీనిపై మరో పోస్టు రాయాలనిపిస్తోంది.

 2. * సమాన న్యాయం, సమాన ధర్మం, సమాన జీవన విధానం కోరుకోవడం మనిషిగా, ఓ సంఘజీవిగా అత్యాశ కాదుకదా?*
  మిత్రమా! ప్రపంచం లో లేని వాటిని ఊహించటం మనసుకు అలవాటు. అందులో ఒకటి సమానత్వం. ఏది నా జీవితం లో నేను ఏక్కడా చుడలేదు, చూడ బోను కూడా. ఇది ఒక ఊహ. దీనిని నిజం చేయాలను కోవటం అంటె ఇతరులని మన భావని కనుగునం గా exploit చేయటం అంతే. నిజం గా నువ్వు సమానత్వం పాటించినా నీ మిత్రులు/ప్రజలు నిన్నొక మహాను భావుడిని చేస్తారు. ప్రపంచం లో మనుష్య జాతిలో samaanatvam పుస్తకాలలో పదం గా తప్ప నిజజీవితం లో ఉండదు. లేని వాటి కొరకు ఆరాటపడాటం అత్యాశ కన్న ఎక్కువే.

  1. శ్రీ.. సమానత్వం పుస్తకాలలో పదంగా మిగిలిపోతుందన్న మీ వ్యాఖ్య నిరాశను ప్రతిఫలిస్తుంది. అనాదిగా ఉన్న అంతరాలను పోగొట్టేందుకు మనిషి కృషి సాగిస్తూనే వున్నాడు. ఏదీ అందలేదని, ఇది అసాధ్యమన్న స్థితికి లోనైతే సమాజ గమనం ఆగిపోతుంది. మార్పు అనివార్యం. అది మన అనుభవంలోనికి రానంతమాత్రాన దాని గురించి ఆశ వద్దనుకోవడం మనలను మనం గుర్తించలేకపోవడం. నిజమే, ఎదురౌతున్న అనుభవాలు మనలని నిరాశలో ముంచెత్తుతున్నాయి. కానీ, కీర్తికోసమో, స్వలాభంకోసమో పనిచేసే వాళ్ళను చూసి నిరాశ చెందనక్కర్లేదు. మన చుట్టు వున్న వాతావరణంలో మనలను మనం నిలబెట్టుకుంటున్నామా అన్న స్ఫృహ వుంటే చాలు. మొదటి అడుగు నీదే ఎందుకు కాకూడదు.

   మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s