కొండను మేస్తున్న మేఘాలు..

ఈ రోజు ఉదయంనుండి మేఘాలుకమ్ముకున్న వాతావరణం. ఎండలు తగ్గి చల్లగా వున్న వాతావరణంలో మిట్ట మధ్యాహ్నం వేళ మిత్రుని బండి వెనక వస్తూ మా చుట్టూ వున్న కొండలు చూస్తుంటే ఈ ఆహ్లాదకర దృశ్యం కనిపించింది. ఇలా కొండలపై ఆవరించిన మేఘాలను చూస్తే మా ప్రాంతంలో మేఘాలు కొండల్లో మేస్తున్నాయిరా అంటారు. ఆ దృశ్యం మీ కోసం..


7 comments

    1. ఇప్పుడే నా సహచరి అంది ఈ ఫోటో చూసి చిన్నప్పుడు మేఘాలు కొండపై ఇలా ఆవరించి ఆకులు మేస్తాయని వాటి శభ్ధం వినిపిస్తుందనే వారని.

    1. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులోని విజయనగరం శివారు మండల కేంద్రం కొమరాడ మార్గంలోది వాసుగారు. Motorola v3i తో తీసా. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. ఈ రహదారి ఒరిస్సాలోని రాయగడ జిల్లాను కలుపుతుంది. రాయగడ మజ్జిగౌరమ్మ గుడి ఇక్కడ చాలా ఫేమస్. విని వున్నారా?

      1. రాయగడ మజ్జిగౌరమ్మ గుడి గురించి వినలేదండీ. ఉత్తరాంధ్రలో నా ప్రయాణం విశాఖ, సింహాచలం వరకు మాత్రమే సాగింది. ఇవి మూడుసార్లు వచ్చాను. ఆపైన అరసవిల్లి, అరకు, శ్రీకూర్మం, భీమిలి వంటివి చూడాలని ఎప్పటి నుంచో కోరిక. ఎప్పటికో మరి…

  1. రాయగడ మజ్జిగౌరమ్మ గుడి గురించి వినలేదండీ. ఇంతకీ ఆ గుడి ప్రత్యేకత ఏమిటండీ కొద్దిగా చెబుతారా. అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. విశాఖ కనక మహాలక్ష్మిని చూసా, పాలాభిషేకం చేసా.

    1. ఈమారు విశాఖ వస్తే అక్కడినుండి నేరుగా రాయగడకు ట్రైన్ సౌకర్యం కలదు. ఈ గుడికి ప్రతీ బుధవారం, ఆదివారం చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అక్కడి ప్రకృతి సౌందర్యం కూడా చాలా ఆహ్లాదకరంగా వుంటుంది. ఇక్కడ చాలా నమ్మకంగా కౌలుస్తారు. సమ్మక్క సారక్క లాంటి దేవత.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s