లైలా చేసిన మేలు

లైలా ఒక్కమారుగా కోస్తా తీరప్రాంతాన్ని అతలాకుతలం చేసి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసి 3 రాత్రులుగా కంటిమీద కునుకులేకుండా చేసినా  కొన్ని మంచి కార్యాలు కూడా చేసింది….

అవిః

1. ఎన్నడూ ఎరగని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయిన కాలంగా చెప్పుకుంటున్న వేళ, వడదెబ్బలకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80మందికి పైగా మరణాలు సంభవించి జనం అట్టుడుకుతున్న వేళ ఒక్కసారిగా వాతావరణం చల్లబరిచింది.

2. అలాగే చిరు పోలవరం యాత్ర, చంద్రబాబు రైతు యాత్ర, రోశయ్య ప్రజాపథంలతో వేడెక్కిన రాజకీయ వాతావరణంకు తోడుగా యువరాజ వారి వరంగల్ ఓదార్పు యాత్రతో ప్రధాన రాజకీయ పక్షాలులోనే చీలిక ఏర్పడే విధంగా సాగిన తీవ్ర వాగ్యుద్ధాలతో ఒక్కసారిగా 50 డిగ్రీలు దాటిన రాజకీయ వేడి నిట్టూర్పులను కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లుగా లైలా ఒక్క విసురుతో వాయిదా వేయించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

3. గొంతెడ్డి మంచినీళ్ళకోసం మైళ్ళకొద్దీ దూరం నడిచి వస్తున్న ఆడపడుచులకు కాసింత ఓదార్పు నిచ్చింది లైలా. కాస్తా బోర్లలో, బావులలో నీటి ఊట చేరితే అదే పది వేలు. రక్షిత మంచినీటి పథకాలకంటే తాగుడు పథకాలకే ప్రాధాన్యమిస్తున్న పాలక, అధికార గణం నిర్లక్ష్య, నిర్లజ్జ వైఖరికి ప్రకృతిమాత కన్నెఱ చేసి తన ఆడపడుచుల ఆవేదనను తీర్చిందిలా..

4. అధికారగణం అక్టోబరు, నవంబరు నెలల వరకు ఆర్తిగా ఎప్పుడు తుఫానులు వస్తాయా, ఆ సాయంపేరుతో ఆడిట్ లేని నిధులను మింగేద్దామా అని ఎదురుచూసే శ్రమ లేకుండా మేనెలలోనే వారిని కనికరించిందీ లైలా…

ఇంకా ఏమైనా వుంటే పంచుకోండి…

ప్రకటనలు

2 comments

  1. నీతో పోస్ట్ వ్రాయించింది … ఇది నీ సంతోషం ….. ప్రాణ నష్టం జరుగుతున్న సంఘటనల్లో కూడా మంచి ని చూపించే పోస్ట్ చూడటం మా దురదృష్టం… దీనిని కొంచెం చూపిస్తూ సహాయ కార్యక్రమాల గురించి కూడా ఏమైనా వ్రాస్తే బాగుండేది …..

    1. బాబా గారు లైలా తుఫాను వలన జరిగిన నష్టాన్ని తక్కువ చేసి చూపాలన్న ఉద్దేశ్యం నాకు లేదు. భారీ నష్టం చూపకుండా తీరం దాటినందుకు ఊపిరి పీల్చుకున్నాం. కానీ ఈ మధ్య మనం ఎదుర్కొన్న అత్యధిక వేసవి వేడిమిని, రాజకీయ వేడిమిని తగ్గించింది. అలాగే 20 సంల తర్వాత మేనెలలో తుఫాను రావడం, ఇలాంటి ఆపత్సమయాలలో వచ్చిన సాయాన్ని బుక్కేసే అధికారుల తీరును ఎండగడదామని రాసాను. అంతేకానీ ఈ పోస్టుద్వారా ఎవరినీ బాధపెట్టాలని, బాధపడేవారిని కించపరచాలని నా ఉద్దేశ్యంకాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s