ఎవరి పాత్రా లేదా?

నవంబర్ 26, 2008 ముంబయి దాడిలో 166 మంది హత్యకు కారణంగా అజ్మల్ కసబ్ ను నిందితుడిగా ఈ రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది. రేపు శిక్షను ప్రకటించవచ్చు.  మరో యిద్దరు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ సందర్బంగా వారు ముంబయి మాప్ లను తీవ్రవాదులకు అందజేసారన్న అబియోగంపై జడ్జి గారు వారిచ్చారన్న మాప్ లకంటే గూగుల్ యింకా క్లియర్ గా వున్నాయని వ్యాఖ్యానించారు. సరే. యివన్నీ పక్కన పెడదాం. చాలా వేగవంతంగా నడిచిన కేసుగా కూడా గుర్తిద్దాం.. కానీ నాకు కొన్ని సందేహాలున్నాయి..

అంత మంది తీవ్రవాదులు ఒక వ్యాపార నౌకపై దాడి చేసి అందులోని 5 గురిని హత్యచేసి, ఆ నౌకను స్వాధీనం చేసుకొని భారత తీర ప్రాంతానికి చేరుకొని,  సుమారు అరవై గం.లు తుపాకులతో వీర విహారం చేసారంటే దీని వెనక మన దేశవాసుల సహాయ సహకారాలు లేకుండా సాధ్యమా?

తీర ప్రాంత రక్షక దళం విదేశీ మందు మత్తులో జోగుతోందా? మన వాళ్ళ లెన్సులకందనంత వేగంగా చొరబడ్డారా?

లేక యిదంతా ఒక పథకం ప్రకారం కక్కుర్తి  స్థానిక రాజకీయ నాయకులు, పోలీసు, మిలటరీ బాసులు (సినిమాలలో లాగ) సహకరించకుండా సాధ్యమా?

కావాలని కసబ్ గాడిని పట్టుకొని ఓ డ్రామా ఆడటంగా అనిపిస్తోంది.కసబ్కు డ్రైవింగ్ లైసెన్సు యిప్పించిన వాడేవడో తెలియలేదంటే ఎంత పెద్ద చేయో వాడిది కాదా?

కర్కరే గారి బులెట్ ప్రూఫ్ జాకెట్ లోకి బులెట్ లు దూసుకుపోయాయంటే ఆ జాకెట్ కొనుగోలు వ్యవహారంలో చేతులు మారిన ముడుపులెవ్వరికి వెళ్ళాయి?

పరిశోధన ఏకపక్షంగా సాగి కసబ్ ను హీరోను చేసారు తప్ప వెనక వున్న విలన్ ల గుట్టు విప్పే జేమ్స్ బాండ్ మనకు లేకుండా పోయాడు.

వీణ్ణి ఉరితీస్తే జరిగిన ఘోరకలి మరిచిపోతారా? అసలు నేరస్తులు ఎవరో అంతటితో సరిపెట్టే కుట్ర దాగివుందనిపిస్తోంది నాకు.

అయినా సామాన్యులకెప్పుడూ మిగిలేవి అసంపూర్ణ తీర్పులు, తీరని సందేహాలే.. కాదంటారా?

9 comments

    1. మీరన్నది నిజమే కావచ్చు. వ్యక్తిగా శిక్ష వేసినంత మాత్రాన ఈ సమస్య అంతమయ్యేది కాదు. మన వ్యవస్థలోని అవినీతి, అలసత్వం, బంధుప్రీతి….etc.. తొలగించే కృషి అడుగంటింది. మీ రాకకు ధన్యవాదాలు..

  1. కర్కరే గారి బులెట్ ప్రూఫ్ జాకెట్ లోకి బులెట్ లు దూసుకుపోయాయంటే ఆ జాకెట్ కొనుగోలు వ్యవహారంలో చేతులు మారిన ముడుపులెవ్వరికి వెళ్ళాయి?

    this is height of all the points you mentioned..

    1. కర్కరే లాంటి సాహస పోలీసు అధికారి తను వేసుకున్న జాకెట్ పై నమ్మకంతోనే అలా దూసుకుపోయుంటారు కదా కార్తీక్. యిది ఎంత విషాదం. తలచుకుంటేనే పిచ్చి కోపం వస్తోంది. ప్రజలు ఏమీ చేయలేని స్థితిలోకి నెట్టివేయబడుతుండటం మరింత విషాదం.

  2. ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా వచ్చినప్పుడు తీర గస్తీ దళం నిద్రపోతోందా లేక వారు డబ్బుకి దాసోహం అయ్యారా. గూఢాచారులు ఏమిచేస్తున్నారో. ఉగ్రవాదులు మాత్రం అనుకున్నది సాధించారు. అటువంటివాళ్ళకి భయంకరమైన శిక్షలు పడాలి. ప్రజా రక్షణ అంటే చిన్న చూపు దేనికో.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s