లగడపాటి + చిరు = వ్యాపారవాదం..

లగడపాటి గారు తిరుపతిలో సభలో మాటాడుతూ చిరు తను కలిసి తెలంగాణా ప్రాంతంలో తిరుగుతామని సవాల్ చేస్తున్నారు. ప్రాంతీయవాదంలో పస లేదని సెలవిచ్చారు. తన సమైక్య వాదంలో వున్న పస వ్యాపార పస కాకపోతే ఈయనకు ఈ రాష్ట్ర ప్రజలపై ఇంత ప్రేమ దేనికేడ్చినట్లు. తన సొంత గ్రిడ్ లలో తయారయిన విద్యుత్ ను బయటకు అమ్ముకుంటూ ఇక్కడి వనరులతో వ్యాపారాలు చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించే యీయన గారికి యిక్కడి వనరుపై ప్రేమా లేక జనంపైనా?

చిరు గారు భారమైన స్టెప్పులు జనం చూడలేకపోతున్నారన్న నిజం తెలిసి మొఖానికి రంగుమాని ప్రజలకు రంగు వేద్దామని బయల్దేరి బామ్మర్థి కోటరీతో సీట్లమ్ముకొని,  తనేదో ఉద్ధరిస్తాడని మోద్దామని బయల్దేరిన మిత్రా, ప్రభాకర్ లాంటి వారు ఈయన గారి లోగుట్టు తెలిసి పారిపోయారు.                                                                  ఏనాడూ పిల్లికి బిచ్చం పెట్టని ఈయన జనాల్ని ఏముద్ధరిస్తాడు అన్నది తొందరగానే గ్రహించిన జనం దూరంగా జరిగారు. దాంతో సొంత గ్రామంలోనే ఓడిపోయి ఏం జేయాలో తెలియక, ఉన్న పరువేదో నిలుపుకుందామని కొత్తగా సమైక్య వాదాన్ని తలకెత్తుకొన్నా ఎవరూ వెంట రాక, ఒంటరిగా అద్దం ముందు నిలబడిపోయాడు.

ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి తొడగొడుతున్నారు. ప్రజల మనోభావాలను, ఉద్వేగాలను రెచ్చగొడితే కాళ్ళు విరుగుతాయి తప్ప మరేమీ కాదన్నది తొందర్లోనే ఎరుకవుతుంది. తమ తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు హైదరాబాదునుండి వెల్లగొడతారేమోనన్న భయంతో యిలా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు.

ప్రకటనలు

16 comments

 1. neeku full mind dobbindi ………endo raasthunaav………power evrikinaa ammukovachu………adi business………..common sense koodaa leni nee laantodu raatalu maaneste chaaalaa better.

  Ikapote neekante ekkuva bicham chiranjeevi vese vuntaadu…….janaala daggara janam sommu dobbi ..kukkala ki eravesinatlu vesi manushulni kone vaallu meeku dhaana prabhuvulu………..nee tala ni madichi ——-pettuko….

 2. “ప్రజల మనోభావాలను, ఉద్వేగాలను రెచ్చగొడితే కాళ్ళు విరుగుతాయి తప్ప మరేమీ కాదన్నది తొందర్లోనే ఎరుకవుతుంది.”— Please tell the same to KCR, Harish and Co also.

 3. లగటిపాటి , చిరుల సవాల్ కన్నా సమైక్యవాదం మీద మీరు కక్కే విషం చాల చీదర గా ఉంది. తెలంగాణా ప్రాంతంలో వాళ్ళిద్దరు తిరగటానికి సవాల్ చెయక్కర్లేదు తెలంగణా ప్రాంతం భారతదేశం లొ బాగమే వాళ్ళిద్దరు భారతీయులే వాళ్ళకేమి ప్రత్యేకం గా వీసాలు అవసరం లేదు .తెలంగాణ గురించి ఇంత బాధ పడుతున్నారు మీకంత ప్రేమెందుకో తెలుగుకొవచ్చా ?

 4. తెలంగాణ వాదానికి ఎంత హక్కు వుందో, సమైక్యా వాదానికి అంతే హక్కు వుంది. చిరంజీవికి ప్రజల మనోభావాలను, ఉద్వేగాలను రెచ్చగొట్టే టాలెంట్ వుందని నేనను కోవడంలేదు.

  “శాంతి యుతంగా తెలంగాణ సాధించ లేకపోవడానికి కారణం ఏమిటో ? అడ్డు ఎవరో ?” మీకు తెలిస్తే ఇటువంటి వ్రాతలు వ్రాసే వారు కాదు.

  P.S: చిరంజీవి దాన గుణానికి, తెలంగాణ వాదానికి లింకు పెట్టిన మీకు హాట్సఫ్ .

 5. @a2zdreams
  ఏడుపు ఆపు,
  చిరంజీవి దాన గుణానికి, తెలంగాణ లింకు గురించి తర్వాత అలోచిద్దాం. అతగాడి దాతృత్వం వల్ల తెలంగాణకు ఒరిగేదెమి లేదు. కాని నూతిలొ కప్పలా ఒకసారి తెలంగాణకు ఇంకోసారి సమైక్యాంద్రకు తన చిత్త చాపల్యాని పదునెడుతు తుగ్లక్‌‌కు మారుగా నిలిస్తున్న ప్రజ్ణాశాలి తెలంగాణలొ ఒంటరిగా తిరుగుతానాని ప్రగల్బాలు పోతుండు. ఒకవేళ అదే జరిగితె సినిమా స్టంటులు నిజ జీవితంలొ ఎలా వుంటాయో తప్పక తెలుస్తుంది.

  @మంచు
  మతిస్థిమితంగా వుందా, హైదరబాదునుండి ఎవర్నొ ఎందుకు వెళ్ళగొట్టాలి, ఆ చాలెంజ్ మెమెందుకు చేయాలి.

 6. శీను గారు.. పై పొస్ట్ లొ ఈ వ్యాక్యం కాస్త చదవండి.. అప్పుడు నా కామెంట్ ఎమయినా అర్దం అవుతుందేమో చూడండి..
  ” తమ తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు హైదరాబాదునుండి వెల్లగొడతారేమోనన్న భయంతో యిలా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు “

 7. దోచుకొని,దాచుకునే ఒకడు తెల్లంగానాను పలుకరిస్తాను అని ఒదార్పుకు బయలు దేరితే మానుకోట పౌరుషం చూపించి రాళ్ళతో తరిమినట్లు తరిమే రోజోస్తది వీళ్ళకి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s