లలిత – మరో యాసిడ్ హత్య

యిటీవల తెనాలిలో యాసిడ్ దాడికి గురైన తొమ్మిదో తరగతి చదువుతున్న లలిత ఈ రోజు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందింది.

ఈ దాడి జరిగిన రోజు TV9 మొ.న చానళ్ళ వారి కథనంలో ఈ అమ్మాయి దాడి చేసిన సుబ్బారావును ప్రేమించి మరల మరో అబ్బయితో సన్నిహితంగా వుండటం మూలంగా ఈ దాడి జరిగినట్లు కథనం ప్రసారం చేసారు.

అసలు ఆ అమ్మాయి వయసు సుమారు 16 సం.లు వుంటాయి. ఆ వయసు అమ్మాయికి ప్రేమ గురించి ఏమాత్రం అవగాహన వుంటుంది. ఈ చానళ్ళ కథనంలో తన అక్కను కూడా చేర్చారు.

ప్రేమ పేరుతో జరుగుతున్న యిటువంటి పాశవిక దాడులను అరికట్టేందుకు సామాజిక బాధ్యత ముఖ్యం. చదువుతున్న పిల్లలకు మానసిక పరిపక్వత రాకముందే వివిధ రకాల ప్రభావాలకు లోనవ్వడంతో యిటువంటి మూర్ఖుల చేతులలో యిలా అమాయకు బాలికలు బలి కాబడుతున్నారు. ముఖ్యంగా టీవీ మాధ్యమం పెరిగిన తరువాత సీరియల్స్, నేర కథనాలు నట్టింట్లో చొరబడి మనసులను పాడుచేస్తున్నాయి. అలాగే హైస్కూల్ వయసు పిల్లల ప్రేమ కథలతో తీస్తున్న బూతు సినిమాలు చాలా వరకు దోహదం చేస్తున్నాయి. మరో అంశమేమంటే అతి చౌకగా దొరుకుతున్న మల్టీ మీడియా సెల్ ఫోన్ ల ద్వారా అరచేతిలో బ్లూ ఫిల్మ్ లు వారి మెదళ్ళను భ్రష్ఠు పట్టిస్తున్నాయి. వీటన్నింటిని అరికట్ట గలిగిన నాడు, ప్రతి ఒక్కరు యిది తమ వంతు బాధ్యతగా ఫీలయ్యిన నాడు మాత్రమే యివి తగ్గుతాయి.

నేరం జరిగాక చట్టాలు చేస్తామన్న పాలకులున్నంతవరకు మన ప్రారబ్ధం యింతే..

2 comments

  1. అసలు మైనర్ అయిన అమ్మాయి ఫోటో ఇలా పేపర్లో వెయ్యొచ్చా?? ఈ మధ్య ఇంకొక చిన్న పాప ఫోటో కూడా ఇలానే వేశారు.. మృగానికి మనిషికి పెద్ద తేడా లేదని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదేమో!!

    1. ఆ అమ్మాయి చనిపోబట్టి గానీ ఆమెను యీపాటికే మీడియా చంపేసింది సార్. ఆ కుటుంబం తలెత్తుకోగలదా? యిది మన నేటి మీడియా దుస్థితి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s