పెళ్ళికి ముందే అది తప్పుకాదు..సుప్రీం

పెళ్ళి చేసుకోకుండా సహజీవనం, పెళ్ళికి ముందే శృంగారం అనేవి తప్పుకాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

2005 లో ఖుష్బూ చేసిన వ్యాఖ్యల వలన ఆమెపై తమిళనాడులో  22 కేసులు నమోదయ్యాయి. వాటిపై ఆమె సుప్రీం కోర్టునాశ్రయించగా నిన్నటి విచారణలో న్యాయమూర్తులు వీటిపై పై విధంగా స్పందించారు. ఆమె వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, వాటి వలన ఎంతమంది ఆడపిల్లలు ప్రభావితులయ్యారు, ఎంతమంది ఆడపిల్లలు లేచిపోయారని ప్రశ్నించింది. మనం ఆరాధిస్తున్న రాధాక్రిష్ణులది సహజీవనమే కదా అని గుర్తుచేసారు. అనైతికమన్నదానిని నేరమయముద్ర వేయవద్దని సుప్రీం సూచించింది.

యిది వ్యక్తిగత నైతికతకు సంబంధించిన అంశం. ఇది ఎవరికి వారు నిర్ణయించుకొని అనుసరించాల్సిన విషయం. పెళ్ళికి ముందు అనుభవంపై సర్వేలలో మనదేశంలో  ఆ మధ్య ఎక్కువశాతమే ఒప్పుకుంటున్న గుర్తు. మారిన కాల మాన పరిస్థితులలో స్త్రీ పురుష సంబంధాలలో వస్తున్న మార్పులు ఇరువురి మద్య ఈ విషయం ఆమోదం పొందుతున్నట్లుగానే కనిపిస్తోంది.

ఇక్కడ మరో విషయం కూడా దాగివుంది. పురుషులు చేస్తే తప్పుకాదు, అది స్త్రీ వైపునుండే పరిశుద్ధతను కోరుకోవడం. మారిన సామాజిక వాతావరణంలో స్త్రీ నాలుగ్గోడలమద్య బందీగా లేనప్పుడు తానూ వీటి ప్రభావానికి గురౌతోంది. అందుకే చర్చనీయాంశమయ్యింది. నాడు మానసిక వ్యభిచారమె నేరమన్న కాలం నుంచి పబ్ లు, పార్టీలు, డేటింగ్ లు పెరిగిన కాలంలో  ఇది సామాజిక ఆమోదం పొందినట్లుగానే భావించొచ్చా? ఔననే అనుకుంటున్నా.


ప్రకటనలు

19 comments

 1. తప్పు కాదు అందా చట్టరీత్యా నేరం కాదు అని అందా?

  తేడా తెలుసుకోకుండా మీ లాంటి సామాన్యులు అల్పబుద్ధితో న్యాయస్థానాన్ని తప్పు బట్టటం ధర్మం కాదు , బాబుగారు. ఏదో మీ ఉప్పుతిన్న పాపాన చెబుతున్నా.

 2. మెట్రోపోలిటన్ సిటీస్ లో పెళ్ళికి ముందు సెక్స్ మామూలే కానీ అక్కడ గర్భం వస్తే మగవాడు తప్పించుకుంటాడు, ఆడది బలి అవుతుంది.

 3. దేశాన్ని ఉధ్ధరించ దగ్గ ఎన్నొ కేసులు మూలుగుతూ ముక్కుతూ ఉండగా సెక్సు విషయమై సుప్రిం తగు చొరవ తీసుకొని యుధ్ధప్రాతపదికన లేని ఉత్సాహం చూపించి చివరాఖరికి పెళ్ళికి ముందు సెక్సు తప్పు కాదని తమ అమూల్యమైన తీర్పు ని దేశం మీదకు వదిలింది.
  తప్పు న్యాయస్థానం చేయడం వలన అది తప్పు కాకుండా పోదు, పెళ్ళికి ముందు అలాంటివన్ని వద్దు అన్నది, ఏదో మన సంస్కృతి తొక్క తోలు మన్ను మశానం వృధ్ధి చెందుతాయి అని కాదు, ఆ ఘనకార్యం వలన లబ్ది పొందేది మగవాడు రిజల్ట్ మాత్రం ఆడవాల్లకు, తరువాత మగవాడు ఆ మధురాను భూతి ని నెమరు వేసుకుంటు కాలం గడుపుతాడు, మన లేడీస్ మాత్రం ఇప్పుడు తప్పు చేయడం తప్పు కాదని వీర కోతలు కోస్తున్న వాళ్ళున్న సమాజం చేతే చీత్కారాలు వద్దు వద్దు అనుకున్నా ఎదుర్కొంటారు. చట్ట ప్రకారం తప్పు కాని తప్పు చేసిన వాల్లని పెళ్ళి చేసుకోవడానికి ఎంత మంది మగ మహారాజులు ముందుకు వస్తారు, ఆ రావడం ఆవేశం తో రాకుడదు, జాలి తొ రాకూడదు, మామూలుగానె రావాలి, తప్పు జరిగిన అసలు అది తప్పే కాదన్నట్టు రావాలి, అలాంటొల్లు సరైన నిష్పత్తి లొ ముందుకు వస్తే తప్పు చేయడం తప్పేం కాదని నేను కూడా ఒప్పుకుంటాను. అలా కాదు సమాజం తో నాకేం పని, పెళ్ళి పెటాకులు అన్నవి చాదస్తం పనులు, మాకిష్టమొచ్చిన వాల్లతో ఇష్టమొచ్చినన్ని రోజులు కలిసుంటాం అని అంటే మిమ్మల్ని (పాఠకులను కాదు) ఎదిరించే ధైర్యం ఉన్న మొగవాడు కాని ఆడవాల్లు కాని ఈ భూప్రపంచం మీద ఎవరు లేరు. సుప్రీం కాదు కదా దాని బాబు కూడా మిమ్మల్ని ఆపలేరు, నిక్కచ్చి(సిగ్గు విడిచి) గా చెప్పాలంటే ఈ చట్టం వలన మగవాల్లకే ఎక్కువ సదుపాయం, తప్పు చేయడానికి వల్లకు సుప్రీం నుంచి మంచి సప్పొర్ట్ ఉంది, అమ్మాయిలను కన్విన్స్ చేయడానికి మంచి లా పాయింటు అందించి సుప్రీం పుణ్యం చేసుకొంది.

  1. mee vivarana baagundi. arataaku mullu meeda padda, mullu arataaku meeda paddaa okate. kaanee maarutunna kaalamlo purvapu paristitulu taggumukham padutunnaayi. alaa ayite inni pellillu jaragavu.
   edemainaa chattaalalo sikshalunnayani neralu jaragadam maanadam ledu. teerpu valana marinta mandi chedipotarannadi kuda alantide. idi purtigaa maanasikanga erpadina bhaavajaalam. anta tondaraga digest kadu. charchalo palgonnanduku dhanyavadalu.

   1. చట్టాల ప్రభావం నేరాల మీద తక్కువనడం లో ఎటువంటి సంధేహం లేదు, కాని ఇలాంటి తల తిక్క తీర్పులు ఇచ్చి చెడు ని ప్రోత్సహించే ధౌర్భాగ్యం మన సర్వోన్నత న్యాయస్థానానికి ఎందుకు పట్టింది అన్నదే ఇక్కడ విషయం. చెడుకు వత్తాసు పలకడం మన సుప్రీం మేధావులు చేసిన తప్పు కాదా…

 4. నా వరకు ఐతే ఇది అంత మంచిది కాదనిపిస్తోంది. జనాలు దీనినొక అలుసుగా తీసుకుంటారు. చట్టరీత్యా శిక్షించదగ్గ నేరం కానప్పుడు ఇంక తప్పు చేయడానికి భయమేముంది.

  1. చట్టం ద్వారా శిక్షి౦పబడతామని తెలిసినా నేరాలు ఆగడం లేదు. అలాగే చట్టం ఆమోదం వుందని అంతా విడాకులు తీసుకోవడం లేదు. కావున ఈ తీర్పువలన చేదిపోతారన్న భయం అక్కరలేదు. మాది ఓ చిన్న పట్టణం. కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టినప్పుడు అమాయిలు అబ్బాయిలు చాలా స్వేచ్చగా తిరిగారు. మా చిన్న చిన్నdoctorlandariki చేతినిండా పనే. అలాగని విద్యార్థులంతా అలా ఒకే గాట కట్టలేం. కానీ ఊర్లో ఎక్కడా ఇదే టాపిక్. ఇప్పుడు తోటపల్లి బ్యారేజీ పుణ్యమా అని అది విశాఖకు తరలిపోయింది. ఈ విచ్చల విదితనం మనిషిలో దాగివు౦టు౦దన్నది నిజమే కావచ్చు. అ౦దుకే చలం అంటారు ఇప్పటికిప్పుడు అవకాసం వస్తే తొంభై శాతం మంది స్త్రీలు భర్తలను వదిలేస్తారని. సహజీవనం గురించి కూడా ఆలోచి౦చాలి. పెళ్లి తంతు జరగకపోయినంత మాత్రాన భార్యా భర్తలుగా వుమ్దలేరా? ఇది అనవసరపు ఖర్చును తగ్గిస్తు౦ది. పెళ్ళిళ్ళు భారీగా జరిపినవి కూడా పెటాకులు అవుతున్నాయికడా?

   1. @సామాన్యుడు గారు

    మీ మాటలతో ఏకీభవిస్తూనే ఒకమాట కోర్టులు, శిక్షలు అంటే అందరికి భయం. అలాంటి కోర్టే తప్పుకాదు అంటే ఇప్పటికే విచ్చలవిడిగా ఉన్నవారితోపాటు, కొత్తగా మరికొంతమంది తయారవుతారు. ఇప్పటి వరకు గుట్టుగా ఉన్నది అతిగా మారుతుంది. అప్పుడది ధర్మ సంకటమే కదా. ఆమెతో జీవించే మగవాడు మంచివాడైతే పుట్టే పిల్లల బాధ్యత కూడా తీసుకుంటాడు. లేదంటే ఆ పిల్లలకు తండ్రి ఉండడు. ఒకవేళ ఆమె వేరేవరితోను సహజీవనం చేస్తే అతను ఈ పిల్లలను ఆదరించగలడా. ఈగోలంతా ఎందుకనుకొంటే అబార్షన్ చేయించేసుకొంటారు. దీవల్ల వారి ఆరోగ్యం, సమాజ నైతికత దెబ్బ తినవంటారా? క్రమేణా మనది అమెరికా సమాజంలా మారుతుంది. కొద్ది రోజుల సహజీవనం తర్వాత నాకు నచ్చలేదు అని తప్పించుకొని పారిపోవడానికి మగవారికి మంచి అవకాశం దొరికినట్లే.

    >>పెళ్లి తంతు జరగకపోయినంత మాత్రాన భార్యా భర్తలుగా వుమ్దలేరా?
    ఎందుకుండలేరు ఉండొచ్చు. కాని ఏవైనా గొడవలొస్తే పెద్దల తోడ్పాటు ఉండదు కదా.

 5. I don’t know where it is common and where it is not common.
  But everyone has to protect themselves from the bad things or traps.Some may say right or wrong all are relative. There is no absolute right or wrong, it all depends on in which society you are living .If you are brave enough break the rule otherwise say doing that way is bad.

  1. ఇది అంత తొందరగా మిమ్గుడుపడే అంశం కాదు. మన పురాణ పాత్రలన్నీ కూడా చాలా వరకు బహు భార్యత్వం, బహుభార్త్రుత్వంతో కూడుకున్నవే. మారిన సామాజిక పరిస్థితుల వలన మనమే మన నీటి సూత్రాలను అన్వయి౦చుకు౦టున్నా౦. ఒకనాడు నైతికటగా వెలుగొందినది ఆ తరువాత అనితికటగా కనిపిస్తుంది. ఏదైనా మానసిక పరివర్తనపైనే ఆధారపడి వుంటుంది. పెళ్ళికి ముందు ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించాలన్న దానిని ఏమ్తమంది ఆచరిస్తున్నారు. దీనర్థం ఇరువైపులా కన్యత్వ పరీక్షలే కదా ఒక రూపంలో. ఏదైనా వెంటనే అమ్గీకరిమ్చాలేము. దీనివలన ఇప్పటికిప్పుడు వచ్చే పెను ప్రమాదం లేదనుకు౦టా.

   Thanks for your kind response.

 6. సుప్రీం కోర్టు తీర్పు యిచ్చినంత మాత్రాననే యువత హద్దులు మీరి ప్రవర్తిస్తుందనుకొంటే ,మనం యువతను అనుమానించి, భావి భారతాన్ని అవమానించినట్లే అవుతుంది.

  యీ సాంఘిక వ్యవస్త మీద,భారతీయ కుటుంబ జీవన వ్యవస్త మీద నమ్మకాలు పోయినట్లే.ముందు మనలో వున్న, ద్వైధీ భావాలు వదిలేయండి.మనకు కావలిసిందేమిటో నిర్ధారించుకోండి. మంచి అనుకున్న దాన్ని నిర్ధారించుకొని ప్రజాస్వామ్య యుతంగా చట్టబద్ధత పొందండి.
  సెక్స్ లో వావివరసలుండాలని కాని,వయో పరిమితులుండాలనికాని, వివాహేతర సంబంధాలుండరాదని కాని, వివాహానికి ముందు లైంగిక అనుభవం తప్పని గాని
  చట్టం చెప్పనప్పుడు,అది పొరబాటని సభ్య సమాజం భావిస్తే దాన్ని సరిజేయించంది.

  ఆలోచనలకు ,ఆచరణకు,నైతికతకు, మధ్య వున్న వ్యత్యాసాలను తగ్గించండి.

  వివాహానికి ముందే…లైంగిక అనుభవం విషయంలొ మగవాడికో న్యాయం ఆడదానికో న్యాయం సమంజసమా అని అత్యున్నత న్యాయస్తానం ప్రస్నించగానే మనం గంగవెర్రులెత్తిపోవలసిన అవసరం లేదు.

  మనం ముందు మగవాడు హక్కుగా భావిస్తూ అనుభవిస్తున్న ఆ న్యాయాన్ని ప్రస్నించండి. మగవాడికి వున్న సౌలభ్యత అతడు బిడ్డను గర్భంలో ధరించలేకపోవడమే.

  సామాజిక నైతికత విషయానికి వస్తే ఆడ మగ యిరువురకు
  సమన్యాయమే వుండాలి. భారతీయ సామాజిక వ్యవస్తలో వివాహపూర్వ లైంగిక అనుభవమే తప్పయితే,ఇరువురికీ తప్పే.
  అలా యింకా ఎన్నెన్నో తప్పుల్ని ప్రజా ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి.మధ్య సేవనం వగైరా.వాటన్నిటినీ సమాజ శ్రేయస్సు ద్రుష్ట్యా వ్యతిరేకించాలిసిందే.వ్యభిచారాన్ని, రూపుమాపి,వారికి,పునరావాసమిచ్చి,
  నాగరిక జీవనంలోకి తీసుకు రావడానికి ప్రజా ప్రభుత్వాలు యెందుకు ప్రయత్నించడం లెదు?
  యువతకు సరైన మార్గదర్శనం కుటుంబ వ్యవస్త నుంచే బీజం పడుతుంది. కుటుంబం ఆ కుటుంబాలున్న సమాజాలు భాద్యత వహించాలి.
  యిప్పటి వరకు భారత సమాజం ప్రపంచానికి ఆదర్శంగా వుందంటే, ఆ ఘనకీర్తి కుటుంబ వ్యవస్తదే. ముందు కుటుంబ వ్యవస్తను కాపాడుకొనే ప్రయత్నం చేయండి.

  1. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు.
   మనమీద మనకు నమ్మకం సదలిపోఎట్లు చేస్తున్న సామాజిక ఒరిపిదిని తట్టుకునే నిగ్రహం కోల్పోతున్నాం. మార్పును ఆహ్వానించే పేరుతొ అనేకమైన అనవసరమైన చెత్తను ఇంట్లోను, మదిలోను పెర్చుకుమ్తున్న మనకు ఆ శక్తి యింక ఎంతో కాలం వుండదు. ప్రపంచీకరణ పేరుతొ వస్తున్నా సాంస్కృతిక దాడిని ఆపే శక్తి లేదిప్పుడు. వెర్రితలలు వేస్తున్న విషపు విలువలపట్ల అప్రమత్తమయ్యే చొరవను మిమ్గేస్తున్నాం. తద్వారా వ్యక్తులమధ్య, కుటు౦బాల మధ్య విచ్చిన్నత ఏర్పడుతోంది. ఏమైనా ఎవరికీ వారు కాపాడుకోవాల్సిన విలువ ఇది. ఎమ్దుచేతనమ్టే ఇది ఒక్క పరువు మర్యాద సమస్య మాత్రమె కాదు కదా. తన ఉనికిని, ఉన్నతిని నిలబెట్టేడి. స్త్రీ పురుషుల మధ్య అంతరాన్ని తగ్గించే౦దుకు, సమానత్వం పట్ల స్ఫ్రుహను పె౦పొ౦దిచే౦దుకు సుప్రే౦ వ్యాఖ్యలను మనం పోజిటివ్ గా తీసుకోవాలని నా కోరిక.

 7. అసలు సహజీవనం కూడా వద్దు ఒంటరిగానే బ్రతుకుతాము అనే వాళ్ళు కూడా ఉన్నారు.కె.సుజాతారావు ఐ.ఏ.ఎస్, పర్వీన్ బాబీ , ఆషా పరేక్ , నదీరా , జయలలిత (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి), మాయావతి (ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి)ఉమాభారతి (మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి):కోవై సరళ, కాంచన, సుస్మితా సేన్, శోభన, పువ్వుల లక్ష్మీకాంతం,మమతా బెనర్జీ( రైల్వే మంత్రి,తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు), సాధ్వి రితంబర, లతా మంగేష్కర్ లాంటి వారెందరో ఒంటరిగా ధైర్యంగానే బ్రతికారు.ఆయావ్యక్తుల ఇష్టానికి ఈ విషయం వదిలేయాలి. వ్యక్తుల చేష్టలనుబట్టి విలాసాలూ విషాదాలుంటాయి.పెళ్ళి నిరంకుశంగా చెయ్యకూడదనే నా అభిప్రాయం.

  1. మీరు చెప్పిన వాళ్ళందరూ వారి వారి రంగాలలో ప్రముఖులు, ఆర్ధికంగా పైనున్న వారు. వారి జోలికి ఎవరు తొందరగా పోరు. కాని సామాన్యుల పరిస్థితి ఏమిటి. సుప్రీం కోర్టు ఉద్దేశ్యం మంచిదే అయినా దానిని చెడుకు ఉపయోగించేవారే ఎక్కువ. ఇది ఒక యువతరానికే కాదు అన్ని వయసుల వారికి సంబంధించినది. ఇకపై అక్రమ సంబంధాలన్నీ సహజీవనంగా మారతాయి. వ్యభిచారమైన అంతేనేమో పోలీసులొస్తే సహజీవన భాగస్వాములం అని చెప్పి తప్పించుకోవచ్చునేమో. సహజీవనం ఎంతకాలం, ఒకరితోనేనా అనేది నిర్ధారణ కావల్సి ఉంది. జీవితకాలం అంతా ఒకరితోనే అయితే వివాహం చేసుకొని కలిసి జీవించవచ్చు కదా. ముందు ముందు దీని పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s