క్షమించండి..రక్తసిక్త ఉగాదినెలా ఆహ్వానించను

విరోధినామం వెళుతూ వెళుతూ

వేలాది మందిని పొట్టనబెట్టుకుంది!

సామాన్యులు, మాన్యులు అన్న తేడా లేకుండా

సాగిన మారణహోమానికి

బరువెక్కిన మనసుతో

ఈ వికృతినెలా ఆహ్వానించను!


రక్తమంటిన ఈ చేతులు నూతన వికృత శిశు

రూపానికి హడలెత్తుతున్న

కల్లోలమైన మనస్సాగరంలో జనించేది

అమృతం కాదని హాలాహాలమేనన్న

భవిష్యత్ చిత్రపటం కనులముందు కదలాడుతుండగా

పచ్చదనాన్ని హరించే వికృత ఘోషలో

ఈ రక్తసిక్త ఉగాదినెలా ఆహ్వానించను!


క్షమించండి ఆత్మీయులారా

మీ మనసు గాయపడితే..

13 comments

  1. కాలం ఆగదూ, ఆగదూ ఆగితే సాగదు – అన్నారు.
    మీ బోడి ఆహ్వానాలతో కాలానికి పనేమిటి? వేలాది మందిని కాదు కోట్లాదిమందిని పొట్టపెట్టుకున్నా భూభారం తగ్గుతుంది.

    1. మీ వేలికి గాయమైనప్పుడు అది కాలమే మాన్పుతుందని వదిలేయకూడదా సారూ. లేకపోతే శరీరభారం తగ్గుతుంది కదా అది రాలిపోతే.

      1. అదేనేనంటున్నా. వేలికి గాయమైతే కట్టు కట్టు కుంటాము, కాని ఏడ్వం కదా! ఆహ్వానించినా , నిచకపోయినా కాలం ఆగదు అని తెలిసీ ఏద్వటం ఎందుకు?
        భూభారం కాలం తగ్గించుకుంటుంది మనం నిమిత్తమాత్రులం – ఇందులో ఆహ్వానాలు, శుభలేఖలు , సంతాపాలు , స్మారకాలు అనవసరం. కాలం దాని పని అది చేసుకుపోతుంది.

        1. ఏడుపు వచ్చేది గాయం అయినదానిబట్టి ఉంటుంది. ప్రతీది కాలానికి వదిలెస్తే ఇంత మార్పు వచ్చేది కాదు మిత్రమా? నవ్వు, ఏడుపు అనేది కూడా ప్రకృతి ధర్మమే. అవి మీకు లేకపోయుంటే మీరు యోగిఐనా ఐ వుండాలి…

వ్యాఖ్యానించండి