బొత్స బావ్ మా బాగా సెలవిచ్చినావ్ బావ్..

బావ్ మా బొత్స్ బావ్, ఏం సెప్పినావయ్యా, ఏజ్జెప్పినా నువ్వే జెప్పాల, ఎవుడేమనుకున్నా నాకేటి, నా మనసులో మాట నేననేత్తాను అన్న నీ బాట నాకు మా బాగా నచ్చింది బావ్.

మీ అధిట్టానం గూర్సి నీకు తెల్సినట్టుగా మరి ఎవురికీ తెలియదంతే. ఎందుకంతే ఇక్కడ మీసాలు మెలేసిన్నా కొడుకులు, మరి అక్కడ ఏం మూజూపుతారో గానీ తోకాడిస్సుకుంటూ వచ్చేత్తుంటే నువ్వు మాత్రం సానా సక్కగా సెప్పినావ్.

యిందీ బాబులుకు ఎన్నెన్ని రాస్ట్రాలున్నాయి, సింగుబాబులుక్కూడా రొండు రాస్ట్రాలయిపోతే వొచ్చిన నట్టమేమీ లేని నాడు మరి మన తెలుగోడికేటి నట్టం అని బాగా సెప్పినావ్. నిజమే కదా, ఎందుకీ తగువులు తంటాలు,  అటు మాది మాడిపోతందంతే, ఇటు నాది కాలిపోతందని తన్నుకోవడమెందుకు. రొండు రాస్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు (వీలయితే ఇటు అది మనమే కావొచ్చు!), ఇద్దరు గవినేరు బావులు, రొండు రాజధానులు, రొండు సెక్రటెరియేట్లు, రొండు రాజభవనాలు, బోలెడు మంది వందిమాగధులు వచ్చి పడుతానంటే వొద్దనేసే మూర్ఖులేటి యీలు అని నీకు సానా కోపం ఇప్పటికెగిసిపడింది.

మరో మంచి మాట సెప్పినావ్, ఎన్ని రాస్ట్రాలయినా, ఎవుడు ముఖ్యమంత్రో, మంత్రో, ఎమ్మెల్యో అయినా సామాన్య పెజానీకానికి ఏటీ ఒరగబెట్టింది నేదని. యిన్నాళ్ళ తమ పరిపాలనలో తెలిసిన నిజాన్ని యిలా కరెకెటుగా కక్కేసినావ్. ఏదయినా నువ్వే బావ్ సెప్పాల. తమరి గురువుగారినే పక్కకు నెట్టేసి, అన్నదమ్ములు, బామ్మర్థులు, అప్పసెల్లెల్లు, మేనల్లుల్లుతో మొత్తం విజీనగరమంతా తమరొక్కరే వొటవృక్షం మాదిరి ఊడలల్లేసినావ్. నీకు తెలీద రాజకీయ వైకుంఠపాళీ. అందుకే నీకీ సక్కనైన ఆలోసన వొచ్చింది. మరి వొగ్గీమాకు బావ్. ఈ దెబ్బతో కొడితే రెండు పిట్టల్నీ కొట్టాల. నేకపోతే నేదు.

ఎవుడేటి అనుకుంతే మనకేటి. ఆయిగా ఆడుతూ పాడుతూ యిడిపోతే ఆలబాదేదో ఆలు పడతారు. మన బాదేదో మనం పడుదాం గానీ. ఓసీ మరీ సిగ్గైపోమాకు బావ్, నీ నవ్వెనకాల ఎన్ని గూఢార్థాలో. ఈ మాట మీద నిలబడిపోమీ. తల్లితోడు. మల్లీ ఎలచ్చన్ల మొత్తం మన నియోజకవర్గాలన్నీ బొత్స & కో తోటే కప్పెడదాం. ఎవుడడ్డమొత్తాడో జూద్దుం గానీ.

ప్రకటనలు

10 comments

  1. నిజమే మా విజయనగరాన్నంతా వీడి బొజ్జలోనే పెట్టుకున్నాడు, ఇప్పుడు ఉత్తరాంద్ర ఛీ.యం అయిపోవాలని పగటి కలలు కంటున్నాడు

    1. సెప్పినదాన్లో తప్పునేదు. కానీ మా బావ్ మా సెడ్డ అవకాశవాది బావ్, మనం జర జాగ్రత్తగా వుండాలె. అప్పుడే పూల దండలు వేయకూడదు.

  2. బొత్స ఉద్దేశ్యం తెలంగాణ ఆందోళనను ఎద్దేవా చేయడం. అది తెలుసుకోలేక తెలబాన్లంతా ‘బొత్స మంచిగ షెప్పిండు, అందరూ అదే షెప్పాల ‘ అని తెలగాన్ల ఐకాసలంతా గొర్రెల మాది తలలు, నాలుకలు , తోక వూపిండ్రు,స్వాగతించిన్రు.

    ఈ సామాన్యుడికెట్ల ఎరుకైందబ్బా అని!

    మస్తు చెపినావ్ ,సామాన్యుడు.

    1. తమరొక్కరే అర్థం చేసుకోగలరని తమకు గర్వంలావుంది. కాంగ్రెస్ నాయకుల బండారం మాకు ముందే తెలుసు. అందులోకి బొత్సగారు లాభం లేకపోతే, అయితే నాకేంటి అనే కోట పాత్ర లాంటి వారి గురించి ఆ మాత్రం తెలియదా సారూ. మోసపోవడం ఒక్కటే మా బతుకు అనుకున్న వారికి తగిన బుద్ధి చెప్పగలం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s