ఎదలో యాదయ్య..


తెలంగాణా తెలంగాణా తెలంగాణా

కోటి గాయాల వీణ

నేడు నీ రొమ్ము పాలు తాగిన వారే

నీ కడుపులో చేయిపెట్ట చూస్తున్నారు

వీరి మోసకారి మాటలకు యింకెంతకాలం

దగా పడతావు తల్లీ….


చూడు చూడు నీ గాయాలు మాన్ప

నెత్తురోడుతున్న నీ శిశువులను

ముళ్ళ కంచెలకావలకు నెట్టాలని చూస్తున్నాడు

ఈ కొత్త నరసింహావతారుడు

రక్తం రుచిమరిగిన తోడేళ్ళ గుంపు మధ్య

రణన్నినాదమై వేలగొంతులు నినదిస్తున్నాయి…


యిది పోరాట రూపం కాదనుకున్నా

కపట నాటకాల క్రిష్ణునికి ఈ కమురు వాసన

ముక్కు పుటాలకు తగులుతుందా?

అంతా దేవుళ్ళే, కానీ ఇక్కడ ద్రౌపది మానభంగం తప్పలే!


గుండెల్లో రోజుకో మాటల మంట రగిలిస్తుంటే

తమదైన ఏకాభిప్రాయాన్ని ఇలా అగ్నిప్రవేశంతో

ప్రకటిస్తున్న యాదన్నలను మా ఎదకు

హత్తుకుంటున్నాం…

ప్రకటనలు

17 comments

 1. మన మనస్తత్వం లో చస్తే సాధించ వచ్చు అనుకోవటం ఆమరణ దీక్షలు చేస్తే మనకు కావాల్సింది వస్తుంది అనుకోవటం మారితే బాగుండు. ప్రపంచం లో ఇటువంటివి చాల అరుదుగా వింటాం మన దేశం తప్పితే. ఈ పరిస్తితిని ఎవరయినా మార్చటానికి ప్రయత్నిస్తే బాగుండు.

 2. .అతను అనాధ కాదని బ్లాగుల్లో చంకలు గుద్దుకొంటున్నాం. అతన్నిబ్రతికించాలనుకొంటే చుట్టూ వున్న వాళ్ళు అందరూ వాటేసుకున్నా మంటలారిపోయి వుండెవి.అతను బ్రతికి వుండేవాడు. .అక్కడ వున్నవాళ్ళంతా త్యాగాలకు సిద్ధమే కదా? ప్రయత్నిస్తే కొంచెం వళ్ళు కాలేదేమో . .యువకులు చస్తూ వుంటే మీరంతా వారి వెనుక వున్నామని ధైర్యమిస్తేనో,అయ్యో పాపం అంటేనో సరిపోదు.
  అతనికి ఎవరి ప్రోత్సాహం లేకుండా, ఎవరి సహకారం లేకుండా అన్ని యేర్పాట్లతో యింతటి దురద్రుష్ట కార్యం చేపట్టగలిగేవాడు కాదు.
  అతని చుట్టూరా ఆక్షణంలొ వున్న వారంతా అంధులు.లేదా కావాలని కండ్లు మూసుకొనైనా వుండి వుండాలి. వారంతా అత్యంత క్రూరులు. టి.వి మీడియా వారైతే భయంకర రాక్షసులే. లేకుంటె అంత మంది మధ్య ఒక ప్రాణం కాలి పోతుంటే తెగించి ముందుకు వచ్చిన వాళ్ళు లేరే.
  ఆ పోలీసెవరో కాని ఆ కుర్రవాణ్ణి బతికించలేకపోయినా తన కోటు కప్పిమంటలార్పి అతన్ని బ్రతికించాలని ప్రయత్నించాడు. ఆతని మానవత్వానికి వేయి వేల జోహారులు.

  .తెలంగాణ సాధనకై ప్రాణ త్యాగానికనా సిద్ధపడాలి అని నాయకులిచ్చే వూకదంపుడు వుపన్యాసాన్ని యువకులు ఆదర్శంగా తీసుకొంటున్నారు. అర్జెంటుగా వుద్యమ సాధనకై చేసే వుపన్యాసాల తీరు మార్చండి.
  భవితలో తెలంగాణను తేజోమయం చేసుకోవలసిన యువకులను ప్రాణాలు తీసుకొనే విధంగా ప్రోత్సహించకండి.
  తెలంగాణ సాధనకై ప్రాణాలొడ్డటానికైనా సిద్ధం అని ఒకనాయకుడంటే యువకులు వుత్తేజితులై దానిని కార్యరూపంలొ చూపిస్తారు. ముందు నాయకులు అటువంటి ప్రసంగాలు మానాలి .

  యింతవరకు తెలంగాణ సాధనకై ప్రాణ త్యాగానికనా సిద్ధపడాలి అని వుపన్యాసాలిచ్చిన ఒక్క నాయకుడైనా ,ప్రాణాలొడ్డిన పాపాన పోయినదాఖలాలు చరిత్ర పుటలలో లేవు. ప్రాణాలు పోగొట్టుని మనం సాధించిన దానిని వీక్షించలేము. తెలంగాణ యువకులారా ప్రాణాలతో వుండి వివేకంతో ఆశయసిద్ధికై నీ మేధస్సుకు పదును బెట్టి విజయం సాధించు. విజయం నీవెంటే.

  1. మీరు పెద్దమనసుతో వెలిబుచ్చిన అభిప్రాయానికి, సూచనలకు ధన్యవాదాలు. అన్ని వేలమంది మద్య ఆ అభిమన్యుని చావు కంటతడి మాత్రమే కాదు, గుండెనరాలను కూడా పిండింది. రాజకీయ వ్యాపారుల హాట్ సరకుగా మారిన తెలంగాణా కోసం యింక యువకులు ప్రాణత్యాగాలు చేయకూడదు.

 3. నూతక్కి గారు: నేను చెప్పా లేని భావ్యాలు మీరు చక్కగా చెప్పారు. థాంక్ గాడ్ మీ కంపూటర్ బాగయ్యింది.

  1. క్రిష్ణగారూ యాదయ్య ఆత్మబలిదానం వీడియో ఒళ్ళు గగుర్పొడిచి మనసును కలచివేసింది. అందుకే ఆయన తెలంగాణా అభిమన్యుడు. ఈ మరణాన్ని చూసి కూడా ఎగతాలి చేస్తున్న లగడపాటి, జే.సీ.లను తప్పక బహిష్కరించాలి. వారి మొహాన నవ్వెలాపుడుతుందో?

 4. ముందు మన ఇంట్లో మసలే శత్రువులను గుర్తించి కళ్ళు పీకి నాలుక కోసి జీవఛ్ఛవాలుగా మార్చితే అప్పుడు యాదయ్యల ఆత్మలకు శాంతి!

  కడుపు రగులుతోంది!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s