పాపం సానియా – మీడియా..

ఈ రోజు ఆంధ్ర జ్యోతిలో హెడ్ లైన్స్ లో సానియా మీర్జా నిశ్చితార్థం ఆగిపోయిన వార్తను ప్రముఖంగా వేసారు.  ఆమె ఫోటో పెద్ద సైజులో వేసి అదేదో  ఆంధ్రప్రదేశ్ లో భూకంప వార్తో, లేక ప్రభుత్వాలు కూలిపోయిన వార్తలానో వేసారు. అదేదో ఆమె తేల్చుకోవాల్సిన విషయం, వీళ్ళకెందుకు?

తన క్రీడా జీవితంలోని ఒడిదుడుకులకు కూడా మీడియా అత్యుత్సాహమే కొంతవరకు కారణం. ఒక రౌండ్ గెలిచేసరికి ఆహా ఓహో అనడం ఆ తరువాత ఓడిపోయే సరికి సానియా ఫట్, లేదా తుస్ అని వార్తలు రాయడం. వాళ్ళను దేవుళ్ళు, దేవతలను చేయడం.  అంతర్జాతీయ స్థాయి ఆటలలో మనవాళ్ళ శారీరక దారుఢ్యం కూడా ఏపాటిదో అందరికీ తెలుసు. ఏదో ఒకామె ఆ స్థాయికి చేరినందుకు సంతసించకుండా, ఆమెకు ప్రైవసీ లేకుండా, తనకు ఒక బెటరాఫ్ ను ఎంచుకునే స్వేచ్చలేకుండా  చేస్తూ వ్యక్తిగత జీవితాలలోకి దూరిపోవడం ఎంతఫరకు సమంజసం.

తను ఆడేటప్పుడు ఎగిరిన స్కర్ట్ ఫోటోలను ప్రముఖంగా వేస్తూ చొంగకార్చే పత్రికలు చాలా వున్నాయి. ఒక క్రీడాకారిణిగా అలా దుస్తులు వేయకుండా ఎలా ఆడగలదు. తెలుగింటి ఆడపడుచు ఫోటోలను అమ్ముకునే మీడియా మనది. ఈ పత్రికాధిపతుల కూతుళ్ళు, మనవరాళ్ళు ఆడటంలేదా? మరి వాళ్ళ ఫోటోలు ఎవరైనా ప్రచురిస్తే వూరుకుంటారా?

పేపర్లు అమ్ముకోవడానికి ఇదా మార్గం. వ్యక్తిగత జీవితాలలోకి దూరడంద్వారా వారికి పబ్లిక్ లైఫ్ లేకుండా చేయడం సమంజసమా?  రెచ్చగొట్టే వయాగ్రా వార్తలనుండి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు బయటకు వచ్చిననాడే జర్నలిజం తన స్థాయిని మరల పొందుతుంది.

చూడండిః http://epaper.andhrajyothy.com/AJ/AJyothI/2010/01/28/index.shtml

ప్రకటనలు

6 comments

  1. This is a clear evidence of journalism with no morale and ethics. Perhaps Sania must file a law-suit for highlighting her personal life.

    This is for sure an extreme situation of crossing lines and forgetting their limitations. They have no such rights. This is a result of semi-knowledge and insufficient exposure to the true journalism – we all should fee shy for breeding such coverage.

    Shameful Andhrajyoti!!!

  2. అవును మరే పత్రికా ఈ వార్తను ఇంత ప్రముఖంగా ప్రచురించలేదు. ఆంధ్రజ్యోతి ఈ మధ్య అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది.

  3. నేను కూడా ఇవాళ్ల పొద్దున్న పేపర్లో చుసాను, అదేదో పెద్ద జాతీయ వార్తలాగ అంత ప్రాముఖ్యాన్ని ఇచ్చి ప్రచురించటం చాలా బాధ అనిపించింది. పాపం ఎంత బాధ పడుతుంటారు సానియా వాళ్ల ఫామిలి.

    మనం ఎంత గింజుకున్నా వీళ్లకు చీమ కుట్టినట్టు కూడా ఉండదండి కంఠశోష తప్పించి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s