ఊపిరి వున్నంతవరకూ కొట్లాడదాం..

చావు దానంతటదే రావాలని కాళ్ళు బార్లా చాపుకొని

ఎదురుచూసే వాళ్ళు కోట్లాదిమంది

కానీ చావుకు ఎదురు నిలిచి పోరాడే వాళ్ళు కొద్దిమంది


రాజకీయ బేహారుల మోసాలకు

గుండెలు భారమయి చావుని ఆహ్వానిస్తున్న తీరు

బాధాకరం

ఇది కాదు మన వారసత్వం


శత్రువు గుండెల్లో నిదుర పోయిన

పెద్ది శంకర్. . . . . లలా

మండే నిప్పు కణికలై భూమ్యాకాశాలు

దద్ధరిల్లేలా పొలికేక కావాలి మనతరం


చావు గుండెల్లో నిదురపోదాం

ప్రజల కనులలో మెరిసే ఆశా కిరణాలవుదాం


ఆత్మ బలిదానం కాదు

బలిపీఠంపై వారినే కూర్చోబెడదాం


(తమ నేలతల్లి విముక్తి కోసం ప్రాణాలర్పించిన వేణు, సువర్ణల స్మృతిలో)


ప్రకటనలు

9 comments

  1. మీ స్పందనకు ధన్యవాదాలు. నా పోస్ట్ చదివిన వారిప్పటికీ రాసిన 10 గం.లలో 61 మంది సార్. చదివినవారందరూ కామెంట్ రాయరు. నేనూ చదువుతుంటా. కామెంట్లు ఎప్పుడో కాని రాయను. మనం రాసినది చదివితే చాలు. థాంక్స్.

 1. ఔను, నిజమే, టపా చదివిన వాళ్ళందరూ వ్యాఖ్య వ్రాయరు. ఎప్పుడో గాని ,
  కాకపొతే ఆత్మహత్యలని ప్రోత్సహించ కూడదు
  ఆత్మహత్యల వాళ్ళ ఏమీ కాదు అని నేను నమ్ముతాను.
  రాజకీయ నాయకుల చొక్కాలు పట్టుకుని నిలదీయల్సిందే తప్ప ఆత్మ హత్యలకి ప్రోత్సాహం ఇవ్వరాదు

  వేణు గోపాల్ రెడ్డి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం

 2. MASS HYSTERIA RUNNING THESE DAYS

  hello anna

  i dont agree with you , glorifying the suicides as MARTYRDOM.

  these are done just out of emotional reasons which are not related to the telangana issue at all.

  but their death declaration or note reads out telangana issue , may be they are worried about this issue but the driving force might be some other thing but this telangana issue might have made them even more depressive so as to commit suicides.

  why werent suicides happeened before this issue and why death declarations werent mentioning THAT THEY ARE DYING FOR TELANGANA. ( as telangana issue was there sing long ).

  I DEFINITELY DONT ACCEPT IT AS MARTYRDOM.

  ITS JUST HYSTERICAL AND IMPUSIVE BEHAVIOUR.

  THANKS ANNA

  RAMAKANTH REDDY\

 3. సవ్వకు దమ్మి సచ్చి సాదించెడి దేమున్నది
  రచన:రాఘవేంద్ర రావు నూతక్కి

  బతి కుంటె నే గద తమ్మి
  నీ మనసుల నువ్వనుకొన్నది
  పోరాడినా కుమ్ములాడినా
  శోధించిన గని, సాధించిన గని
  నువు బతికున్దాల దమ్మి

  గని తమ్మి ఉద్రేకంల
  పానాల్దీసుకోనుడు
  అమ్మకు అయ్యకు కడుపు కోతల్దప్ప
  నిను కన్నందుకు నీవిచ్చేడి దేమున్నదని
  వుద్దేమాల నడిసేతోన్కి ముందు నడ్సి
  నువ్ దారి జూపాలే దమ్మి

  పోరాడినా కుమ్ములాడినా
  శోధించిన గని, సాధించిన గని
  బదికుంటే నే గద తమ్మి

  వుద్దేమాల్ల్ల ఉద్రేకంల
  పానాలిచ్చిన వనుకో
  వహ్వా ,ఓహో , జాన్దియా వతన్ కేలియే
  గట్లని నాల్దినాల్
  మంచిగా బొగుడ్తరు గని
  యినేతందుకే నువ్వుండవు.
  రెండు దినాల్ సోకదినాల్బెడతారు
  ఏడాదికో పారి స్మరణ దినాల్జే స్తరు
  గాడ ఉపన్నాస మిచ్చెడి
  లీడర్లకు భీ యాదున్డది
  దేనికొరకు నువు
  నీ పాణం దీసిస్తివో
  అమ్మనాయన్లకు
  కడుపుకోత మిగులుడు దప్ప

  బతికుండే పోరాడు తమ్మి
  జయం నీఎంటుంటది
  మొద్గాల సవ్వమన్నోన్ని
  జంపి జంపి ఒదిలిబెట్టు.
  సవ్వకు తమ్మి నువ్వు
  సచ్చి సాదించెడి దేమున్నది ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s