ఎవరి పని వారు చేయరా?

రాష్ట్రంలో రాజకీయ ఉద్యమాలు ఊపందుకున్న క్రమంలో, ప్రజల్లో అస్తిత్వ పోరాట కాంక్ష పెరిగిన క్రమంలో పాలకులు తగు నిర్ణయాన్ని తీసుకునే సమయం కోసం వేచి చూస్తున్న కాలంలో పరిపాలనా పరమైన బాధ్యతలలో ఒకటైన శాంతి భధ్రతల శాఖ వారు తమ పని తాము సక్రమంగా నిర్వహించాల్సిన సమయంలో బాధ్యతాయుతమైన పదవుల్లో వున్నవారు పాలకులను తప్పుదోవపట్టించే వ్యాఖ్యానాలు చేయాల్సిన అవసరమేమొచ్చింది? ఇది కుక్క పని గాడిద చేసే నిర్వాకం కాదా? రాష్ట్రం ప్రత్యేక ఉద్యమాలతో అట్టుడుగుతున్నప్పుడు  ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలను ముందుగా తెలుసుకునే అవకాశమున్నవారు వాటి పట్ల నిర్లిప్త ధోరణితో ఉన్న కారణంగానే అవి జరిగాయి. వాటిని వదిలేసి పాలకవర్గ నిర్ణయాలను పక్కదోవ పట్టించే రిపోర్టులతో, లేనివాటిని ఉన్నవాటిగా చూపించి అశాంతికి గురిచేయడం తగదు. ఇది కొంత కాలంగా ఆ శాఖాధిపతులకు అలవాటుగా మారింది. దీనిపై పాలకులు చూసీ చూడనట్లుగా పోవడంతో వారి యిష్టా రాజ్యంగా మారింది. ఇప్పటికే లేని బూచిని చూపించి వేల కోట్ల ప్రజా ధనాన్ని తమ సొంత బొక్కసాలకు తరలించి, రిటైరయ్యాక రాజకీయాలలో దూరుతున్నారు. కావున పాలకులు ఇకనైనా వీరిని అదుపులో వుంచుకోవాలి.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s