ఇది నీకు న్యాయంగుందా?

ఇప్పటికే చారుతోనో, పులుసుతోనో సరిపెట్టుకుంటూ నంజుకులేక ముద్ద దిగక బాధపడుతున్న సామాన్యుడికి కూలికి పోవాలంటే ఉన్న ఒకే ఒక్క ఆధారం ఎఱబస్సో లేక పచ్చబస్సో దిక్కు. కానీ దాని మెట్టు ఎక్కాలంటేనే భయపెట్టేట్టు ఈ అర్థరాత్రి నుండే తన నెత్తిపై చార్జీల మోత. సుమారు 550 కోట్ల భారం. ఇది తగునా రోశయ్యగారూ. నిన్న రాత్రి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వరానికి అది మాపైనే భస్మాసుర హస్తంలా తయారు చేస్తారా? ఇప్పటికే ఏది కొనేటట్లు లేదు, ఏది తినేటట్లు లేదు. ఇంకిప్పుడు ఏది ఎక్కేట్లు లేదనుకోవాలా? సంక్రాంతికి వలసపోయిన పక్షులన్నీ తమ స్వంతగూటికి చేరుకొని తమ తాత ముత్తాతలకు పిండాలు పెట్టుకోవాలని బయలెల్లే ముందు ఈ మహా వడ్డింపా? ఆరుగాలం కష్టపడి, ఒక పూట తిని ఒక పూటది దాచుకొని, నువ్విచ్చిన ఇందిరమ్మ ఇల్లు కట్టి అప్పులపాలై, కోస్తా రైతు వద్ద కూలిగానో, హైదరాబాదు గల్లీలో దినసరికూలిగానో, చైన్నై లో భవన నిర్మాణకూలీగానో  వలస పోయి చేసిన తలకు మించిన అప్పును తీర్చేందుకు మొగుడు, పెళ్ళాం, పిల్లలు కడుపు కట్టుకొని దాచిన దానిని ఇలా వాళ్ళ జేబులో ‘చెయ్యి’ పెట్టి లాగేస్తావా? ఇది నీకు ధర్మమా? న్యాయంగుందా?

ప్రకటనలు

5 comments

  1. బస్సులు తగలపెడితే జరిగేది ఇదే. బస్సులు నడవకుండా రైళ్ళు నడవకుండా చేస్తే ఒరిగేది ఇదే. రయిలు చార్జీలు పెరిగేరోజులు దగ్గరలో ఉన్నాయి.

    1. పై సమాధానంతో పాటు నిత్యావసర సరకులు ధరలు ఆకాశాన్నంటి ప్రజలు విలవిలలాడుతున్న సందర్భంలో ఇలా ఈ చార్జీల మోత ఎందుకు, అలాగే మనమే ఈ పెరుగుదలను సమర్థిస్తామా? తెలంగాణా ఉద్యమాన్ని పక్కదారి పట్టించే కుట్ర కూడా దాగివుంది.

    1. తెలంగాణా ఉద్యమం సందర్భంగా కాలిపోయిన బస్సులే కారణమా? ప్రతిదాన్నీ తెలంగాణా కు అంటగట్టొద్దు భాయి. ఇంతకు ముందు బస్సులు తగలబడ్డ సందర్భాలే లేవా? అలా అని దీనిని సమర్ధించడంలేదు. కానీ ఇప్పుడే ఎందుకు ఇంత భారీగా పెంచాల్సివచ్చీందన్నదిప్పటి ప్రశ్న.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s