ఉస్మానియా ఉద్యమ గర్జన విజయవంతం

నేడు ఉస్మానియాలో విద్యార్థుల గర్జన విజయవంతమయి తెలంగాణా గుండెచప్పుడుని నేల నాలుగు చెరలా వినిపించింది.

అవకాశవాద రాజకీయ నాయకులను తన గర్జనతో హెచ్చరించింది.

ఉద్యమానికి దిశానిర్దేశాన్నిస్తూ ఈ నెల 5న గుజ్జర్ల తరహా రైలురోకో అందోళనకు పిలుపునిచ్చింది.

ఢిల్లీ పెద్దల ఊగిసలాటను కట్టిపెట్టాలని వెంటనే రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ను వినియోగిస్తూ తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసింది.

ఈ రోజు సభకు తెలంగాణా నలుదిశలనుండి కదిలివచ్చిన విద్యార్థి ప్రభంజనాన్ని రాజ్యం సైనికంగా ఆడ్డుకోజూస్తూ అక్రమ అరెస్టులు చేసింది. వారినందరినీ బేషరతుగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

నక్కజిత్తుల చంద్రబాబు కొత్తగా ఆలపిస్తున్న సమైక్య రాగాన్ని ఖండిస్తూ తీవ్రంగా హెచ్చరించింది.

ఏకాభిప్రాయ సాధన పేరుతో ఉద్యమంపై నీళ్ళు చల్లే కార్యక్రమంగా 5/01 సమావేశం ముగిస్తే శంషాబాద్ విమానాశ్రయం నుండి చెప్పులతో తరిమికొడతామని రాజకీయ బేహారులను హెచ్చరించింది.

ఫ్రెంచి విప్లవం నాటి విద్యార్థుల పోరాట స్ఫూర్తిని నేడు ఉస్మానియా పుణికిపుచ్చుకొని తెలంగాణా సాధనకు కృషి చేస్తున్నందుకు ఆలంబనగా నేడు లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణా విద్యార్థి లోకానికి సామాన్యుడిగ వినమ్రంగా జేజేలు పలుకుతున్నా.


ప్రకటనలు

2 comments

 1. తెలంగాణా విద్యార్ధుల పోరాట స్ఫూర్తికి జేజేలు.
  అవకాశవాద రాజకీయ నాయకుల తుప్పు వదలగోట్ట గలిగేది విద్యార్ధి శక్తే.

  చివరి క్షణం వరకు చిన్న ప్రజాస్వామిక సభకు అనుమతి ఇవ్వకుండా, అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ, అరెస్టులు చేస్తూ, తీవ్ర నిర్భంధం విధిస్తూ రాజ్యం వేదించినా సభను ఇంట గొప్పగా విజయవంతం చేయడం అపూర్వం, అద్భుతం. అమోఘం.

  తెలంగాణా విద్యార్దులరా మీరే తెలంగాణా భావి భాగ్య విధాతలు.
  జై తెలంగాణా.

  1. రాజన్న గారు మీ స్పందనకు కృతజ్ఞతలు.ఓట్ల కోసం ప్రతివాడికి యువజనులు కావాలి. కాని వాళ్ళను ప్రశ్నిస్తే విద్యార్థులకు రాజకీయాలు పనికిరావంటారు. ఈ ద్వంద్వ నీతిని తరిమికోట్టేలా తెలంగాణా యువత రెండు దశాబ్దాల తరువాత నడుం బిగించింది. యువత జాగ్రుతమైతే ఏమి జరుగుతుందో సమాజానికి ఇప్పుడు అర్థమవుతుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s