సినిమాలు అందరం చూద్దాం

సినిమా షూటింగ్ లపై దాడులు చేయొద్దు. సినిమా అన్నది సామాన్యుడికున్న ఒకే ఒక్క entertainment సాధనం. ఆ మూడు గంటలు తన ప్రేయసి కోసం హీరోతో పాటు యుద్ధాలు చేస్తాడు, ఏడుస్తాడు, నవ్వుతాడు, గెంతుతాడు. ఇలా ఆ సమయంలో తన కష్టాలు మరిచిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కావున సినిమా వాళ్ళపై దాడులు చేయడం సత్సంప్రదాయంకాదు.

కానీ ఈ సమయంలో సినిమా వాళ్ళూ  ఒక విషయం గుర్తుంచుకోవాలి. సినిమా అన్నది ఒక ప్రాంతానికి సంబధించినది కాదు. కాబట్టి వాళ్ళు సవాల్ చేయడం మానుకోవాలి. రౌడీలమని, గాజులు తొడుక్కోలేదని (గాజులు తొడుక్కున్న స్త్రీలు చేతకానివారా?), సీమ సింహాలమని మీసాలు మెలేస్తే అవి కత్తిరించబడ్తాయి కదా.

వ్యాపారస్తులు వ్యాపారస్తులులానే వుండాలి, ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రకటనలు చేయరాదు. అసలు వాళ్ళకెందుకు రాజకీయాలు?  కూడబెట్టిన సొమ్ముతో కొవ్వెక్కి రాజకీయాలలో దిగి పదవులు వెలగబెడదామన్న దుగ్ధ తప్ప. మొఖానికి రంగువేసుకుని ప్రజలను రంజింపచేసినంతవరకే వాళ్ళ పని. వాళ్ళ మధ్యనే వంద గ్రూపులు. మరల వాళ్ళకి ఈ గొడవలెందుకు. ప్రజల weakness ను సొమ్ము చేసుకుంటూ మరల వారిపై రాజకీయాధికారాన్ని చెలాయిద్దామని రోడ్డెక్కడమెందుకు. ప్రజలనుండి నాయకులు రారా? సొమ్ము తో ప్రజలను కొనేద్దామన్న తప్పుడు లెక్క తప్పు. తెలుగునాడులో ఇంక చోటులేదు. ఒకసారిచ్చి మోసపోయారు. ఇంక చాలు.

‘వ్యక్తుల ప్రైవేటు బతుకులు మనకనవసరం. పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం’ అన్న మహాకవి  శ్రీశ్రీ  వాక్యం శిరోధార్యం.

ప్రకటనలు

5 comments

  1. కోస్తా ప్రాంతం లో సినిమాలు నిషేదించాలి. నేను కోస్తా కూడు తింటూ కూడా తెలంగాణా ని సమర్దిస్తాను. అందరిని నాలాగే ఉండమని డిమాండ్ చేస్తున్నాను లేకుంటే సాహిత్య అవలోకనం చేసి హేగిలియునికి పట్టిస్తా

    1. బాగుంది మీ బెదిరింపు. ప్రాజెక్టులు పెట్టిన కూడుతో కూడబెట్టిన దానిని సినిమాలు తీసి బాగా సంపాదించి, రియలెస్టేట్ వ్యాపారాలు చేసి, రాజకీయాల ద్వారా తమ అక్రమార్జనను కాపాడుకోజూస్తున్న వీళ్ళని ప్రజలే చీకొట్టాలి.

  2. చాలా బాగా చెప్పావు.
    అలాగే ఈ బ్లోగుల్లో రాస్తున్నవారి రాతలు చూస్త్తే కూడా జాలి వేస్తున్నది.చరిత్ర తెలుసుకోకుండా ముల్క్ అనేది ఎక్కడి నుండి వచ్చింది ఎందుకు వచ్చింది దాన్ని లేకుండా చేయదాంకి ప్రెసిడెంసియల్ అర్దెర్ తేవడం ఆ తర్వాత ఆరువందల పది జీవో అవి ఏవీ అమలుకానప్పుడు తెలంగాణ ప్రజలు ఉద్యమించడం ఇవి ఏవీ కనీసం తెలుసు కోకుండా ఇస్తాం వచ్చిన బూతుల తో తిట్లకు లంకిచుకోవడమ్ వారి అవగాహన రహిత్యాన్ని తెలుపుతున్నది.అలాగే నీళ్ళు.క్రీష్ణ ,గోదావరి నదుల నీళ్ళు ఎవరు ఎన్ని వాడుకుంటున్నారు ఎన్ని వాడుకోవాలి?తెలుసుకోకుండానే తెలంగాణ ఉద్యమకారులని టిడితే ఎలా ?తిట్టి నంత మాత్రాన తెలంగాణ ఉద్యమం ఆగుతుందా?ఒక వైపు కలిసి ఉందాం అంటూనే మరఓ వైపు ఎలా టిడితే సమయిక్య త లో ని నిజాయితీ ఎంతో తెలియడమ్ లేదా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s