తెలుగుతల్లికి సిజేరియన్ చేసిన లగడపాటి?

ఈ రోజు మన జగడపాటిగారు తన సమైక్యాంద్ర ఉద్యమం తెలుగుతల్లి గర్భసంచిలోంచి పుట్టిందని సెలవిచ్చారు. ఈయనేమైనా సిజేరియన్ చేసి తీసాడా? పురిట్లోనే సంధికొట్టినట్లుంది.  లాంకో, లార్స్కో కంపెనీల ఇబ్బడి ముబ్బడిగా కూడబెట్టిన సొమ్ముతో, నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేందుకు ఫ్లాప్ సినిమాలు తీసి, ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులెగ్గొట్టి, పదవులతో అందరి నోరు మూయించొచ్చని రాజకీయాలలోకి దిగి, ఇప్పుడు రానున్న ఆంధ్ర ప్రాంతానికి తనే సి.ఎం.కావడానికి దొంగ దీక్షపూనాడు.  0peration success but patient died అన్న చందాన ఈ నెల తక్కువ పురుడుపోత ఫైయిల్ అవ్వడం ఖాయం. లేకపోతే తన పార్టీలోనే ముసలం పుట్టడం ఖాయం.

ప్రకటనలు

7 comments

 1. ఓరి తెలబానూ, తెలుగుతల్లికి పురుడుపోశాడు లగడపాటి అంటున్నావే. తెలంగాణా జిన్నా కన్నతల్లినే నరకబూనాడు గదరా!

  1. అనామికుడుగారూ లగడపాటి అన్నదే నేనూ అన్నాను. ఎవరైనా గర్భంలోంచి వచ్చిందంటారు కానీ, గర్భ సంచిలోంచి వచ్చిందనరు. కృత్రిమత్వం చోటుచేసుకున్నందునే ఇలాంటి మాటలు వస్తాయి సారూ. మీలా దిగజారిపోయిలేము సారూ.

 2. లగడపాటి ఎటువంటివాడైనా కావచ్చు. వాళ్ళు చేస్తున్న దీక్షను అవహేళన చేయడం మంచి పద్ధతి కాదు. కెసిఆర్ దీక్షపై కూడా అనేక రకాల కామెంట్లు వచ్చాయి. ఫ్లూయిడ్స్ ఎక్కించారని, సాయంత్రం కాగానే ఇడ్లీలు తిన్నాడని ఇంకా అనేకం… అయితే ఇక్కడ సమస్య ఏమిటనేదానిపైనే విమర్శలు వుండాలి, పోరాటమూ సమస్యను ప్రతిబింబించేదిగానే వుండాలి. నిజంగా మాట్లాడితే కెసిఆర్ సంగతి ఏమిటి? తన పలుకుబడి పూర్తిగా పడిపోయిన ప్రతిసారీ ఏదోఒక సమస్యను తెరపైకి తెచ్చి పబ్బం గడుపుకునే ఉదాహరణలు అనేకం వున్నాయి. వైఎస్ వున్నంతకాలం బయటకు ముఖం కూడా చూపలేకపోయాడు. తను గెలిచిన మహబూబ్ నగర్ కు కూడా వెళ్ళలేని పరిస్థతి. ఆఖరికి ఆ నియోజకవర్గ ప్రజలు కూడా కెసిఆర్ కనబడుటలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి వాస్తవం కాదా? మరి ఆ ఫిర్యాదు చేసినవారు లగడపాటికి ఏమవుతారు? ఇట్లాంటి ఉదాహరణలు అనేకం చెప్పవచ్చు. అందుకని వీటన్నిటి జోలికి వెళ్ళకుండా సమస్యపైనే మాట్లాడితే బాగుంటుంది.

  1. కె.సీ.ఆర్.దీక్ష వలన తెలంగాణా ప్రకటణ రాలేదు. ఉద్యమం విద్యార్థుల చేతుల్లోకి పోయి, యువత మేల్కొని నాయకత్వం వహించిన కారణంగానే తమ ఉనికిని కాపాడుకునేందుకు రాజకీయులు ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇన్నాళ్ళూ అన్ని పార్టీలు తెలంగాణాకు మద్ధతు పలికి ఎన్నికల జాతరలో తమ ఉనికిని కాపాడుకున్నాయి. తెలంగాణా ప్రాంతానికి ఎన్నికలు పోలింగ్ ముగిసిన దాకా ఒక మాట మాట్లాడి, ఆంధ్రా ప్రాంతానికి వచ్చేసరికి తన అసలు నైజాన్ని బయటపెట్టిన వై.ఎస్. కుతంత్రం, చేతకాని తనం ఆరోజే బయటపడింది. రాష్ట్రమంతా ఒకేసారో, లేక రెండు ప్రాంతాలను కలుపుతూ ఎన్నికలు జరిగివుంటే మొన్న కాంగీవాళ్ళూ అధికారంలోకి వచ్చి వుండేవారా? తెలంగాణా సెంటిమెంటును రేప్ చేయడానికి ఎవరూ వెనకాడ లేదు. ఇంక ఎంతో కాలం మోసం జేయలేరు.
   కె.సీ.ఆర్.పై నేనూ ఇంతకు ముందు పోస్టులలో వ్యంగ్య్ంగానే రాసాను. శ్రీకాంత్ కు పెట్రోల్ – కె.సీఅర్కు పండ్ల రసమని. పబ్లిక్ లో నిలబడితే ఎవరినైనా నిలదీయొచ్చు.

  1. విడిపోయినందువలన మనకు కొత్తగా వచ్చే నష్టమేముంటుంది. ఎవరి వుద్యోగాలు పోవు. ఇప్పటికే జోన్ల పేరుతో ఎవరి జోన్లలో వారికే రికౄట్మెంట్లు జరుగుతున్నాయికదా? మరి విడిపోతే మన వుద్యోగాలలో తెలంగాణా వారి పోటీ వుండదు. అది మనమంచికే. వ్యాపారస్తులు, హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టినవారికి వారి ఆస్తులపై భయమే తప్ప మనలాంటి సామాన్యులకు జరిగిపోయే నష్టమేమిటి? ఇప్పటికే చంద్రబాబు, వైఎస్ లు చాలా వరకు హైదరాబాదు చుట్టుపక్కల అమ్మేసారు. కొన్నవారికి భయం. దొంగ రిజిస్ట్రేషన్ లతో భూములు కొన్నవారికి భయం. సామాన్యులకు ఏమి భయం. ఎవడి జాగాలో వాడుంటాడు. ఇక్కడి వాళ్ళు వెళ్ళి ఇతర రాష్ట్రాలల్లో వ్యాపారాలు, కాంట్రాక్టలు చేస్తున్నారు కదా. పై రాష్ట్రం వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేయడం లేదా? ఒకే భాష? కాబట్టి అంత ఇబ్బందేమి వుంటుంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s