రాజకీయ వ్యవస్థ వైఫల్యం – ఖాకీ రాజ్యం పుట్టుక

వ్యవస్థ సజావుగా నడవడానికి మనం రూపొందించుకున్న కాపీ రాజ్యాంగాన్ని కూడా సరిగా ఉపయోగించుకొన లేకపోవడం కూడా నేటి మన దుస్థితికి కారణమయ్యింది. ప్రజలలో పేరుకున్న నిస్తేజాన్ని వాడుకొని పాలకులు మన నెత్తినెక్కారు.

సమస్యకు పరిష్కారంగా రాజకీయ చొరవ చూపాల్సిన చోట కూడా దానిని బలవంతంగా అణగదొక్కడానికి చూస్తూ తమ అధికారాన్ని నిలుపుకునేందుకు షార్ట్ కట్ గా పోలీసుల చేతిలో పెట్టడంతో ఇంక వారు తమకు సంక్రమించిన అపరిమిత అధికారాలతో జనం మీద పడి దారుణంగా తమకు కూడు పెడుతున్న జనాల రక్తం చూస్తున్నారు. ఈనాడు వైద్య శిబిరాల ఏర్పాటు దగ్గర్నించి, ఋణసదుపాయాలు, రహదారి ఏర్పాట్లు వంటి కనీస అవసరాలు తీర్చే వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేయాల్సిన కార్యకలాపాలు కూడా అన్నీ తామే అయి అమలుచేసే స్థితికి చేరుకున్నారు. దీనివలన వారు రాజ్యాంగాతీతులుగా తయారయి, రాజకీయ వ్యవస్థకు జవాబుదారులుగా వుండాల్సిన దానిని మరిచి వారిని శాసించే,స్థితికి చేరుకున్నారు.

ఇది మన రాజకీయ వ్యవస్థ వైఫల్యం. ప్రజల అచేతనా స్థితికి దర్పణం.

ప్రకటనలు

3 comments

 1. ఇదే వ్యవస్థ కసబ్ ను, అఫ్జల్ ను ఏండ్ల తరబడి మటన్ బిర్యానీలు పెట్టి మేపుతుంది. వాళ్ళ కోసం లక్షలు ఖర్చు పెడుతుంది.
  ఉస్మానియా విద్యార్ధిని మాత్రం గొడ్డును బాడి నట్టు బాదుతుంది.
  మనిషన్న వాడు గొడ్డును కూడా అంట దారుణంగా బాదలేదు.
  నేలమీద పది పోయిన విద్యార్ధి మీద కొదరు దుడ్డు కర్రలు పట్టుకుని, మరి కొందరు ఎంత కొట్టినా విరగని ప్లాస్టిక్ లాటీలు పట్టుకుని కొందరు సివిల్ డ్రస్సులో వుండి (పోలీసులో లేక కిరాయి గుండాలో ఎవరో తెలియదు) కొడుతున్న దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరికి ఇదా గాంధీ పుట్టిన దేశం ఇదా మనం కోరుకున్న స్వరాజ్యం బ్రిటీష్ వాడు కూడా ఇంత దారుణంగా వ్యవహరించాలేదే ఉద్యమకారులతో అని గుండెలు అవిసిపోయాయి.

  కిందపడి కాళ్ళా వెళ్ళా పడుతున్న ఆ విద్యార్ధి మీద పడ్డ లాటీ దెబ్బలు మొత్తం 28 అట.
  కసబ్ కంటే జై తెలంగాణా అనే వాడా చాలా ప్రమాదకరమైన శత్రువుగా కనిపిస్తున్నాడు మన బానిసవ్యవస్థకి.

 2. I read your commentaries and poems in your new blog ‘samanyudu’.I agree with your views on our police force. I think the students of the University should not have resort to violence. They are merely pawns in the hands of politicians. KCR is pursuing his own political ambitions. The common people like Srikanth who are unable to understand the real motive behind their leaders sacrificing their valuable lives without achieving anything.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s